IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ( Indian Premier League 2025 Tournament) భాగంగా ఇవాళ రెండు మ్యాచ్లు జరగనున్నాయి. ఇప్పటి వరకు దాదాపు 25 మ్యాచ్లు పూర్తిగా.. ఇవాళ మరో రెండు మ్యాచ్లు జరగనున్నాయి. ఈ మేరకు షెడ్యూల్ కూడా ఖరారు అయింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా లక్నో సూపర్ జెంట్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య మొదటి మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం మూడున్నర గంటల ప్రాంతంలో… లక్నో సూపర్ జెంట్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ ప్రారంభమవుతుంది.
Also Read: White Ball: వన్డే, T20 మ్యాచ్ లకు వాడే బాల్ ధర ఎంతో తెలుసా….ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే
లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బీహార్ వాజ్పేయి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో… లక్నో వర్సెస్ గుజరాత్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇక ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత… అసలు సిసలు పోరు జరగనుంది. ఈ సీజన్లో అత్యంత దారుణంగా విఫలం అవుతున్న సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు మరో కీలక ఫైట్ కు సిద్ధమైంది. సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ ( Sunrisers Hyderabad vs Punjab Kings) జట్ల మధ్య ఇవాళ రెండవ మ్యాచ్ జరగనుంది. సాయంత్రం ఏడున్నర గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతుంది.
ఉప్పల్ మ్యాచ్ కు ప్రత్యేక ఏర్పాట్లు
ఉప్పల్ వేదికగా జరుగుతున్న సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్కు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అర్ధరాత్రి వరకు మెట్రో రైలు అలాగే ఆర్టీసీ బస్సులు కూడా ఏర్పాటు చేశారు. సాయంత్రం ఏడున్నర గంటల ప్రాంతంలో మ్యాచ్ ప్రారంభం అవుతుంది. అంటే.. అర్ధరాత్రి 12 గంటల వరకు మ్యాచ్ హడావిడి ఉంటుంది. మ్యాచ్ పూర్తయిన తర్వాత అందరూ తమ ఇంటికి చేరుకునేందుకు మెట్రో అలాగే ఆర్టీసీ బస్సుల ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇవాళ ఓడితే SRH ఇంటికే?
హైదరాబాద్ చేతిలో మరో 9 మ్యాచ్ లు మాత్రమే ఉన్నాయి. ఇందులో కచ్చితంగా ఏడు మ్యాచ్లలో విజయం సాధించాల్సి ఉంటుంది. ఏడు మ్యాచ్ల్లో విజయం సాధించకపోతే… ఇంటి దారి పట్టక తప్పదు. కాబట్టి ఇవాల్టి నుంచి హైదరాబాద్కు చాలా కీలకం. ఆడిన ప్రతి మ్యాచ్ గెలిచి తీరాల్సిందే. ఇవాళ పంజాబ్ చేతిలో… ఓడిపోతే హైదరాబాద్ కు మరిన్ని కష్టాలు ఎదురవుతాయి.
Also Read: Virat Kohli : ఓటమి బాధలో కోహ్లీ.. కన్నీళ్లు పెట్టుకుంటున్న ఫ్యాన్స్
ఇది ఇలా ఉండగా పాయింట్స్ టేబుల్ లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు అందరికన్నా చివర్లో ఉంది. పదవ స్థానంలో నిలిచిన హైదరాబాద్ జట్టు ఖాతాలో కేవలం రెండు పాయింట్లు మాత్రమే ఉన్నాయి. ఐదు మ్యాచ్లు వాడిన సన్రైజర్స్ హైదరాబాద్ కేవలం ఒకే మ్యాచ్ లో విజయం సాధించింది. నాలుగు మ్యాచ్ల్లో వరుసగా ఓడిపోయింది హైదరాబాద్. మొదటి స్థానంలో గుజరాత్ టైటాన్స్ దూసుకు వెళ్తోంది. రెండవ స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఉంది.