Kissik Talks:రోహిత్ నాయుడు..బిగ్‌బాస్ సీజన్ 10లో పక్కాగా టైటిల్ విన్నర్ అని ఫిక్స్ అయ్యారు అంతా.కానీ ఊహించని విధంగా ఎలిమినేట్ అవడంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు బిగ్‌బాస్ వ్యూయర్స్.ముఖ్యంగా రోహిత్ ఫ్యాన్స్ అయితే ఫుల్ డిసప్పాయింట్ అయిపోయారు.ఇదిలా ఉండగా బిగ్ టీవీ నిర్వహిస్తున్న కిసిక్ టాక్స్ షోలో ఈ వారం గెస్ట్‌గా వచ్చిన పాల్గొన్న రోహిత్ నాయుడు తన ఎలిమినేషన్ పై ,ముఖ్యంగా రామ్ ప్రసాద్ తీరుపై ఆసక్తికరంగా రియాక్ట్ అయ్యాడు.
రామ్ ప్రసాద్‌కు గుంటనక్క అనే పేరు
ఈ ఇంటర్వ్యూలో రోహిత్ చాలా ఓపెన్‌గా మాటలాడుతూ సంచలన విషయాలు బయటపెట్టాడు. ముఖ్యంగా తన ఎలిమినేషన్ న్యాయంగా జరగలేదని అనడంతో పాటు, హౌస్‌లో కొందరు కావాలనే తనను టార్గెట్ చేశారని ఆరోపించాడు. అలాగే బయట తనపై జరుగుతున్న నెగెటివ్ ప్రచారం గురించి కూడా తనదైన స్టైల్‌లో కౌంటర్లు వేశాడు.
త్రిగుణ్‌తో జరిగిన ఈ చిట్‌చాట్‌లో ముందుగా హౌస్‌లోని కంటెస్టెంట్స్‌కు ఒక్కో పేరు పెట్టాలని అడగ్గా, రామ్ ప్రసాద్‌కు గుంటనక్క అనే పేరు పెట్టాడు రోహిత్. దానికి కారణం కూడా చెప్పాడు. రామప్రసాద్ బయటకు కనిపించేంత సింపుల్ కాదని, హౌస్‌లో జరిగిన కొన్ని సంఘటనలు చూశాక ఆయన గేమ్‌పై తన అభిప్రాయం పూర్తిగా మారిపోయిందని అన్నాడు.
24 గంటలు కూడా తిరగకముందే
ముఖ్యంగా రామకృష్ణ విషయంలో రామ్ ప్రసాద్ ప్రవర్తించిన తీరును గుర్తు చేశాడు. ఒకరోజు శివకు మాట ఇచ్చానని, అందుకే నీకు క్లాస్ తీసుకున్నానని రామకృష్ణతో చెప్పి, నువ్వు స్ట్రాంగ్ ప్లేయర్‌వి, నువ్వు ఉంటేనే గేమ్‌లో మజా ఉంటుందని రామ్ ప్రసాద్ అన్నాడట. కానీ ఆ మాటలు చెప్పిన 24 గంటలు కూడా తిరగకముందే మళ్ళీ తన ప్రవర్తనతో రామకృష్ణను ఇబ్బంది పెట్టాడని రోహిత్ ఆరోపించాడు. ఇవన్నీ చూశాకే రామప్రసాద్ గేమ్‌పై తనకు అనుమానాలు వచ్చాయని చెప్పాడు.
ఇక తన ఎలిమినేషన్ విషయంలో జరిగిన ఓటింగ్ ప్రాసెస్‌పై కూడా రోహిత్ క్వశ్చన్స్ రైజ్ చేశాడు.అంతకుముందు గ్రీన్ జోన్‌లో ఉన్నవాళ్లకే ఓటింగ్ చేసే ఛాన్స్ ఉండేదని, అప్పుడు టీమ్‌ల బలాబలాలు చూసుకుని తాను కొన్ని నిర్ణయాలు తీసుకున్నానని చెప్పాడు. హోటల్ టాస్క్ టైమ్‌లో తన టీమ్‌లో తనకు సపోర్ట్ చేసే వాళ్లు ఉంటే ఓట్ల నుంచి సేఫ్ అవ్వొచ్చని భావించి వర్షిణిని కాపాడినట్లు వివరించాడు. కానీ తన ఎలిమినేషన్ టైమ్‌లో మాత్రం హౌస్ మొత్తానికి ఓటింగ్ ఛాన్స్ ఇచ్చారని, ఆ నిర్ణయం తనకు షాక్ ఇచ్చిందని అన్నాడు.
