Brahmamudi serial today Episode: కావ్య.. రాజ్ షర్ట్ మీద ‘ఆర్’ లెటర్ స్టిచింగ్ చేస్తుంది కావ్య. రాజ్ వచ్చి తనతో మాట్లాడినట్టు ఊహించుకుంటుంది. రాజ్ ఎందుకు ఇలా చేశావని అడుగుతాడు. దీంతో కావ్య ఇది నా జ్ఞాపకంగా మీ గుండెలకు దగ్గరగా ఉండి నన్ను మీకు గుర్తు చేస్తే మీరు నా దగ్గరకు వచ్చే అవకాశం ఉంది కదా అంటుంది. దీంతో రాజ్ నువ్వు నన్ను ఎంత గొప్పగా ప్రేమించావో ఇప్పుడిప్పుడే అర్థం అవుతుంది కళావతి. నీ అంత గొప్పగా నేను ప్రేమించకపోవచ్చు కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నాను. నేను నీకు ఎంత దూరం వెళ్లినా సరే నీ జ్ఞాపకాలు నన్ను వెంటాడుతాయి. అంత ప్రేమను ఇచ్చావు నాకు.
ఒకవేళ నువ్వు అన్నట్టు అలాంటి పరిస్థితే వస్తే.. నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరకు వచ్చేస్తాను. ఏదో ఒకరోజు ఏదో ఒక క్షణం నీకంటే గొప్పగా నేనే ప్రేమించానని నీకు అనిపించేలా చేస్తాను అంటూ రాజ్ అనగానే.. కళావతి కలలోంచి బటయకు వస్తుంది. నిజంగానే మీరు చెప్పిన పరిస్థితులు వచ్చేశాయండి. మీకు తెలియకుండానే.. నాకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు మీరు నాకిచ్చిన మాట నిలబెట్టుకునే టైం వచ్చింది. ఈ జ్ఞాపకాన్ని తిరిగి మీ దగ్గరకే పంపిస్తున్నా.. దీన్ని ఆధారం చేసుకుని మీ గుండె లోతుల్లో ఉన్న జ్ఞాపకాలను బయటకు తీసుకురండి. రేపు మీరు గుడికి ఈ షర్ట్ వేసుకుని రావాలి అని షర్ట్ కొరియర్ చేయాలని అనుకుంటుంది.
మరోవైపు రాజ్ కూడా కావ్య గురించి ఆలోచిస్తుంటాడు. ఇంతలో కావ్యనే ఫోన్ చేస్తుంది. హలో కళావతి గారు నేనే మీకు ఫోన్ చేద్దామనుకున్నానండి. అని చెప్పగానే.. కాల్ చేద్దామనుకున్నారా..? అని కావ్య అడగ్గానే.. గుడిలో అన్నదానం చేద్దాం అనుకున్నాం కదా..? ఆ పనులు ఎంత వరకు వచ్చాయో తెలుసుకుందామని అడుగుతాడు. దీంతో మాటిచ్చాను కదా..? నా మీద నమ్మకం లేదా..? అని కావ్య అడుగుతుంది. దీంతో ఉంది లేండి.. అంటూ రాజ్ చెప్పగానే.. సరే మీకో సర్‌ప్రైజ్ కాసేపట్లో మీకు ఒక కొరియర్ వస్తుంది చూడండి అని చెప్పి కాల్ కట్ చేస్తుంది కావ్య.
ఇంతలో కొరియర్ బాయ్ వచ్చి సార్ కొరియర్ అని గట్టిగా పిలుస్తాడు. రాజ్ వెంటనే కంగారు పడతాడు. బయటకు పరుగెత్తుకొస్తాడు. ఇంతలో యామిని వచ్చి ఎవరికి వచ్చింది అని అడుగుతుంది. రాజ్ నా కోసమే వచ్చింది అని చెప్పి కంగారుగా పార్శిల్ తీసుకుని వెళ్లిపోతాడు. యామిని రాజ్‌ను అనుమానిస్తుంది. రాజ్ రోజురోజుకు ఇలా మారిపోతున్నాడేంటి..? నిజంగానే బుక్ చేసుకున్నాడా..? లేక ఎవరైనా బుక్ చేస్తే నాతో అబద్దం చెప్తున్నాడా..? అని మనసులో అఉకుంటుంది. లోపలికి వెళ్లిన రాజ్ పార్శిల్ ఓపెన్ చేసి షర్ట్ చూసి కావ్యకు ఫోన్ చేస్తాడు. కాల్ లిప్ట్ చేసిన కావ్య గిఫ్ట్ అందిందా..? అని అడుగుతుంది. దీంతో రాజ్ అందింది అని చెప్తాడు. దీంతో అది చూస్తే మీకేం గుర్తు రాలేదా..? అని అడుగుతుంది. రాజ్ వచ్చింది అని చెప్తాడు.
