Deepika Padukone.. పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద స్టార్ హీరోయిన్ గా చలామణి అవుతూ.. భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే(Deepika Padukone). ఇప్పుడు అన్ని భాష ఇండస్ట్రీలలో కూడా నటించడానికి ఆసక్తి చూపిస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు గత ఏడాది ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై రూపు దిద్దుకున్న ‘కల్కి 2898AD ‘ సినిమాలో హీరోయిన్ గా నటించినది. రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ఇందులో హీరోగా నటించగా.. కమలహాసన్(Kamala Haasan), అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan), రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad) తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాతోనే దీపిక తొలిసారి తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ సినిమా చేస్తున్న సమయంలో ఆమె ప్రెగ్నెంట్. అయినా సరే తన పార్ట్ కంప్లీట్ చేసి సెప్టెంబర్ నెలలో పండంటి పాపకు జన్మనిచ్చింది.
దీపికా ఫేవరెట్ టాలీవుడ్ హీరో..
ప్రస్తుతం పాప ఆలనా పాలన చూసుకుంటున్న దీపిక రెండేళ్ల పాటు ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. రెండేళ్ల బ్రేక్ తర్వాత ఆమె నటించబోయే సినిమా కూడా కల్కి 2898AD మూవీ సీక్వెల్ కావడం గమనార్హం. ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా దీపిక మాట్లాడిన మాటలు ఇప్పుడు మళ్ళీ వైరల్ గా మారుతున్నాయి.. దీపిక మాట్లాడుతూ..” నేను ఎంతోమంది హీరోలతో కలిసి పని చేశాను. కానీ ఇప్పుడిప్పుడే టాలీవుడ్ హీరోలతో పనిచేయడం మొదలుపెట్టాను. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద నాకు నచ్చిన ఏకైక టాలీవుడ్ హీరో మహేష్ బాబు(Mahesh Babu). ఆ తర్వాత రానా (Rana) అంటూ తన ఫేవరెట్ హీరోల గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇకపోతే రానా, దీపిక క్లోజ్ ఫ్రెండ్స్ అన్న విషయం అందరికీ తెలిసిందే.
దీపిక కెరియర్..
దీపిక కెరియర్ విషయానికి వస్తే.. సినిమా ఇండస్ట్రీలోకి రావాలనే ఆలోచనతో చదువును మధ్యలో ఆపేసి, మోడలింగ్ రంగాన్ని ఎంచుకుంది. ఆ సమయంలో తన అమ్మ నాన్నను ఎంతోమంది విమర్శించినా.. తన తల్లిదండ్రులు మాత్రం తనను సినిమా దిశగా ప్రోత్సహించారని, తన తల్లిదండ్రుల గొప్పతనాన్ని చెప్పుకొచ్చింది. ఇక పరిశ్రమలోకి అడుగుపెట్టిన కొన్నాళ్లకు మళ్ళీ దూరవిద్యలో డిగ్రీ పూర్తి చేసిన ఈమె.. కన్నడ చిత్రం ‘ఐశ్వర్య’ ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఇక తర్వాత హిందీలో అవకాశాలు తలుపు తట్టాయి. అలా తెలుగులో సూపర్ హిట్ అయిన ‘మన్మధుడు’ సినిమాకి రీమేక్ గా ‘ఓం శాంతి ఓం’ సినిమాలో నటించింది. ఇందులో సోనాలి బింద్రే (Sonali Bendre) పోషించిన పాత్రను దీపికా పోషించి తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో దీపికా మళ్ళీ వెనుతిరిగి చూసుకోలేదు. ఇక అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ నేడు పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకుంది దీపిక. ఇక కల్కి 2 తో రీ ఎంట్రీ ఇచ్చి అటు తెలుగులో కూడా సినిమాలు చేయాలని ఆసక్తి కనబరుస్తోంది. మరి ఎస్.ఎస్.ఎమ్.బి 29 మూవీ తర్వాత మహేష్ బాబుతో నటించే అవకాశం రావాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు.