E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode April 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు కోసం రంగంలోకి దిగిన నందు 

Brahmamudi Serial Today Episode April 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు కోసం రంగంలోకి దిగిన నందు 
Advertisement

Brahmamudi serial today Episode: రేఖ అపర్ణను అనుమానించి సుభాష్‌ను భూషణ్‌ చేత చంపిస్తానని బెదిరిస్తూ ఇందును ఎక్కడ దాచిపెట్టారని అడుగుతుంటే.. అప్పుడే అక్కడికి నందు తన కానిస్టేబుల్‌ బాబాయ్‌తో వస్తుంది. రేఖ ఎవరు మీరు అని అడగ్గానే.. పోలీస్‌ డ్రెస్‌ చూసి కూడా ఎవరు మీరు అని అడుగుతున్నారా..? అంటాడు. దీంతో రేఖ తెలుసు కానీ మీరు ఎందుకు వచ్చారు అని అడుగుతున్నాను అనగానే.. నందు అదే మేడం కిడ్నాప్‌ కేసును అన్‌అఫీసియల్‌గా ఎంక్వైరీ చేయమన్నారు కదా..? అందులో మేము స్పెషలిస్టులం అందుకే టీంతో వచ్చాము త్వరలోనే వెతికి పట్టేసుకుంటాము.. ఏంటి అందరూ మీలో మీరే అలా చూసుకుంటున్నారు.. ఏంటి… కొంపదీసి ఇంట్లోనే దొంగ దొరికాడా ఏంటి..? మీ ముఖాలు చూస్తుంటే.. ఏదో హాట్‌ టాఫిక్‌ నడుస్తున్నట్టు ఉంది. ఏంటి విషయం ఆ కిడ్నాప్‌ చేసింది ఎవరో తెలిసిందా..? అని నందు అడగ్గానే..

రేఖ చూడండి మీరు బయట వెతకడం మానేసి ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడగ్గానే.. కథ ఇక్కడే మొదలైంది.. కదా..? ఐ మీన్‌ కిడ్నాప్‌ జరిగింది మీ సమక్షంలోనే కదా అందుకే ఇక్కడికి వచ్చాను. చూడండి మీరంతా కో ఆపరేట్‌ చేస్తే చాల మంచిది అంటూ నందు చెప్పగానే.. భ్రమరాంబ ఎవరికి అని అడుగుతుంది. దీంతో మీ ఇందుకు మీరు కోపరేట్‌ చేస్తే త్వరగా పట్టేసుకుంటాం.. అని చెప్పగానే.. భ్రమరాంబ మాత్రం ఇక్కడ వెతికినా ఏమీ దొరకదు.. మీరెళ్లి బయట వెతకండి అని చెప్పగానే.. నందు వెటకారంగా మీరు భలే మాట్లాడుతున్నారు.. ఇంతకీ కిడ్నాప్‌ అయిన ఇందుకు మీరు ఏమవుతారు అని అడగ్గానే.. భ్రమరాంబ పిన్నిని అని చెప్తుంది. దీంతో నందు ఓ ఇందు ఫాథర్‌కు తమ్ముడి భార్య అన్నమాట. అనగానే..

Advertisement

శేషు కాదమ్మ నా భార్య అని చెప్పగానే. మీరు ఈ ఇంటికి ఏమవుతారు అని అడగ్గానే.. నేనే కాదమ్మ నా భార్య కూడా ఏమీ అవదు.. అని చెప్పగానే.. అది సరే కానీ మొత్తం ఇన్మఫర్మేషన్‌ కావాలి అని చెప్పగానే.. ఐశ్వర్య కోపంగా అవన్నీ నీకెందుకు అని చెప్పగానే.. ఇదేం పబ్బు కాదు ఊరికే ఉండటానికి అంటూ కోప్పడుతుంది. కిడ్నాపర్లును పట్టుకోవాలంటే నేను ఇక్కడే ఈ ఇంట్లోనే ఉండి సెట్‌ చేస్తాను.. అంటూ నందు చెప్పగానే.. రేఖ భూషణ్‌ తనకు కావాల్సింది చూడు అనగానే.. భూషణ్‌ మొత్తం ఏర్పాటు అన్ని ఏర్పాటు చేయగానే.. భ్రమరాంబ నందును ఇంత హడావిడి చేస్తున్నావు ఇంతకీ నీ పేరేంటి అని అడగ్గానే.. నా నిజం పేరు చెబితే గుర్తు పడతారేమో..? అని టక్కున అప్పు అని చెప్పేస్తుంది. అపర్ణ, సుభాష్‌ షాక్‌ అవుతారు.

