E-Paper
Advertisement

ఫ్యామిలీ వీక్ లో సెలబ్రిటీ గెస్ట్ లు.. ఎవరి తరఫున ఎవరు రాబోతున్నారో తెలుసా?

ఫ్యామిలీ వీక్ లో సెలబ్రిటీ గెస్ట్ లు.. ఎవరి తరఫున ఎవరు రాబోతున్నారో తెలుసా?
Advertisement

Bigg Boss 10:బిగ్ బాస్ .. వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో గా గుర్తింపు తెచ్చుకున్న ఈ షో.. ఇప్పటికే వివిధ భాషలలో పలు సీజన్ లు కంప్లీట్ చేసుకుంటూ మంచి ప్రేక్షక ఆదరణ దక్కించుకున్న విషయం తెలిసిందే. అలాంటి ఈ బిగ్ బాస్ తెలుగులో ఇప్పటికే 9 సీజన్లు పూర్తి చేసుకోగా.. పదవ సీజన్ కూడా 10వ వారానికి చేరుకుంది. ఫ్యామిలీ వీక్ లో భాగంగా రోజుకు ఇద్దరేసి కంటెస్టెంట్ల చొప్పున ఫ్యామిలీ మెంబర్స్ హౌస్ లోకి వస్తున్నారు. ఫ్యామిలీ వీక్ లో భాగంగా సెలబ్రిటీలు కూడా కంటెస్టెంట్స్ తరఫున స్టేజ్ పైకి రాబోతున్నారు. మరి ఏ కంటెస్టెంట్ తరఫున ఏ సెలబ్రిటీ స్టేజ్ పైకి రాబోతున్నారు ఇప్పుడు చూద్దాం..

కంటెస్టెంట్స్ కోసం సెలబ్రిటీలు..

బిగ్ బాస్ సీజన్ 10 లో ఫ్యామిలీ వీక్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఫ్యామిలీ వీక్ లో భాగంగా సెలబ్రిటీ గెస్ట్లు సందడి చేయబోతున్నారు. అందులో భాగంగానే త్రిగుణ్ తరఫున ప్రముఖ సినీ నిర్మాత సాయి రాజేష్ స్టేజ్ పైకి రానున్నారట. అలాగే సీరియల్ యాక్టర్స్ దేబ్జానీ కోసం ప్రముఖ సీరియల్ నటుడు, మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ అమరదీప్ చౌదరి రానున్నారు అని సమాచారం. ఇక శివ కుమార్ కోసం గౌతం కృష్ణ రానుండగా.. ముఖేష్ కోసం నిఖిల్ మలియక్కల్ స్టేజ్ పైకి రానున్నారు. ఇక రాంప్రసాద్ కోసం గెటప్ శ్రీను , నరేష్ కోసం బుల్లెట్ భాస్కర్, శ్వేత కోసం సందీప్ మాస్టర్, సుధీర్ రెడ్డి కోసం డెమోన్ పవన్, అమన్ కోసం సోహెల్ స్టేజ్ పైకి రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి మరి ఇందులో నిజానిజాలు రాబోయే శని ఆదివారం ఎపిసోడ్లలో తేడా ఉన్నాయి.

10వ వారం నామినేషన్ లిస్ట్..

Advertisement

ఇకపోతే ఈ వారం మొత్తం 12 మంది నామినేషన్ లో ఉన్న విషయం తెలిసిందే. వంశీ కెప్టెన్ కావడంతో ఈ వారం నామినేషన్ నుండి ఆయన తప్పించుకున్నారు. త్రిగుణ్, ముఖేష్, శివకుమార్, రామకృష్ణ, సుధీర్ రెడ్డి, అమన్, వర్షిణి సౌందరరాజన్, నీతూ నటరాజ్, శ్వేతా నాయుడు, దెబ్జానీ, ఆటో రాంప్రసాద్, జబర్దస్త్ నరేష్.

also read:త్రిగుణ్, వంశీ పై నటరాజ్ రియాక్షన్.. నీతూతో ఏం చెప్పారంటే?

ఈవారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే?

Advertisement

ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఎప్పటిలాగే ఓటింగ్లో ముఖేష్ , త్రిగుణ్ నువ్వా నేనా అన్నట్టుగా పోటీపడుతున్నారు. రోహిత్ హౌస్ లో నుండి ఎలిమినేట్ కావడంతో రోహిత్ అభిమానులు ముఖేష్ కి ఓట్లు వేస్తున్నారు. అటు త్రిగుణ్ టైటిల్ రేస్ లో దూసుకుపోతున్న నేపథ్యంలో ఈయనకి కూడా భారీగానే ఓటింగ్ లభిస్తుంది. ఇకపోతే లిస్టులో శివ కుమార్, నీతూ మాస్టర్, శ్వేత ఉన్నట్లు సమాచారం. ఈవారం మొత్తం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని, అందులో భాగంగానే ఇద్దరు హౌస్ నుండి బయటకు వెళ్తారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ వారం బిగ్ బాస్ సీజన్ 10లో 10వ వారం ఎలిమినేట్ అయ్యే ఆ ఇద్దరు కంటెస్టెంట్స్ ఎవరో రేపటి ఎపిసోడ్లో తెలియనుంది.

Related News

డైరెక్టర్ గా కంటే ఆర్టిస్ట్ గా ఉండడమే మంచిది.. కడుపు నిండా తినలేని పరిస్థితి: జబర్దస్త్ బాబు

త్రిగుణ్, వంశీ పై నటరాజ్ రియాక్షన్.. నీతూతో ఏం చెప్పారంటే?

త్రిగుణ్ కి కండీషన్ పెట్టిన భార్య?

Nuvvu leka Nenu Lenu : అయ్యో.. రాధ ఇక కనిపించదా..? ఫ్యాన్స్ హర్ట్..

Illu illaalu Pillalu : లేడీ ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. ధీరజ్ పెళ్లి ఫిక్స్..?

Karthika Deepam 2 Serial Today Episode November 13th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్, జ్యోత్న్స మెడలో తాళి కడతాడా..?      

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ ఫుల్ హ్యాపీ.. భద్ర, భాగ్యం ప్లాన్ సక్సెస్..? వల్లికి ఘోర అవమానం..

Big Stories

Advertisement
×