E-Paper
Advertisement

త్రిగుణ్, రామప్రసాద్ క్లిప్‌పై రోహిత్ రియాక్షన్.. హౌస్‌లో గ్రూప్ గేమ్ నిజమేనా?

త్రిగుణ్, రామప్రసాద్ క్లిప్‌పై రోహిత్ రియాక్షన్.. హౌస్‌లో గ్రూప్ గేమ్ నిజమేనా?
Advertisement

Kissik Talks:బిగ్ టీవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేసే కిసిక్ టాక్స్‌లో ఈ వారం బిగ్‌బాస్ ఫేమ్ రోహిత్ నాయుడు పట్నం గెస్ట్‌గా వచ్చాడు.వర్ష హోస్ట్ గా చేసిన ఈ ఇంటర్వ్యూలో రోహిత్ తన బిగ్‌బాస్ జర్నీ గురించి,ఎలిమినేషన్ గురించి చాలా ఓపెన్‌గా చెప్పుకొచ్చాడు.తనకు సరిగ్గా ఆట ఆడే ఛాన్స్ రాకుండానే ఓటింగ్ పేరుతో బయటకు పంపేశారని తన మనసులోని మాటలని బయటపెట్టాడు.

ముఖ్యంగా త్రిగుణ్, రామప్రసాద్ మాట్లాడుకున్న క్లిప్ ఒకటి బయటకు వచ్చిందని, అందులో మొదట అందరం కలిసి కొంతమందిని పంపించేసి తర్వాత మనలో మనం పోటీ పడదామని అనుకున్నట్టు కనిపించిందని రోహిత్ చెప్పాడు. తనకు వచ్చిన టాస్కుల్లో ప్రతిసారీ అవకాశం దక్కకుండా ఓటింగ్ వల్ల బయటకు వెళ్లాల్సి వచ్చిందని తన ఆవేదనని వ్యక్తం చేశాడు.

Advertisement

తన గేమ్‌పై గట్టి ఎఫెక్ట్

ఒకవైపు హౌస్‌లో తన ఆటను పూర్తిగా చూపించే ఛాన్స్ లేకపోవడం, మరోవైపు టీవీలో వచ్చే ఎపిసోడ్లలో కూడా తన సీన్లు తక్కువగా ఉండటం తన గేమ్‌పై గట్టి ఎఫెక్ట్ చూపించిందని అన్నాడు. ప్రేక్షకులు రోజంతా షో చూడలేరు కదా, వాళ్ళు చూసేది గంట ఎపిసోడ్ మాత్రమేనని, ఆ గంటలో ఎవరిని ఎంత చూపించాలనేది షో మేకర్స్ చేతిలోనే ఉంటుందని రోహిత్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

Advertisement

తనకు సంబంధించిన విషయాలు ఎపిసోడ్‌లో తక్కువగా కనిపించడంతో, అసలు గేమ్ ఆడటం లేదేమో అని జనాలు అనుకునే ఛాన్స్ ఉందని చెప్పాడు. అందుకే టీవీలో కనిపించిన దాన్ని బట్టే కంటెస్టెంట్‌ను జడ్జ్ చేయొద్దని, తెర వెనుక జరిగే విషయాలు కూడా ఉంటాయి కాబట్టి నచ్చిన కంటెస్టెంట్‌కు కొంచెం బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇవ్వాలని ఆడియన్స్ కోరాడు రోహిత్.

నీ షూ కలర్ బాగోలేదని రేసు నుంచి తీసేస్తే

ఇక తన ఎలిమినేషన్ గురించి మాట్లాడుతూ, ఒక రేసులో ఫాస్ట్‌గా పరిగెడుతున్న వాడిని మధ్యలో ఆపి, నీ షూ కలర్ బాగోలేదని రేసు నుంచి తీసేస్తే ఎలా ఉంటుందో తన పరిస్థితి కూడా అలాగే ఉందని ఎమోషనల్ అయ్యాడు. అగ్నిపరీక్షలో ఎన్నో కష్టాలు దాటుకుని బిగ్‌బాస్ హౌస్‌లోకి వచ్చిన తనకు, కనీసం తన ఆటను పూర్తిగా చూపించే అవకాశం కూడా ఇవ్వలేదని బాధపడ్డాడు. తనకు సంబంధించిన ఫుటేజ్ సరిగ్గా చూపించకపోవడం, అసలు తన విషయంలో ఏం జరిగిందనే ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం లేకపోవడం చాలా బాధగా ఉందన్నాడు.

