Podarillu Today Episode October 28th: మాధవ్ మటన్ బిర్యానీ చేసి అందరికీ గుమగుమగా సువాసనలు వెదజల్లు ఎలా చేయాలి అని అంటారు.. అయితే మాధవ్ చేసిన బిర్యానీ సువాసనలు ఎక్కడికో వెదజల్లుతున్నాయని ఇంట్లోని వాళ్ళందరూ కూడా గుమగుమలు వస్తున్నాయని అందరూ కూడా ఒక పట్టు పట్టాలి అని అనుకుంటారు అయితే మనిషా కోసం బిర్యాని తీసుకెళ్లాలి అని అనుకున్న మాధవ్.. ఇంట్లోని వాళ్లందరూ కూడా స్నానం చేసి రా కొండి అని ఎంత చెప్తున్నా సరే అసలు వినకుండా మాధవ్ ఆలోచిస్తూ ఉంటాడు. అందరూ మొహం కడుక్కోడానికి వెళ్ళినట్టే వెళ్లి అక్కడ ఏం జరుగుతుందో అని చూస్తూ ఉండిపోతారు.. అయితే మాధవ్ హాట్ బాక్స్ లో బిరియాని తీయడం చూసి ఎందుకు ఏమైంది అని ఆలోచిస్తూ ఉంటారు..
అయితే మాధవ్ బిర్యానీ పెట్టేసి అక్కడ ఫ్రెష్ అయ్యి రావాలి అని అనుకుంటారు.. అయితే అది చూసిన ముగ్గురు తమ్ముళ్లు మాధవ్ ని ఒక ఆట ఆడుకోవాలని అనుకుంటారు.. ఎలాగైనా సరే అన్నయ్య బిర్యానీ దాచిపెట్టి అన్నయ్యని ఏడిపించాలి అని అనుకుంటారు. ఒకచోట దాన్ని దాచి పెట్టేసి మాధవని ఆట పట్టిస్తాడు. మాధవ్ ఇందంతా వెతికి ఎక్కడ పెట్టాను అని ఆలోచిస్తూ ఉంటాడు చివరికి తమ్ముల దగ్గర అడ్డంగా దొరికిపోతాడు.. ఇక మహాలక్ష్మి దగ్గర కూడా మనీషాకి బిర్యానీ తీసుకెళుతున్నాను అని చెప్పగానే.. తను కూడా ఒక ఆట ఆడుకుంటుంది. మొత్తానికి మాధవ్ బిర్యాని తీసుకొని వెళ్తాడు.. మనిషా మాధవ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక అందరూ కలిసి బిర్యాని తింటారు మనీషా మాధవ్ ఇద్దరూ చూపులతోనే ఒకరినొకరు చూసుకుంటూ ప్రేమగా పలకరించుకుంటూ ఉంటారు. అది చూసిన బన్సీ వీరిద్దరూ కూర్చొని ఉండండి నేను వెళ్తాను అని అంటాడు.. మొత్తానికి వీళ్ళిద్దరికి కన్వర్జేషన్ ఎపిసోడ్కి కాస్త హైలైట్ గా నిలుస్తుంది.. మనిషా తన బావ మళ్లీ ఫోన్ చేశాడని చాలా బాధపడిపోతూ ఉంటుంది అయితే మాధవ్ మాత్రం అది నేను చూసుకుంటాను నువ్వేం బాధపడకు అని అంటాడు.