మరోవైపు ఇందును బంధించిన ఇంట్లో ఉన్న రాజు, లక్కీ అన్నం తింటుంటారు. రాజు ఒక ప్లేట్‌లో ఇందు కోసం అన్నం వేస్తుంటే.. లక్కీ ఒరేయ్‌ ఇందాకే తిన్నావు కదరా.. మరో రౌండా..? అని అడగ్గానే.. రాజు పాపంరా ఆ అమ్మాయి తను కూడా ఏమీ తినలేదు కదా..? అనగానే.. లక్కీ అలాగే సార్‌ గుర్రం గుడ్డిదైనా దాన తప్పదంటారు.. కదా పెట్టు.. అయినా ఈ ఫుడ్డు తను తింటుంది అంటావా..? అని అడగ్గానే.. దీంతో రాజు ఇప్పుడావిడ కోసం ఫైవ్‌స్టార్‌ భోజనం తీసుకురావాలా… పెట్టడం మన బాధ్యత పెడుతున్నాం అంతే తింటే తినని లేకపోతే లేదు.. ఆవిడ కోసం నువ్వు ఎక్కువగా ఆలోచించకు అని చెప్పగానే..

Advertisement

ఆవిడ కోసం ఎక్కువగా ఆలోచించేది నేను కాదురా..? నువ్వు ఆలోచిస్తున్నావు.. తిట్టేటప్పుడు బాగానే తిడుతున్నావు కానీ ఇప్పుడు మాత్రం తెగ ప్రేమ చూపిస్తున్నావు.. అనగానే.. సరే సరే అంటూ రాజు భోజనం తీసుకుని లోపలికి వెళ్తాడు. రాజు రావడం చూసిన ఇందు నిద్రపోతున్నట్టు నటిస్తుంది. రాజు వెటకారంగా నటించిది చాలు కానీ లేచి భోజనం చేయ్‌ అని చెప్పగానే.. నందు లేచి భోజనం చేస్తూ వీళ్లు ఎవరో ఎలాగైనా తెలుసుకోవాలి అనుకుంటుంది. ప్లాన్‌ ప్రకారం లక్కీ మాస్క్‌ తీసి చూస్తుంది. దీంతో లక్కీ రాజు మాస్క్‌ తీసేస్తాడు. దీంతో ఇందు ఇద్దరిని తిడుతుంది. రాజు, లక్కీ అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఒక రకంగా ఇది కూడా మంచికోసమే జరిగింది. ఇప్పుడు ఆ రేఖ ఆంటీని ఎలా అడ్డుకోవాలో ఆలోచించాలి అనుకుంటుంది.

తర్వాత రాజు, రేఖకు ఫోన్‌ చేసి బ్లాక్‌ మెయిల్‌ చేస్తుంటే.. నందు కాల్‌ను ట్రేస్‌ చేస్తుంటే.. ఐశ్వర్య భయపడుతుంది. రాజు కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్‌ చేసి కాల్ కట్ చేస్తాడు. లొకేషన్‌ ట్రేస్‌ అయిందా..? అని రేఖ అడగ్గానే.. కనీసం మూడు నిమిషాలు మాట్లాడితే ట్రేస్‌ అవుతుంది అని నందు చెప్పగానే.. ఐశ్వర్య ఊపిరి పీల్చుకుంటుంది. వీళ్లు ట్రేస్‌ చేస్తున్నారని వెంటనే లక్కీకి చెప్పాలి అనుకుంటూ లోపలికి వెళ్తుంది ఐశ్వర్య.  స్వాతి మాత్రం ఇదేంటి అక్క మా ప్లాన్‌ ప్రకారం కిడ్నాప్‌ అయితే వాడెవడో డబ్బులు అడగడం ఏంటి..? అని ఆలోచిస్తుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Brahmamudi Serial Today Episode October 17th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  అపర్ణ రాసిన లెటర్ శేషు జీవితాన్ని మలుపు తిప్పుతుందా..? 

Saturday TV Movies : శనివారం టీవీ సినిమాలు.. మూవీ లవర్స్ కు జాతరే..

Nindu Noorella Saavasam Serial Today Episode October 17th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థు హత్య కేసు నుంచి మనోహరి ఎస్కేప్ అవుతుందా..? 

సోషల్ మీడియాని షేక్ చేస్తున్న నల్గొండ గద్దర్ నరసన్న.. రమణిలో బతుకమ్మ పాటతో రచ్చ!

మాధురి రాథోడ్ లైఫ్‌లో జరిగినదే పాటలో ఉందా? ‘భామ సుందరా’ గ్లింప్స్ వైరల్!

త్రిగుణ్ ధూత.. వైల్డ్ కార్డ్స్ కి ఊహించని దెబ్బ..ఇది కదా అసలు గేమ్ అంటే?

సింగర్ కనకవ్వ పాటలకు అంత క్రేజ్ ఎందుకు?

మాట నిలబెట్టుకున్న వైవా హర్ష.. జబర్దస్త్ బాబుకి కళ్ళు చెదిరే గిఫ్ట్!

Big Stories

Advertisement
×