Brahmamudi serial today Episode: రాకేష్‌కు ఫోన్ చేసిన ఐశ్వర్య ఇన్ని రోజులుగా ఎన్నోసార్లు డబ్బులు తీసుకున్నాను టైంకు ఇచ్చాను.. ఇప్పుడే కొంచెం ఆలస్యం అయింది కదా… ఈ ఒక్కసారి కొంచెం ఆగొచ్చు కదా నీకు ఇచ్చే డబ్బుల కోసం దొంగగా కూడా మారాను అని చెప్పినా వినకుండా రాకేష్ నాకు ఈరోజు డబ్బులు ఇవ్వకపోతే డైరెక్టుగా మీ ఆంటీ దగ్గరకు వెళ్లి డబ్బులు అడుగుతాను అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఐశ్వర్య భయపడుతుంటుంది. కట్ చేస్తే ఒక పార్కులో కూర్చున్న రాజు, లక్కీ పదివేల కోసం ఆశపడి మోసపోయామని బాధపడుతుంటారు. రాజు, లక్కీని తిట్టగానే.. లక్కీ మాత్రం నన్ను అంటావేంట్రా పదివేలకు ఆశపడింది నువ్వు.. కానీ ముందు ఆ సాహు గాని గురించి ఆలోచించు అని చెప్పగానే.. ప్లాన్ చేసి చేయడానికి ఇది ఐదో పదో వేలు కాదు యాభై లక్షలు.. అంత సంపాదించాలంటే మినిమం దానికి ఇన్వెస్ట్ మెంట్ రెండు లక్షలైనా ఉండాలి. కనీసం దానికి పది రోజులైనా టైం ఉండాలి అంటాడు.
దీంతో లక్కీ అంత మన దగ్గర లేవు కదరా అంటాడు. దీంతో అదే కదరా నేను అనేది అంటూ ఇరిటేట్ అవుతుంటాడు. ఇంతలో లక్కీ ఈ టెన్షన్ నుంచి బయట పడాలంటే నా గర్ల్‌ఫ్రెండ్‌కు మెసెజ్ పెట్టడం కరెక్ట్ అనుకుంటాడు. కట్ చేస్తే.. ఇందు, స్వాతి గార్డెన్‌లో కూర్చుని మాట్లాడుకుంటుంటారు. నువ్వే ఏదో ఒకటి చేసి ఈ సమస్య నుంచి బయటపడు అక్కా ఇప్పటి వరకు ఎన్నో సార్లు నీకు నువ్వే ఆలోచించి బయటపడ్డావు అని చెప్తుంటే.. అప్పుడే అక్కడికి ఐశ్వర్య వచ్చి దూరం నుంచి ఇందు, రేఖలను చూస్తూ.. ఇందును కిడ్నాప్ చేసి కోట్లు డిమాండ్ చేయాలని అనుకుంటుంది. అప్పుడే తనకు మెసేజ్ చేస్తున్న లక్కీకి కిడ్నాప్ వ్యవహారం అప్పగించాలని డిసైడ్ అవుతుంది. వెంటనే ఐశ్వర్య లక్కీకి కాల్ చేస్తుంది. నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అని చెప్పగానే.. ఏంటో చెప్పు ఐశు అని అడగ్గానే.. లక్కీ నీ దగ్గర డబ్బు లేదన్న విషయం నాకు తెలుసు అందుకే నీకు నాకు డబ్బులు వచ్చే మార్గం చెప్తాను కలుద్దాం రా అని చెప్పగానే.. లక్కీ ఎగిరి గంతేస్తాడు. వెంటనే రాజును కన్వీన్స్ చేసి ఇద్దరు కలిసి ఐశ్వర్యను కలవడానికి వెళ్తారు.
