BigTV English

Brahmamudi Serial Today April 12th: ‘బ్రహ్మముడి’ సీరియల్: కావ్య ఆఫీసుకు వచ్చిన యామిని – యామినిని తిట్టిన రాజ్‌

Brahmamudi Serial Today April 12th: ‘బ్రహ్మముడి’ సీరియల్: కావ్య ఆఫీసుకు వచ్చిన యామిని – యామినిని తిట్టిన రాజ్‌

Brahmamudi serial today Episode: రాజ్‌ను పక్కకు తీసుకెళ్లిన కావ్య ఎందుకు మా ఆఫీసు దగ్గరకు వచ్చారు అని అడుగుతుంది. దీంతో రాజ్‌ మొన్న కలిసినప్పుడు బోకే ఇవ్వడం మర్చిపోయాను అందుకే ఇవాళ ఇద్దామని వచ్చాను అంటాడు రాజ్‌. ఈ బొకే ఇవ్వడం కోసమేనా అని కావ్య అడుగుతుంది. దీంతో అలా అని ఏం కాదు కానీ మీతో మాట్లాడదామనే వచ్చాను అంటాడు రాజ్‌. మీరేం మాట్లాడబోతున్నారో మీకు క్లారిటీ ఉందా..? ఇప్పుడు కూడా కన్పీజ్‌ చేసి మాట్లాడతారా..? అంటుంది కావ్య. దీంతో రాజ్‌ లాస్ట్‌ టైం క్లియర్‌గానే మాట్లాడాను కదండి. అంటే ఇప్పుడు చెప్పింది మీకు అర్థం కాలేదా అని అడుగుతాడు. దీంతో కావ్య ఆలోచిస్తుంది. ఏంటి ఆలోచిస్తున్నారు అని రాజ్‌ అడగ్గానే.. ఆఫీసులో వర్క్‌ వదిలేసి మధ్యలో వచ్చేశాను కదండి అది ఆలోచిస్తున్నాను అని కావ్య  చెప్పగానే.. నా గురించి కూడా కాస్త ఆలోచించండి అంటూ రాజ్‌ చెప్పగానే.. ఏం ఆలోచించాలి అండి నేను మీ గురించి ఆలోచించడం ఏంటి..? అంటుంది.


దీంతో అదేనండి నాకంటే గతం గుర్తు లేదు మీకు గుర్తు ఉంటుంది కదా..? ఇంతకు ముందు మనకు పరిచయం ఉందా..? మీరు ఏదో నిజాన్ని దాస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. మనకు ఇంతకు ముందు పరిచయం ఉంది కదా..? మీ కళ్లు ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నా..? మీరు బలవంతంగా ఆ నిజాన్ని బయటకు రాకుండా దాస్తున్నారు. ఇంతలా అడుగుతున్నా మీరు నోరు తెరవడం లేదు. అంటూ నిలదీస్తుంటాడు. ఇంతలో కావ్యకు ఫోన్‌ రావడంతో ఆఫీసులో చెప్పకుండా వచ్చాను ఫోన్‌ చేస్తున్నారు. ఇప్పుడు వెళ్లకపోతే నన్ను జాబ్‌లోంచి తీసిపారేస్తారు అంటూ కావ్య వెళ్లిపోతుంది. బొకే తీసుకుందని ఆనందపడాలా.. నాతో స్పెండ్‌ చేయకుండా వెళ్లిపోయిందని బాధపడాలా..? అని రాజ్‌ ఆలోచిస్తుంటాడు.

ఇంతలో యామిని వస్తుంది. రాజ్‌ కారు చూసి కన్ఫంగా రాజ్‌ ఆఫీసులోకి వెళ్లి ఉంటాడు. ఈ పాటికి అందరూ అతన్ని గుర్తు పట్టి ఉంటారు. లోపలికి వెళ్లి ఎలాగైనా ఆయన్ని తీసుకురావాలి. అనుకుంటూ ఆఫీసులోకి వెళ్తుంది. లోపలికి వెళ్లగానే శృతి ఎవరండి ఎవరు కావాలి అని అడుగుతుంది. రామ్‌ కోసం వచ్చాను అని చెప్తుంది. దీంతో ఇక్కడ రామ్‌ ఎవ్వరూ లేరండి అని చెప్పగానే.. అదే రాజ్‌ కోసం వచ్చాను అంటుంది. దీంతో శృతి ఓ రాజ్‌ సార్‌కు అలా జరిగేసరికి మేడంను ఓదార్చడానికి వచ్చారా అంటుంది. ఇంతలో రాజ్‌ ఫోన్‌ చేస్తాడు. యామిని ఎక్కడున్నావు నేను నీ కారు దగ్గరే ఉన్నాను అంటాడు.


