Kaziranga Accident: అస్సాంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కాజీరంగా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఒక బస్సు వేగంగా వచ్చి ఎదురుగా ఉన్న ట్రక్కును బలంగా ఢీకొట్టింది. ఈ పెను విషాద ఘటనలో 20 మందికి పైగా ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 35 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఢీకొన్న తీవ్రతకు బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. మిగిలిన ప్రయాణికుల్లో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు, రెస్క్యూ అధికారులు ఘటనా స్థలికి చేరుకుని యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. స్థానికుల సహాయంతో బస్సులో చిక్కుకున్న వారిని బయటకు తీశారు. గాయపడిన క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ట్రక్కును ఢీకొన్న బస్సు, 20 మందికి పైగా మృతి
అస్సాంలోని కాజీరంగా ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 35 మంది ప్రయాణికులు ఉన్నట్లు… pic.twitter.com/UpxUEW8JJu
— BIG TV Breaking News (@bigtvtelugu) November 13, 2026
Also Read: ఆటో డ్రైవర్లకు సర్కారు బంపర్ ఆఫర్.. రూ.220 కోట్లతో 2,000 ఫ్లాట్లు.. ఎక్కడెక్కడ కడుతున్నారంటే?