మరోవైపు వెంకట్ కోపంగా నందు దగ్గరకు వెళ్లి చూస్తుంటాడు. దీంతో నందు ఏంట్రా ఆ కోసం నీ కోపానికి నా పువ్వులు వాడిపోయేలా ఉన్నాయి. అయినా నీ ఫేస్ కు ఆ కోపం సెట్ అవ్వదు కానీ అసలు మ్యాటరేంటి… అని అడగ్గానే.. చేసిందంతా చేసి మళ్లీ కోపం ఎంటీ అంటావా..? పసిపిల్లవాడికి ప్రేమలో సాయం చేసి ఒక ఇంటివాడిని చేస్తానని చెప్పి ఆ ప్రేమను మొగ్గలోనే చించివేస్తావా..? అంటాడు. దీంతో నందు కోపంగా ఏయ్ నేను చేయాలి అనుకుంటే నువ్వు అడగ్గానే.. సినిమా టికెట్స్ ఎందుకు తీసుకొస్తాను..? రెస్టారెంట్ దాకా ఎందుకు వస్తాను అని చెప్పగానే. వెంకట్ మాత్రం రెస్టారెంట్ దాకా వచ్చావు.. నా గర్ల్‌ఫ్రెండ్ ఇంప్రెస్ అయ్యేలా మాట్లాడావు కానీ మధ్యలోనే గాలికి వదిలేశావు.. నేను పిచ్చిపిచ్చిగా మాట్లాడేసరికి నా గర్ల్‌ఫ్రెండ్ మధ్యలోనే వెళ్లిపోయింది అంటూ వెంకట్ బాధపడుతుంటే..
అది నాకు వేరే పని ఉండి వెళ్లిపోయాను అయినా గాలికి ఎక్కడ వదిలేశాను నీ రోజా దగ్గరే కదా వదిలేశాను అనగానే.. నేను సీరియస్‌గా మాట్లాడుతుంటే జోకులు వేస్తావేంటి… ముందు నాకన్న నీకు అత అర్జెంట్ పనేంటని అడుగుతున్నాను అది చెప్పు అనగానే.. అది నీకు చెప్పినా అర్థం కాదు కానీ ముందు నువ్వు ఒక విషయం తెలుసుకోవాలి. ఆ రోజా నీకు సెట్ కాదురా..? తన వల్ల నువ్వు చాలా బాధపడతావు అని చెప్పగానే.. వెంకట్ కోపంగా ఏంటి నువ్వు ఏదైనా ఉంటే డైరెక్టుగా చెప్పేసెయ్ అనగానే.. వీడికి ఎంత చెప్పినా అర్థం కావడం లేదు.. డైరెక్టుగా చెప్పాలా..? అది నిన్ను వాడుకుంటుందిరా..? అని చెప్పగానే.. వెంకట్ కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంటే.. కారు వచ్చి గుద్దేసి వెళ్లిపోతుంటే.. వెంకట్ కిందపడిపోతాడు. వెంటనే నందు వచ్చి హెల్ప్ చేస్తుంది. తిట్టి వెంకట్ ప్రేమకు హెల్ప్ చేస్తానని చెప్తుంది.
మరోవైపు ఐశ్వర్య రెస్టారెంట్‌కు వెళ్లి రాజు, లక్కీలను కలుస్తుంది. కిడ్నాప్ గురించి చెప్పగానే.. రాజు, లక్కీ కోపంగా వెళ్లిపోతారు. మరోవైపు చీకటి రూంలో కూర్చున్న ఇందు ఏడుస్తూ సంతకం గురించి ఆలోచిస్తుంటుంది. ఇంతలో స్వాతి వెళ్లి అక్కా ఏం ఆలోచించావు ఈ ఒక్క రాత్రే నీకు మిగిలింది అని చెప్పగానే.. ఇందు ఏం చేయాలో నాకు ఇప్పటికీ క్లారిటీ రావడం లేదు అని బాధపడుతుంది. తాతయ్య, నాన్నమ్మలను చూపించి నన్ను బ్లాక్ మెయిల్ చేస్తుంది అంటూ బాధపడుతుంది. ఆ దేవుడే ఉంటే నీకు ఎవరితోనో ఒకరితో సాయం చేయిస్తాడులే అక్కా అంటూ ఓదారుస్తుంది స్వాతి. మరోవైపు రాజు ఇంటికి అప్పు ఇచ్చిన సాహు వచ్చి కూర్చుని ఉంటాడు. సాహును చూసిన రాజు, లక్కీ షాక్ అవుతారు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.