E-Paper
Advertisement

నీతో స్నేహం నాకొద్దు.. ఎప్పటికైనా సారీ చెబుతావ్ !

నీతో స్నేహం నాకొద్దు.. ఎప్పటికైనా సారీ చెబుతావ్ !
Advertisement

Bigg Boss 10: బిగ్ బాస్ సీజన్ 10 ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తోంది. ఇకపోతే ఈ సీజన్లో కామనర్ కేటగిరీలో అడుగుపెట్టిన రోహిత్, సెలెబ్రిటీ కేటగిరిలో అడుగుపెట్టిన త్రిగుణ్ ఇద్దరు టైటిల్ పోరులో నిలబడతారని, ఖచ్చితంగా రోహిత్ టైటిల్ సొంతం చేసుకుంటారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. కానీ అనూహ్యంగా రోహిత్ హౌస్ నుండి వెళ్లిపోవడం, అటు రోహిత్ కి మరో ఛాన్స్ ఇచ్చినా.. బిగ్ బాస్ ఆఫర్ ను తిరస్కరించడంతో.. అందరూ త్రిగుణ్ విజేత అవుతారంటూ ముందుగానే జోష్యం చెప్పేస్తున్నారు.

హౌస్ లోకి అడుగుపెట్టిన తేజ, శోభ..

ఇదిలా ఉండగా టికెట్ టు ఫినాలే రేసులో భాగంగా టాప్ ఫైవ్ లో దూసుకుపోవడానికి కంటెస్టెంట్స్ గట్టిగానే పోటీ పడుతున్నారు. ఇందులో భాగంగానే టాస్క్ లో గెలిచి ముఖేష్ మొదటి కంటెస్టెంట్ గా గ్రాండ్ ఫినాలే కి చేరువయ్యారు. ఇక బిగ్ బాస్ హౌస్ చివరి కెప్టెన్ అవ్వడానికి కంటెండర్ షిప్ పొందడం కోసం బిగ్ బాస్ గత సీజన్ల కంటెస్టెంట్స్ హౌస్ లోకి వచ్చి వీరికి సపోర్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే తాజాగా విడుదల చేసిన లేటెస్ట్ ప్రోమోలో టేస్టీ తేజ, శోభా శెట్టి హౌస్ లోకి అడుగుపెట్టారు.. రావడంతోనే తన పంచ్ డైలాగ్ లతో అందరిని నవ్వించాడు తేజ. మీ అందరికంటే నేనే సీనియర్.. మీరు 17 వారాలు ఉంటారు. నేను 18 వారాలు ఉన్నాను అంటూ తెలిపారు. ఇక శోభ మాట్లాడుతూ.. 18 వారాలు ఉన్నాడు కదా.. కనీసం ఒక్కసారి అయినా కెప్టెన్ అయ్యాడేమో అడగండి అంటూ పంచ్ వేసింది. నేను అవ్వకపోయినా ఈరోజు కంటెండర్ షిప్ ని చేసే పోతా అంటూ చాలెంజ్ విసిరారు.

సారీ చెబుతావన్న త్రిగుణ్..

Advertisement

ఆ తర్వాత బిగ్ బాస్ మాట్లాడుతూ.. తేజ కాస్త స్లిమ్ అయ్యారు అని కాంప్లిమెంట్ ఇవ్వగా.. పెళ్లి సంబంధాలు వస్తున్నాయి బిగ్ బాస్ అందుకే అంటూ సమాధానమిచ్చాడు తేజ. రాంప్రసాద్ మాట్లాడుతూ.. బిగ్ బాస్ కెమెరా కొంచెం జూమ్ చేయండి.. మళ్ళీ మీరు మీ అభిప్రాయాన్ని మార్చుకుంటారు” అంటూ అందరినీ నవ్వించారు. తేజ మాట్లాడుతూ ..” ఎవరినైతే మీరు మీతో పాటు లైఫ్ లాంగ్ వాళ్లని కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారో.. వాళ్లకు ఈ బ్యాండ్ తొడిగి రీజన్ చెప్పండి. ఇక బయటకు వెళ్లాక ఎవరి పని వాళ్ళది అనుకునేవారు జస్ట్ బ్యాండ్ వేసి కట్ చేస్తే సరిపోతుంది అంటూ శోభ కూడా తెలిపింది.

also read: సింపుల్ గా కొరియన్ అమ్మాయితో మహేష్ బాబు మేనల్లుడి పెళ్లి!

నీతో స్నేహం నాకొద్దు అంటున్న ముఖేష్..

Advertisement

ఒక బ్యాండ్ వర్షిణికి వేస్తూ.. “నాకు బయట మిత్రం ఉండి .. హౌస్ లో ద్రోహం చేసిన ప్రియమైన మిత్రురాలు ఇక్కడ తెంపుతున్నా.. బయట తెంపాలి అనుకోవట్లేదు.. ఏదో ఒక రోజు నువ్వు నాకు సారీ చెబుతావు అనుకుంటున్నా.. అందుకోసమే” అంటూ ఆమె చేతికి బ్యాండ్ వేసి కట్ చేశారు త్రిగుణ్. తర్వాత ముఖేష్ సుదీర్ కి బ్యాండ్ వేస్తూ.. ఫ్రెండ్ అన్న తర్వాత అది లైఫ్ లాంగ్ అలాగే ఉంచుకోవాలి అని ముఖేష్ చెబుతుండగానే.. సుధీర్ మాట్లాడుతూ బయట ఫ్రెండ్షిప్ కావాలా వద్దా నీకు అంటే.. నీతో స్నేహం నాకు అవసరం లేదు అంటూ చాలా కఠినంగా మాట్లాడారు ముఖేష్. వీలైతే ప్రేమను గెలుచుకో.? స్నేహం గెలుచుకో.? నమ్మకం గెలుచుకో అంటూ బ్యాండ్ కట్ చేశారు. మొత్తానికి అయితే ఈ ప్రోమో కాస్త భిన్నంగానే సాగింది.

Related News

బిగ్ బాస్10 విన్నర్ అతడే.. రోహిత్ వెళ్ళిపోయాక షో చూడడం మానేశారు: కౌశల్

ఇదెక్కడి క్రేజ్ రా మావా.. బుల్లెట్ బండి లక్ష్మణ్ మరోసారి అదరగొట్టేశాడుగా!

డైరెక్టర్ సుజిత్ తో గొడవలు.. జగపతిబాబు షోలో బయటపెట్టిన శేష్..

చిన్న వయసులోనే వరల్డ్ రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న బుల్లితెర సెలబ్రిటీ కిడ్స్!

హౌస్ లో సడన్ సర్ప్రైజ్ ఇచ్చిన పవన్ – రీతూ చౌదరి!

Podarillu Today Episode : కన్నీళ్లు పెట్టుకున్న మహాలక్ష్మీ.. ఇది కదా ఫైనల్ ట్విస్ట్.. చక్రీ పంట పండిందిరో..

Brahmamudi Serial Today Episode November 25th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఆఫీసుకు వెళ్లి మరీ ఇందుకు నిజం చెప్పిన రఘువీర్ 

Big Stories

Advertisement
×