Kashibugga Temple: కాశీబుగ్గ ఆలయ నిర్మాణంపై.. నిర్వాహకుడు హరిముకుంద్ పాండా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో తిరుమల శ్రీవారి దర్శనం దక్కలేదని ఆలయం నిర్మించినట్లు చెబుతున్నారు. తిరుమలలో వెంకన్న దర్శనానికి వెళితే సిబ్బంది నెట్టివేశారన్నారు. అప్పుడు స్వామివారిని సరిగా దర్శించుకోలేదని.. ఆ మనస్తాపంతోనే ఆలయ నిర్మాణానికి అడుగు వేసినట్లు వెల్లడించారు. తల్లి సూచనతోనే 12 ఎకరాల్లో తిరుమల మాదిరిగానే ఆలయం నిర్మించానని తెలిపారు. ఆలయ నిర్మాణానికి ఒక్క రూపాయి కూడా విరాళం తీసుకోలేదన్నారు హరిముకుంద్ పాండా.