మహాలక్ష్మి అందరితో మాట్లాడుతుండగా కన్నా తన తల్లి పోవడానికి కారణం నారాయణాన్ని చాలా కోపంగా ఉంటాడు. లోపలికి వెళ్ళిన నారాయణ అక్కడ ఉన్న బొమ్మని చూసుకోకుండా చొక్కాని తీయడంతో ఆ బొమ్మ పగిలిపోతుంది.. అయితే అది చూసిన కన్నా అక్కడికి వెళ్లి ఏంటయ్యా.. పెద్దమనిషి మా అమ్మని పంపించేసావా ఇప్పుడు బొమ్మను కూడా పగలగొట్టేసావా నువ్వు అసలు మనిషివేనా అని అంటాడు. అయితే ఆ బొమ్మకి ఆయనకు ఏ సంబంధం లేదు అని ఎంత చెప్తున్నా సరే కన్నా మాత్రం అస్సలు వినకుండా నారాయణతో గొడవపడతాడు. నారాయణ చాలా సీరియస్ అయినా కూడా మౌనంగానే వెళ్ళిపోతూ ఉంటాడు నా బొమ్మని తెచ్చి ఇవ్వు అని అంటున్న సరే వినకుండా నారాయణ వెళ్ళిపోవడంతో మాధవ్ నేను ఆ బొమ్మని కొనిస్తాలే అని అంటాడు కానీ కన్నా మాత్రం మీ అమ్మని చంపేసి మా అమ్మని తెచ్చినట్టుగా నువ్వు బొమ్మను తెస్తావని అంటాడు..
కన్నా నారాయణని తప్పుగా మాట్లాడడంతో మహాలక్ష్మి చాలా కోపంగా ఉంటుంది. నీకు ఎన్ని సార్లు చెప్పాను. ఆయనకు మీ అమ్మకు ఎటువంటి సంబంధం లేదు అని కానీ నువ్వు అస్సలు వినకుండా ఇలా ఆయనపై సీరియస్ అవుతున్నావు. మర్యాదగా ఉండు అనేసి ఎంతగా చెప్తున్నా సరే కన్నా మాత్రం మా అమ్మని చంపేశాడు అనేసి అంటుంది. అయితే మహా ఎంత చెబుతున్న సరే కన్నా మాత్రం అస్సలు వినకపోవడంతో కన్నాని కొడుతుంది ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. ఆయన గురించి నీకేం తెలుసని మాట్లాడుతున్నావు ఎందుకు నువ్వు ఆయనని ఇలా తప్పుగా అనుకుంటున్నావు నీ కన్నతండ్రి గురించి నువ్వు ఇలా మాట్లాడటం అవసరమా అని వార్నింగ్ ఇస్తుంది.. కానీ ఎంతగా చెబుతున్నా సరే అసలు వినకపోవడంతో మహాలక్ష్మి సీరియస్ అవుతుంది. దాంతో అక్కడితో కన్నా వెళ్లిపోతాడు.
మహాలక్ష్మి నారాయణని అంతగా సపోర్ట్ చేయడంతో ఇంట్లో వాళ్ళందరికీ ఒక్కసారిగా అనుమానం వస్తుంది. అయితే అక్కడికి ఏం జరిగింది అని తెలుసుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తారు. క చక్రి నారాయణ గురించి మీకేం తెలుసు అని మీరు ఆయనని సపోర్ట్ చేస్తున్నారు. అసలు నారాయణ గురించి మీకేం తెలుసు కన్నా గురించి మీకేం తెలుసు అని మహాలక్ష్మిని చక్రి అడుగుతాడు. ఆ నిజం తెలిసి తట్టుకునే శక్తి మీకుందా..? అసలా నిజమంటే మీకు చెప్తాను అని మహాలక్ష్మి అనగానే మాధవ్ మాత్రం అస్సలు వద్దు అని అంటాడు.. అయితే మహాలక్ష్మి చెప్పిన నిజం విని ఇంట్లోని వాళ్ళు ఒక్కసారిగా షాక్ అవుతారు. నారాయణ గ్రేట్ అని అనుకుంటారు అయితే మా అమ్మ ఎందుకు చనిపోయింది అని ఆలోచిస్తారు మొత్తానికి నారాయణ గురించి భయంకరమైన నిజం తన కొడుకులకు తెలిసిపోవడంతో నారాయణ మీద ప్రేమ పెరిగిపోతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ ఏం జరుగుతుందో చూడాలి..