దీంతో కావ్య హ్యాపీగా నిజంగానా..? ఏం గుర్తు వచ్చింది అని అడుగుతుంది. దీంతో రాజ్ నా మీద మీకున్న అభిమానం కనిపించింది. నాకోసం మీరు పడ్డ కష్టం కనిపించింది. అని చెప్పగానే.. కావ్య ఇంకేమీ గుర్తు రాలేదా..? అని అడుగుతుంది. దీంతో రాజ్ ఇంకేమీ గుర్తు రావాలండి అని అడుగుతాడు. దీంతో ఏం లేదు లేండి.. ఇంతకీ ఆర్ అంటే తెలుసా..? అని అడుగుతుంది. దీంతో ఆర్ అంటే రామ్ అనే కదండి.. అయినా నాకోసం మీరెందుకు ఇంత కష్టపడ్డారు అని అడుగుతాడు. కావ్య సరేనంటూ కాల్ కట్ చేస్తుంది. నా జ్ఞాపకం మీకు గతాన్ని గుర్తు చేస్తుంది అనుకున్నాను. కానీ రాలేదు అనుకుంటూ బాధపడుతుంది.
మరుసటి రోజు ఉదయమే అందరూ హాల్లో కూర్చుని ఉంటారు. కావ్య మాత్రం వంటలు రెడీ చేసి అన్ని కారులో పెట్టమని డ్రైవర్‌కు ఇస్తుంది. ఇంతలో రుద్రాణి వచ్చి ఇదేదో మళ్లీ పొద్దునే ఇన్ని వంటలు చేసి క్యారేజీలు సర్దేస్తుంది. దీని బాబు గాడి ఆస్థి అన్నట్టు మా ఆస్థి మొత్తం తగలేస్తుంది. అని మనసులో అనుకుని శ్రీవారు ఇంకా బతికే ఉన్నారన్న బ్రమలో ఉన్న బతుకుతున్న శ్రీమతి కావ్య గారు ఏదో కార్యానికి శ్రీకారం చుట్టినట్టు ఉంది అని అడుగుతుంది. దీంతో కావ్య శుభకార్యమే లేండి అని చెప్తుంది. దీంతో రుద్రాణి అశుభం జరిగిన ఇంట్లో శుభకార్యమా..? అంటే ఆ శుభకార్యం ఎక్కడ జరిపిస్తున్నారు అని అడుగుతుంది. దీంతో కావ్య మీరెప్పుడు అడుగుపెట్టని చోటు, అడుగుపెడదామన్నా అనుమతి దొరకని చోటు. అని కావ్య చెప్పగానే.. రాహుల్ అంటే గుడే కదా అంటాడు. చూశారా తడుముకోకుండా టక్కున ఎలా చెప్పారో మీ పుత్రరత్నం అంటూ కావ్య చెప్తుండగానే.. అపర్ణ చాలా హుషారుగా అమ్మా కావ్య అన్ని సర్దేశావా..? అంటూ అడుగుతూ వస్తుంది.
అపర్ణను అలా చూసి అందరూ షాక్ అవుతారు. రుద్రాణి మాత్రం ఈవిడ నిన్నటి వరకు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న పేషెంట్‌లా కనిపించింది. కానీ ఇప్పుడేంటి ఇలా కనిపిస్తుంది అని రాహుల్‌తో అంటుంది. ఇంతలో స్వప్న కలగజేసుకుని కావ్య ఏం చెప్పి ఒప్పించిందో కానీ ఆంటీ ఒక్క పూటలో మొత్తం మారిపోయారు అంటుంది. కావ్య పూనుకున్నాకా..? కార్యం కాకుండా ఉంటుందా..? అని ఇంద్రాదేవి అంటుంది. వదినను ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది అన్నయ్యా అంటాడు ప్రకాష్. దీంతో సుభాష్ కూడా అవును ప్రకాషం.. తన పుట్టిన రోజు నాడే మళ్లీ పుట్టినట్టు కనిపిస్తుంది. తన ముఖం అలా వెలిగిపోతుంటే ఈ ఇంటికే వెలుగు వచ్చినట్టు ఉంది. హ్యాపీ బర్తుడే అపర్ణ అని చెప్పగానే అందరూ అపర్ణకు బర్తుడే విషెష్ చెప్తాడు. ఇంతలో రుద్రాణి వెటకారంగా రాలిపోతుందనుకున్న పువ్వు రాగాలు పలుకుతున్నట్టు వదిన గారేంటి చాలా హుషారుగా ఉన్నారు అంటుంది.
దీంతో కావ్య అందరూ విష్ చేస్తుంటే మీకు అర్థం కాలేదా..? ఇవాళ మా అత్తయ్య బర్తుడే.. అని చెప్తుంది. ఇంతలో స్వప్న, ఇంద్రాదేవి ఇద్దరూ కలిసి రుద్రాణిని తిడతారు. అవేమీ పట్టించుకోకుండా రుద్రాని నువ్వేంటి వదిన నిన్నటి వరకు నా కొడుకే లేనప్పుడు పుట్టినరోజు ఎందుకు అన్నావు ఇవాళేంటి ఇలా రెడీ అయ్యావు అని అడుగుతుంది. దీంతో అపర్ణ వెంటనే అక్కడ నా కొడుకే కదా అన్నదానం జరిపించేది అని చెప్తుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. ఇంతలో అపర్ణ తేరుకుని అదే నా కొడుకు స్థానంలో నా కొడలు ఉండి అన్నదానం జరిపిస్తుంది అందుకే ఇలా ఉన్నాను అని చెప్తూ కావ్య మనం గుడికి వెళ్దాం పద అని కావ్యను తీసుకుని వెళ్లిపోతుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?