E-Paper
Advertisement

జబర్దస్త్ లో దర్శనమిచ్చిన ‘అగ్నిపరీక్ష’ రాజకుమారి!

జబర్దస్త్ లో దర్శనమిచ్చిన ‘అగ్నిపరీక్ష’ రాజకుమారి!
Advertisement

Raja Kumari:అగ్నిపరీక్ష సీజన్ 2 లో కంటెస్టెంట్ గా పాటిస్పేట్ చేసి తన పెర్ఫార్మెన్స్ తో జడ్జెస్ ను మెప్పించే ప్రయత్నం చేసింది రాజకుమారి. కామనర్ గా హౌస్ లోకి అడుగుపెట్టిన ఈమె.. అక్కడ తన ప్రతిభతో అందరినీ మెప్పించింది. ఇక హౌస్ లోకి వెళుతుందని అందరూ అనుకున్నారు. అయితే మొదటిసారి అవకాశం రాకపోయినా.. కనీసం వైల్డ్ కార్డు ద్వారా అయినా సరే ఈమెకు అవకాశం లభిస్తుంది అని ఆడియన్స్, అభిమానులు అనుకున్నారు. కానీ మొత్తానికి బిగ్ బాస్ ఈమెకు హ్యాండ్ ఇచ్చింది. అయితే బిగ్ బాస్ హ్యాండ్ ఇస్తేనేమి ఈమెకు మరో అద్భుతమైన ప్లాట్ఫారం దొరికేసింది. మరి అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..

హ్యాండ్ ఇచ్చిన బిగ్ బాస్..

కామనర్స్ ను ఎంపిక చేయడానికి అగ్నిపరీక్ష కార్యక్రమం బాగా సెట్ అవ్వడంతో బిగ్ బాస్ సీజన్ 10 కి కూడా అగ్నిపరీక్ష సీజన్ 2 ప్రారంభించారు. ఇందులో రాజకుమారి డయానాకి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఆమె కథకి జ్యూరీ మెంబర్స్ వెంటనే మూడు గ్రీన్ సిగ్నల్స్ ఇచ్చారు. ఈ మూడు గ్రీన్ సిగ్నల్స్ అందుకొని నేరుగా ఆమె టాప్ 15 లోకి వెళ్లిపోయింది. అక్కడ కూడా మంచిగా ఆటలు ఆడుతూ అందరిని ఆకట్టుకుంది. పైగా అక్కడి గ్రీన్ బ్యాడ్జిలను కూడా ఆమె సంపాదించుకుంది. కచ్చితంగా హౌస్ లోకి వెళుతుందని, జ్యూరీ సెలెక్ట్ చేస్తుందని అందరూ అనుకున్నారు. చివరికి సృష్టి, షాలిని, అపూర్వ వంటి గ్లామర్ క్యాటగిరిలోనే సెలెక్ట్ చేశారు.. అయినా బిగ్ బాస్ టీం కి ఉండే లెక్కలు ఉంటాయి. అయితే రాజకుమారిని మొదటి నుంచి పైకి లేపి.. చివరికి సింపుల్ గా పక్కన పెట్టినట్టు అనిపించింది. అయితే ఇప్పుడు ప్రత్యామ్నాయంగా జబర్దస్త్ షో కి వెళ్లి అక్కడే సెటిల్ అయినట్టుగా కనిపిస్తోంది.

జబర్దస్త్ నూకరాజు టీంలో అవకాశం..

Advertisement

అప్పుడప్పుడు జబర్దస్త్ స్కిట్ లలో కనిపించే ఈమె.. ఇప్పుడు నూకరాజు టీం లో ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఇకపై అక్కడే రాజకుమారి ప్రయాణం సాగేలా కనిపిస్తోంది. మరి జబర్దస్త్ లో ఈమె తన స్థానాన్ని పదిలం చేసుకొని.. స్టార్ మా ఈవెంట్లలో , షోలలో కూడా కనిపిస్తుందా? లేక ఈమెను స్టార్ మా పూర్తిగా పక్కన పెడుతుందా అన్నది చూడాలి. ఏది ఏమైనా అగ్నిపరీక్ష కంటెస్టెంట్ గా రాజకుమారికి మంచి పేరు, క్రేజ్ తో పాటు ఫాలోయింగ్ కూడా ఏర్పడింది. మరి చూద్దాం మును ముందు ఏం జరుగుతుందో.

also read:ఒక్క జాతకం చెప్పడానికి వేణుస్వామి ఎంత తీసుకుంటారో తెలుసా?

సీజన్ 10 కి అగ్ని పరీక్ష 2వర్కౌట్ కాలేదా?

Advertisement

ఇకపోతే అగ్నిపరీక్ష విషయానికి వస్తే.. బిగ్ బాస్ సీజన్ 9 లో ఈ అగ్ని పరీక్ష ద్వారా హౌస్ లోకి కామనర్స్ కేటగిరీలో అడుగుపెట్టిన కళ్యాణ్ పడాల ఏకంగా విజేతగా నిలవగా. డెమోన్ పవన్ రన్నరప్ గా నిలిచి అందర్నీ ఆశ్చర్యపరిచారు. అయితే ఈ సీజన్ 2 కూడా అంతే స్థాయిలో వర్కౌట్ అవుతుంది అనుకున్నారు కానీ ప్రస్తుతం కామనర్సుగా అడుగుపెట్టిన వారు ఇద్దరు మినహా పెద్దగా కనిపించలేదు. ఇక అమ్మాయిలైతే హౌస్ లో ఎవరూ లేరు. హౌస్ లోకి వచ్చిన రెండు మూడు వారాల్లోనే అందరూ వెళ్లిపోయారు షాలిని ఎలాగో 7 వారాలపాటు నెట్టుకొచ్చింది కానీ ఆమె కూడా హౌస్ నుండి వెళ్ళిపోయింది. రోహిత్ అయిన విన్నర్ అవుతారు అనుకున్నారు కానీ అది కూడా జరగలేదు. ఇక ఈసారి ఆటను బట్టి చూస్తే సెలబ్రిటీలే విజేతలుగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Related News

నాగవ్వ పాట..వైష్ణవి సోనీ డ్యాన్స్.. ఫోక్ లవర్స్‌కు పూనకాలే!

బైక్ కాదు బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్ అడగాల్సింది.. ఒక్క హిట్ కే రేంజ్ మార్చిన జబర్దస్త్ బాబు!

ఒక్క జాతకం చెప్పడానికి వేణుస్వామి ఎంత తీసుకుంటారో తెలుసా?

ఫ్యామిలీ వీక్ లో సెలబ్రిటీ గెస్ట్ లు.. ఎవరి తరఫున ఎవరు రాబోతున్నారో తెలుసా?

డైరెక్టర్ గా కంటే ఆర్టిస్ట్ గా ఉండడమే మంచిది.. కడుపు నిండా తినలేని పరిస్థితి: జబర్దస్త్ బాబు

త్రిగుణ్, వంశీ పై నటరాజ్ రియాక్షన్.. నీతూతో ఏం చెప్పారంటే?

త్రిగుణ్ కి కండీషన్ పెట్టిన భార్య?

Big Stories

Advertisement
×