అలాగే హోటల్ టాస్క్‌లో స్టార్స్ లెక్క ప్రకారం గ్రీన్ జోన్‌లోకి వెళ్లాల్సి ఉండగా, రామ్ ప్రసాద్ దగ్గర ఎక్కువ స్టార్స్ ఉండి, వర్షిణి దగ్గర తక్కువ స్టార్స్ ఉన్నా వేరేలా నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నించాడు. అప్పటికప్పుడు రూల్స్ మారినట్టు అనిపించిందని, అక్కడున్న కంటెస్టెంట్లు కూడా షాక్ అయ్యారని గుర్తు చేశాడు. గ్లాస్ బ్రేకింగ్ టాస్క్‌లో కూడా ఇంకా గ్లాసులు మిగిలి ఉండగానే ఆపేశారని, ఆ తర్వాత సుధీర్ ఎలిమినేషన్ ప్రకటించడం కూడా ఆశ్చర్యం కలిగించిందని వివరించాడు.

 ఇంత కష్టపడి వచ్చి ఇలా

సెలబ్రిటీలకు బయట మీడియా, ఇతర పరిచయాలు ఉంటాయి కానీ, సాధారణ మిడిల్ క్లాస్ కుటుంబాల నుంచి వచ్చిన కామనర్లకు అలాంటి ఇన్‌ఫ్లుయెన్స్ ఉండదని రోహిత్ స్పష్టం చేశాడు. తన ఎలిమినేషన్ చూసి అమ్మ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారని, కామనర్‌గా ఇంత కష్టపడి వచ్చి ఇలా జరగడం ఫ్యామిలీకి బాధ కలిగించిందని చెప్పాడు.

అయినా మన చేతుల్లో లేని వాటిని మార్చలేం కాబట్టి దేవుడిపై భారం వేసి ముందుకు వెళ్లాలని తన కుటుంబం అనుకుందని చెప్పాడు. అయితే తనకు ఇంత పెద్ద స్థాయిలో ఫ్యాన్స్ సపోర్ట్, ప్రేమ వస్తాయని అస్సలు ఊహించలేదని, సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ మద్దతు ఇచ్చిన వాళ్ళందరికీ థాంక్స్ చెప్పాడు రోహిత్.

also read :క్యాబ్ దొరక్కే ఆటో ఎక్కా.. సొంత కారు లేదు: బిగ్‌బాస్ రోహిత్ నిజం చెప్పేశాడుగా !

ఇక అగ్నిపరీక్ష జ్యూరీకి, ముఖ్యంగా అభిజీత్ అన్న ఇచ్చిన ఒక్క గ్రీన్ సిగ్నల్ వల్లే ఈ స్థాయికి వచ్చానని ఎమోషనల్ అయ్యాడు. బిగ్‌బాస్ జర్నీ ముగిసినా ఇది తన కెరీర్‌కు కొత్త స్టార్ట్ అని, ఇకపై మంచి ప్రాజెక్టులతో ప్రేక్షకులను అలరిస్తానని కాన్ఫిడెన్స్ గా చెప్పడం విశేషం.

Tags

Related News

బిగ్ బాస్ సీజన్ 10.. కప్పు సెలబ్రిటీలకే… స్క్రిప్ట్ ప్రకారమే బయటకు పంపారు: రోహిత్

క్యాబ్ దొరక్కే ఆటో ఎక్కా.. సొంత కారు లేదు: బిగ్‌బాస్ రోహిత్ నిజం చెప్పేశాడుగా !

బిగ్ బాస్ హౌస్ లో నాకు న్యాయం జరగలేదు.. అందుకే అలా చేయాల్సి వచ్చింది: రోహిత్

త్రిగుణ్ ను గెలిపించడం కోసమే నన్ను పంపించారు.. రోహిత్ సెన్సేషనల్ కామెంట్!

శాలినితో రిలేషన్‌పై రోహిత్ ఓపెన్ కామెంట్స్.. సింగిల్ కాదంటూ హింట్!

నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి.. టెంపర్ వంశీకి చుక్కలు చూపించిన శివాజీ!

బిగ్ బాస్ డబుల్ ట్విస్ట్.. వంశీతో పాటు మరో కంటెస్టెంట్ ఎలిమినేషన్?

Big Stories

Advertisement
×