Intinti Ramayanam Today Episode April 16th : నిన్నటి ఎపిసోడ్ లో.. శ్రీరామ నవమి సందర్బంగా కళ్యాణం జరిపించాలని అందరు కలిసి సంతోషంగా గుడికి వెళ్తారు. అక్కడ కళ్యాణం జరిపించాలని అనుకుంటారు. అక్కడ గుడికి వెళ్లిన వాళ్లంతా కళ్యాణం జరిపించాలని అనుకుంటారు. అయితే పూజారితో పూజ గురించి చెప్తారు. కళ్యాణం కోసం పెద్ద కోడలు లేదని చెప్పాము కదా అంటుంది. మీ పెద్ద కోడలు ఇక్కడే ఉందమ్మా అంటాడు. అప్పుడే అవని అక్కడకు వస్తుంది. నేను ముందుగా చెప్పినట్లు ఈ పూజకు రాను నేను వెళ్లిపోతున్నా అని అంటుంది. ఇదంతా నీ ప్లాన ప్రకారం అందరిని తీసుకొచ్చావా కచ్చితంగా నేను ఇక్కడ ఉన్న నువ్వు వెళ్ళిపోతానని పార్వతి వెళ్ళిపోతుంది. మొత్తానికి పల్లవి పార్వతిని ఒప్పించి తీసుకొని వస్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. సీతా రాముల విగ్రహాలను ఊరేగింపు నుంచి కళ్యాణం వరకు మీరే అన్ని జరిపించాలని పంతులు. విగ్రహాలని ఊరేగిస్తూ వస్తుంటే పల్లవి మనుషులు విగ్రహాల ను కిందపడేలా చేస్తే కళ్యాణ ఆగిపోతుందని అనుకుంటారు. కానీ అటు అక్షయ్ ఇటు అవని ఇద్దరు కలిసి విగ్రహాలను కింద పడకుండా పట్టుకుంటారు. తర్వాత కళ్యాణం జరిపించడానికి అందరూ అక్కడికి వెళ్లాలని అనుకుంటారు. కళ్యాణానికి టైం అయింది మీరు అందరూ రండి అనేసి పంతులుగారు పిలుస్తారు అందరూ వెళ్లి మండపంలో కూర్చొని కళ్యాణం జరిపించే దంపతులు ముందుకు రావాలని అడుగుతాడు.. ముందుగా అవని అన్నీ సిద్ధం చేసి పెడుతుంది. కళ్యాణం జరిపించే దంపతులు వచ్చి పీటలు మీద కూర్చోండి అని అంటారు.
అయితే రాజేంద్రప్రసాదు పార్వతి వచ్చి పీటల మీద కూర్చుంటారు.. అయ్యా మీరు కాదు రావాల్సింది మీ పెద్దబ్బాయి కోడలు.. ఈ కళ్యాణం జరిపించడానికి కారణం వాళ్ళిద్దరే సీతారాము లో విగ్రహాలను పట్టుకొని అపచారం జరగకుండా చూసుకునింది వాళ్ళిద్దరే కాబట్టి వాళ్ళిద్దరే ఈ కళ్యాణి చేయాలని పంతులు అనగానే పీటల మీద కూర్చున్న అక్షయ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అవని పల్లవికి సైగచేస్తుంది.
వెళ్ళిపోతున్న అక్షయ్ ను పల్లవి ఒప్పించి మరీ తీసుకొని వస్తుంది. ఈ కళ్యాణం జరగపోతే మన ఇంటికి అది ఇష్టం మీరు అక్క పక్కన కూర్చోకపోతే పర్లేదు కానీ దీనివల్ల ఏదైనా చెడు జరుగుతుంది ఏమో బావగారు మీరు వచ్చి కళ్యాణ జరిగేంత వరకు ఉండి ఆ తర్వాత మన దారిని మనం వెళ్లిపోదామని పల్లవి ఉంటుంది. ఇక పల్లవి మాటలు విన్న అక్షయ్ కళ్యాణి జరిపించడానికి వచ్చి కూర్చుంటాడు.
ఇక కళ్యాణం జరుగుతున్న సమయం లో మైక్ లో బాంబ్ఉందని పల్లవి ప్లాన్ చేసినట్టు తన మనుషులు చేస్తారు. ఆ మాట వినగానే అందరూ పరుగులు పెట్టుకుంటూ వెళ్ళిపోతారు. అయితే అవని అక్కడే కూర్చోవడంతో అక్షయ అవనీని పట్టుకుని వెళ్ళిపోతాడు.. ఆ తర్వాత అక్షయ వాళ్ళ కుటుంబం దగ్గరకెళ్తే అవని మాత్రం అక్కడ ఏం జరిగింది? ఏంటి ఇదంతా ప్లాన్ అని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే ఊరేగింపు దగ్గరకు వచ్చి అక్కడ ఉన్న తాడును చూసి ఇది కచ్చితంగా ప్లాన్ అని ఆలోచిస్తుంది.
ఆ తర్వాత పల్లవి తన మనుషుల కి డబ్బులు ఇవ్వడం చూసి అవన్నీ చేయి పట్టుకుంటుంది ఏయ్ ఎవరు అని చూస్తుంది. అవని చూసి షాక్ అవుతుంది. గుడిలో కూడా నీ బుద్ధి పోనిచ్చుకోలేదా అనేసి అవని పల్లవిని చంప పగలగొడుతుంది. అందరికీ చెప్పాలని అంటుంది. కానీ పల్లవి మాత్రం ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు అక్క నువ్వు చెప్పినట్టే నేను చేస్తానని అంటుంది. చెప్పినట్లే మైక్ లో ఇక్కడ బాంబు లేదు ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారు అంటూ అనౌన్స్ చేసి అందరిని కళ్యాణ దగ్గరికి రమ్మని కోరుతుంది.
అవినీ అక్షయ్ అనుకున్నట్లుగానే దేవుడు కళ్యాణం పూర్తవుతుంది. ఇక తర్వాత అందరూ పూర్తయింది కదా కళ్యాణం ఇంటికి వెళ్లి పోదామని పార్వతి అంటుంది. అందరూ కలిసి ఇంటికి వెళ్ళిపోతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఆరాధ్య కోసం అవని స్కూల్ టీచర్ గా జాయిన్ అవుతుంది. అది విన్న అక్షయ్ షాక్ అవుతాడు. నా కూతురును నాకు కాకుండా చేస్తున్నావా అని అంటాడు. నా బ్రతుకుదెరువు కోసం టీచర్ అయ్యానని అవని అంటుంది. ఇక అక్షయ్ ఏమి మాట్లాడకుండా ఉంటాడు. అక్కడితో పూర్తి అవుతుంది. రేపు ఎపిసోడ్ ఎలా ఉండబోతుందో చూడాలి..