బయటకు వచ్చి రెండు వారాలకు పైగా
అప్పటివరకు ఉన్న ఓటింగ్ రూల్స్‌కు, తన ఎలిమినేషన్ టైమ్‌లో పెట్టిన రూల్స్‌కు తేడా ఉందని, ఈ విషయంలో తనకు అన్యాయం జరిగిందనే ఫీలింగ్ ఇప్పటికీ ఉందని స్పష్టం చేశాడు. తాను హౌస్ నుంచి బయటకు వచ్చి రెండు వారాలకు పైగా అయినా ఇంకా లోపల తన గురించే మాట్లాడుకుంటున్నారని రోహిత్ అన్నాడు. బయటకు వచ్చాక శ్వేతా నాయుడును కలిసినప్పుడు కూడా ఈ విషయం తెలిసిందని, ఏదైనా ఫైర్ సాంగ్ ప్లే అయినప్పుడు రోహిత్ వస్తాడంటూ కంటెస్టెంట్స్ మాట్లాడుకునేవారని ఆమె చెప్పిందని తెలిపాడు.
పైసా ఖర్చు లేకుండా ప్రమోషన్ చేస్తున్నందుకు థ్యాంక్స్
మరోవైపు బయట తనపై జరుగుతున్న నెగెటివ్ ప్రచారంపై కూడా సీరియస్ అయ్యాడు రోహిత్ . తనను ఇష్టపడే ఆడియన్స్ అభిప్రాయాన్ని మార్చడానికి కొందరు ట్రై చేస్తున్నారని, తన మాటలకి వేరే అర్థాలు తీయడం ఫ్యామిలీని మధ్యలోకి లాగడం, సోషల్ మీడియాలో మార్ఫింగ్ ఫొటోలు పెట్టడం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశాడు.
తనను ఎంత టార్గెట్ చేసినా, పర్సనల్‌గా విమర్శించినా పట్టించుకోనని, కానీ తన అమ్మ, చెల్లి గురించి మాత్రం అసభ్యంగా మాట్లాడొద్దని వార్నింగ్ ఇచ్చాడు. తనపై జరుగుతున్న నెగెటివ్ ప్రచారం కూడా పరోక్షంగా తనకు హైప్ ఇస్తోందని, పైసా ఖర్చు లేకుండా ప్రమోషన్ చేస్తున్నందుకు థ్యాంక్స్ అంటూ ఈ సందర్భంగా సెటైర్లు వేశాడు రోహిత్ !
బిగ్‌బాస్‌లోకి రావడానికి మెయిన్ రీజన్
తాను బిగ్‌బాస్‌లోకి రావడానికి మెయిన్ రీజన్ తన అమ్మ అని రోహిత్ ఎమోషనల్ అయ్యాడు. ట్రోఫీ గెలవడం కంటే తన అమ్మను హౌస్‌లోకి తీసుకెళ్లి హోమ్ టూర్ చేయాలనే కోరిక ఎక్కువగా ఉండేదని, కానీ అది తీరకపోవడం లైఫ్‌లో ఒక లోటుగా మిగిలిపోయిందని బాధపడ్డాడు. ఎలిమినేషన్ తర్వాత జరిగిన విషయాలు చూసి అమ్మ కూడా బాధపడిందని, నీకు అంత స్ట్రెస్ అవసరం లేదని, బయటకు వచ్చేయమని చెప్పిందని అసలు విషయం చెప్పుకొచ్చాడు రోహిత్ .