E-Paper
Advertisement

బిగ్ బాస్ 10 లో ఎల్లో కార్డు అందుకున్న ఫస్ట్ కంటెస్టెంట్

బిగ్ బాస్ 10 లో ఎల్లో కార్డు అందుకున్న ఫస్ట్ కంటెస్టెంట్
Advertisement

Bigg Boss Telugu 10:బిగ్ బాస్ తెలుగు సీజన్ రోజులు గడిచిన కొద్దీ మాంచి ఎంటర్ టైనింగ్ గా మారిపోతుంది.మొత్తానికి స్లోగా మొదలైన షోలో హౌస్‌లో కంటెస్టెంట్స్ మధ్య గొడవలు, మాటల యుద్ధాలతో మాంచి కిక్కిస్తుంది.ఎవరు ఎప్పుడు ఎవరితో గొడవ పడతారో, ఏ చిన్న విషయం ఎంత పెద్ద ఇష్యూ అవుతుందో అర్థం కాని పరిస్థితిలో ఆడియన్స్ షోని కళ్ళప్పగించి చూస్తున్నారు .

ఇక వీకెండ్ వచ్చిందంటే చాలు.. నాగార్జున వచ్చి ఎవరి క్లాస్ ఎలా తీసుకుంటారో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా వచ్చిన ప్రోమో చూస్తుంటే ఈసారి నాగార్జున చాలా సీరియస్‌గా ఉన్నట్టు కనిపిస్తోంది.

Advertisement

నాగార్జున ఇప్పటికే సీరియస్

గత వారం హౌస్‌లో జరిగిన గొడవలు, కొట్లాటలపై నాగార్జున ఇప్పటికే సీరియస్ అయిన విషయం తెలిసిందే. త్రిగుణ్, అమన్‌లకు ఎల్లో కార్డులు ఇచ్చి మరోసారి ఇలాంటి గొడవలు చేస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. గొడవలు పెట్టుకోవడం, బూతులు మాట్లాడటం లాంటివి మరోసారి జరిగితే హౌస్ నుంచి బయటకు పంపిస్తానని కూడా గట్టిగానే చెప్పినట్టు ప్రోమోలో కనిపిస్తోంది.

Advertisement

అయితే ఈసారి అందరి ఫోకస్ మాత్రం రోహిత్‌పైనే పడింది. రోహిత్‌కు సంబంధించిన ఒక అన్‌సీన్ వీడియోను నాగార్జున హౌస్‌మేట్స్ అందరి ముందు ప్లే చేయడం ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. చరణ్‌తో మాట్లాడుతున్న సమయంలో రోహిత్ చేసిన కొన్ని వ్యాఖ్యలు, సైగలు ఆ వీడియోలో కనిపించాయి. ముఖ్యంగా “బిగ్ బాస్ నా వెంట్రుక కూడా పీకలేడు” అనే విధంగా రోహిత్ మాట్లాడటం నాగార్జునకు అస్సలు నచ్చలేదు.

ఇలా మాట్లాడటం కరెక్టేనా?

ఆ వీడియో చూసిన తర్వాత నాగార్జున ఫుల్ సీరియస్ అయ్యారు. అసలు బిగ్ బాస్ షోను, హౌస్‌ను ఇలా మాట్లాడటం కరెక్టేనా? అంటూ అక్కడున్న ఆడియన్స్‌ను అడిగారు. దానికి ప్రేక్షకులు కూడా చేతులెత్తి తమ రియాక్షన్ ఏంటో చెప్పేశారు. దీంతో నాగార్జున మరింత ఫైర్ అయినట్టు ప్రోమోలో కనిపించింది.

బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చి ఆ షో ఇచ్చే ప్లాట్‌ఫామ్‌ను తక్కువ చేసి మాట్లాడటం ఏమాత్రం కరెక్ట్ కాదనే విధంగా నాగార్జున రోహిత్‌కు క్లాస్ తీసుకున్నట్టు తెలుస్తోంది. హౌస్‌లో ఎంత గొడవ జరిగినా, ఎంత కోపం వచ్చినా కొన్ని హద్దులు దాటకూడదనే విషయాన్ని ఆయన గట్టిగానే చెప్పినట్టు కనిపిస్తోంది.

