Nindu Noorella Saavasam Serial Today Episode: రామ్మూర్తి తీసుకొచ్చిన వ్యక్తి ( పార్థు అని మిస్సమ్మకు తెలియదు) ఫ్యామిలీ గురించి తెలుసుకుని వాళ్ల ఫ్యామిలీకి ఆయనను అప్పగించాలని చెప్పడానికి రాథోడ్‌కు కాల్ చేస్తుంది మిస్సమ్మ. పార్థు గురించి చెప్పి వెంటనే ఆయనకు హెల్ప్ చేయమని అంటుంది. పక్కనే ఉన్న అమర్ ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావని అడిగితే.. రామ్మూర్తి వాళ్ల ఇంటికి వెళ్లానని చెప్తుంది మిస్సమ్మ. ఎందుకు వెళ్లావు అంటూ అమర్ అడిగితే.. పండక్కి పిలవడానికి వచ్చానను మిస్సమ్మ చెప్తుంది. పండక్కి పిలవడం ఇలాగా..? ఇద్దరం వెళ్లి పిలిస్తే బాగుండేది కదా ఉండండి నేను వస్తాను అంటూ అమర్ చెబితే..
వద్దు లేండి నేను చెప్పాను కదా మా నాన్న పిన్ని ఏమీ అనుకోరులేండి అంటూ మిస్సమ్మ చెప్తుంటే.. రామ్మూర్తి ఫోన్ తీసుకుని అమర్ ను స్పెషల్‌గా ఏమీ రావొద్దని చెప్తాడు. మిస్సమ్మ పిలిస్తే మీరు పిలిచినట్టే మీరిద్దరూ నాకు రెండు కళ్లలాంటి వారు అంటాడు. పక్కనే ఉన్న మంగల మనసులో మరి నేను ఎవరు తలనా..? తలనొప్పినా..? అనుకుంటుంది. మిస్సమ్మ, అమర్‌కు మీరు ఫోన్‌లో పిలవండి అని చెప్తుంది. మామయ్యగారు మీరు రేపు తప్పకుండా ఇంటికి రావాలి. పోయిన సంవత్సరం పిల్లలతో కలిసి ఎంత బాగా ఎంజాయ్ చేశమో ఈ సారి కూడా అలాగే ఎంజాయ్ చేద్దాం అంటాడు అమర్. రామ్మూర్తి సరే అంటాడు. మిస్సమ్మ ఫోన్ తీసుకుని మీరు ఇప్పుడు ఎక్కడున్నారు అని అడిగితే.. ఎందుకు చెప్పాలి అంటూ అమర్ కట్ చేస్తాడు.
కాల్ కట్ చేయగానే.. మిస్సమ్మ కోపంగా చూశారా నాన్న ఎప్పుడు ఆయన మాటే వినాలి.. నా మాట అసలు వినరు అంటూ బాధపడుతుంటే.. మంగళ అవును భాగీ ఈ మగాళ్లు అందరూ ఇంతే అంటుంది. రామ్మూర్తి కోపంగా మంగళను తిడతాడు. మిస్సమ్మ మాట వరసకు చెబుతుంది. నువ్వేమో వంకరగా మాట్లాడుతున్నావు అంటాడు. మిస్సమ్మ ఇక తాను వెళ్లి వస్తానని చెప్తుంది. ఆ మాట నేరుగా వెళ్లి పార్థు చెవిలో పడుతుంది. పార్థు నిద్రలోంచి లేచి బయట మాట్లాడుతున్న మిస్సమ్మ మాటలు అబ్జర్వ్ చేస్తుంటాడు. మిస్సమ్మ తాను వెళ్లొస్తానని లేచి వెళ్లిపోతుంది. అప్పుడే రూంలోంచి బయటకు వచ్చిన పార్థు బయట వెళ్తున్న మిస్సమ్మను చూసి షాక్ అవుతాడు.
పార్థు తలలో తీవ్రమైన నొప్పి వస్తుంది. తల పట్టుకుని బాధపడుతుంటాడు. మిస్సమ్మ వెళ్లిపోయాక రామ్మూర్తి ఇంట్లోకి వచ్చి తల పట్టుకుని బాధపడుతున్న పార్థు చూసి ఏమైంది బాబు అని అడుగుతాడు.. ఇప్పుడు వచ్చింది..? అంటూ పార్థు అడిగితే.. మా అమ్మాయి ఇదిగో ఆ ఫోటో లో ఉంది అంటూ గోడకున్న అమర్, మిస్సమ్మల ఫోటో చూపిస్తాడు. ఆ ఫోటో చూసి పార్థు తల పట్టుకుని కింద పడిపోతాడు. పార్థు స్పృహ కోల్పోవడంతో రామ్మూర్తి కంగారు పడుతుంటాడు. మంగళ సాయంతో పార్థును తీసుకెళ్లి రూంలో పడుకోబెట్టి మా అల్లుడు త్వరగానే మీ కుటుంబాన్ని వెతికి పట్టుకుంటాడు. అంతవరకు కాస్త రిలీఫ్ గా ఉండు బాబు అని బాధపడుతుంటాడు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.