దీంతో యామని ఆఫీసులోంచి బయటకు వచ్చేస్తుంది. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు.. నేను ఇక్కడ ఉన్నట్టు నీకెలా తెలిసింది. నాకు తెలియకుండా నన్న ఫాలో అవుతున్నావా..? అని అడగ్గానే.. లేదని ఫ్రెండును కలుద్దామని వెళ్తున్నాను ఇక్కడ నీ కారు కనిపించగానే ఆగిపోయాను.. అది సరే కానీ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు బావ అని అడుగుతుంది. దీంతో రాజ్‌ కూడా నేను ఫ్రెండును కలుద్దామని వచ్చాను పక్కనే కేఫ్‌లో కాఫీ తాగుతున్నాం అని చెప్తాడు. దీంతో రాజ్‌ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కారులో వెళ్తున్న రాజ్‌.. కావ్య ఎవరని ఆలోచిస్తుంటాడు. ఆఫీసులో ఉన్న కావ్య కూడా రాజ్‌ గురించి ఆలోచిస్తుంది.

ఇంట్లో అందరూ కూర్చుని ఉంటారు. సుభాష్‌ ఏంట్రా ఏదో మాట్లాడాలి అని పిలిచి సైలెంట్‌గా ఉన్నావేంటి అని అడుగుతాడు. దీంతో ప్రకాష్‌ ఏం లేదు అన్నయ్యా రేపు వదిన పుట్టిన రోజు కదా దాని గురించి ఏం ఆలోచించావు అన్నయ్యా అంటాడు. ఇంతలో రుద్రాని ఆ విషయం అందరికీ గుర్తుంది అన్నయ్యా నువ్వు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ రాజ్‌ దూరం అయ్యాడన్న బాధలో ఎవ్వరూ దాని గురించ ఆలోచించలేదు అంతే.. రాజ్‌ ఉన్నప్పుడైతే ప్రతి సంవత్సరం వదిన పుట్టినరోజుకు గుడిలో అన్నదానం చేసేవాడు. అందరికీ పట్టుబట్టలు పెట్టేవాడు. ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది అంటుంది. దీంతో ప్రకాష్‌ నేను ఆనందం ఇచ్చే విషయాలు మాట్లాడాలి అనుకుంటే నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు అంటాడు.

దీంతో అపర్ణ ఏడుస్తూ రుద్రాణి చెప్పింది నిజమే ప్రకాషం వాడే లేనప్పుడు నాకు ఇవన్నీ ఎందుకు ఏమీ వద్దులేండి అంటుంది. దీంతో ప్రకాష్‌ అది కాదు వదిన రాజ్‌కు అన్నదానం చేయించడం ఇష్ట కదా కనీసం వాడి కోసమైనా ఒప్పు కోవచ్చు కదా వదిన అని చెప్పగానే ఇంద్రాదేవి కూడా అవును అపర్ణ ప్రకాషం చెప్పింది కూడా నిజమే.. జరిగిన దాని గురించి తలుచుకుంటూ ఇంకా ఎన్ని రోజులు ఇలా ఉంటాము చెప్పు అంటుంది. అయినా అపర్ణ వినకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. రుద్రాణిని అందరూ తిడతారు. డోర్‌లోంచి అంతా విన్న  అప్పు విషయం మొత్తం కావ్యకు చెప్పి ఇంట్లో వాళ్లకు నిజం చెప్పాలని అనుకుంటుంది.  ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?

 

Tags

Related News

Intinti Ramayanam Today Episode: భరత్, ప్రణతిలను విడగొట్టిన పల్లవి.. పోలీస్ స్టేషన్ పార్వతి.. నిజం బయటపడిందా?

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు గుడ్ న్యూస్.. బాలును ఇరికించేసిన కల్పన..

Illu Illalu Pillalu Today Episode: భర్తను కాపాడిన భాగ్యం.. నర్మదకు మొదలైన అనుమానం.. శ్రీవల్లి సేఫ్..

Today Movies in TV : ఆదివారం టీవీలల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Big Tv Kissik Talks: వాడి కోసం ప్రాణాలైనా ఇస్తా… థాంక్స్ చెప్పి రుణం తీర్చుకోలేను!

Big Tv Kissik Talks: అందుకే పిల్లల్ని వద్దనుకున్నాం..  బాంబు పేల్చిన అమర్!

Big Stories

×