హౌస్ నుంచి బయటకు వెళ్లిపోతాడా?

ఇక రోహిత్‌కు ఏకంగా రెడ్ కార్డ్ ఇచ్చినట్టు ప్రోమోలో చూపించడం అందరినీ షాక్‌కు గురి చేసింది. సాధారణంగా బిగ్ బాస్‌లో ఎలిమినేషన్ అంటే ఓటింగ్, నామినేషన్స్ అంటూ ఒక ప్రాసెస్ ఉంటుంది. కానీ రెడ్ కార్డ్ అంటే మాత్రం పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్టే. దీంతో రోహిత్ నిజంగానే హౌస్ నుంచి బయటకు వెళ్లిపోతాడా? అనే చర్చ మొదలైంది.

ఇక ప్రోమో చివర్లో నాగార్జున చెప్పిన మాటలు మరింత వైరల్ అయ్యాయి. రోహిత్‌ను “ప్లీజ్ లీవ్ మై హౌస్” అంటూ నాగార్జున సీరియస్‌గా చెప్పడం కనిపించింది. దీంతో రోహిత్ పరిస్థితి ఏంటి? నిజంగానే బయటకు పంపించేశారా? లేక ప్రోమోలో హైప్ కోసం ఆ సీన్‌ను అలా చూపించారా? అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

త్రిగుణ్, అమన్‌లకు ఎల్లో కార్డులు

బిగ్ బాస్‌లో కంటెస్టెంట్స్ మధ్య గొడవలు కొత్తేమీ కాదు. ప్రతి సీజన్‌లోనూ ఏదో ఒక విషయంలో కంటెస్టెంట్స్ మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంటుంది. అయితే కొన్నిసార్లు ఆ గొడవలు హద్దులు దాటితే హోస్ట్ జోక్యం చేసుకోవాల్సి వస్తుంది. . ఈ సీజన్‌లో కూడా ఇప్పుడు అదే పరిస్థితి కనిపిస్తోంది.మరోవైపు త్రిగుణ్, అమన్‌లకు ఎల్లో కార్డులు ఇవ్వడం కూడా హౌస్‌లో చర్చగా మారింది. ఇకపై చిన్న గొడవ జరిగినా కంటెస్టెంట్స్ ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది.

పూర్తి ఎపిసోడ్‌ వస్తే కాని తెలిసేలా లేదు

అసలు రోహిత్ చేసిన వ్యాఖ్యల వెనుక ఏం జరిగింది? ఆ సమయంలో అతను ఎందుకు అలా మాట్లాడాడు? నాగార్జున ఎందుకు అంత సీరియస్ అయ్యారు? రెడ్ కార్డ్ నిజంగానే ఇచ్చారా? “ప్లీజ్ లీవ్ మై హౌస్” అన్న తర్వాత రోహిత్ హౌస్‌లో ఉన్నాడా లేదా బయటకు వెళ్లిపోయాడా? ఇవన్నీ ఇప్పుడు ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచుతున్నాయి.

ఏది ఏమైనా రోహిత్ ఎలిమినేట్ అయ్యాడా లేదా అన్నది పూర్తి ఎపిసోడ్‌ వస్తే కాని తెలిసేలా లేదు !

Tags

Related News

బ్లాక్ శారీలో తారక్ సిస్టర్ .. ఇంత స్టైలిష్‌గా ఉందేంటి బాబోయ్!

సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న ఈశ్వర్ సాయి…వివాదాలకు గుడ్‌బై చెప్పినట్టేనా?

రాంప్రసాద్ నువ్వేమైనా పిస్తావా?డిజాస్టర్ కెప్టెన్ .. విశ్వరూపం చూపించిన నాగార్జున!

ట్రోల్ చేయడం కోసం నెలకు రూ. 30 వేలు.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన కృష్ణుడు!

మిథిలేష్ 15 లక్షలు తీసుకోవడం ఆ మాజీ కంటెస్టెంట్ ప్లానేనా? మిథిలేష్ కు మిగిలేది ఎంతంటే?

బిగ్ బాస్ బూతు షో కాదా? మిథిలేష్ రియాక్షన్?

ముఖేష్ కాళ్లు మొక్కిన వర్షిణి.. వీడియో వైరల్!

Big Stories

Advertisement
×