E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode August 6th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజుకు షాక్ ఇచ్చిన అపర్ణ – ఇందు మెడలో తాళి వేయమన్న సుభాష్   

Brahmamudi Serial Today Episode August 6th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజుకు షాక్ ఇచ్చిన అపర్ణ – ఇందు మెడలో తాళి వేయమన్న సుభాష్   
Advertisement

Brahmamudi serial today Episode: వెంకట్‌ కోసం ఇంటికి వెళ్లిన నందు ఏదేదో మాట్లాడుతుంటే.. వెంకీ మాత్రం తనకు పని ఉంది తర్వాత కలుద్దామని చెప్తాడు. ఇంట్లో అమ్మానాన్న ఉన్నారని వాళ్లు వింటే బాగోదని చెప్పి తనకు కోచింగ్‌కు టైం అవుతుందని వెళ్లబోతుంటే.. నందు బైక్‌ ఎక్కి కూర్చుని పద వెళ్దాం అంటుంది. ఎందుకు బైక్‌ ఎక్కావని అడిగితే మాట్లాడాలి పదా అంటుంది. వెంకీ బైక్‌ స్టార్ట్‌ చేసుకుని వెళ్తాడు.

వర్క్‌ చేసుకుంటున్న రేఖ దగ్గరకు లక్కీ వెళ్లి తన అమ్మ గురించి తెలిసిందా.? అని అడుగుతుంటే.. రేఖ మౌనంగా వింటుంది. అప్పుడే రాజు వచ్చి కూడా రేఖను కొంచెమైనా వీడి గురించి ఆలోచించారా పిన్ని అని అడుగుతాడు. ఒకవేళ వీళ్ల అమ్మకు వీడు ఎవడో తెలిసినా కూడా బయటకు చెప్పుకోలేక భయపడుతుంది అంటావా..? పిన్ని అని అడుగుతాడు. నువ్వు ఒక బిడ్డకు తల్లివే కదా..? ఒకవేళ బిడ్డ తల్లికి దూరం అయితే ఆ తల్లి ఫీలింగ్‌ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించు పిన్ని అంటాడు. లక్కీ మాత్రం ఒరేయ్‌ నువ్వు ఉండరా..?  సారీ మేడం వీడి మాటలేం పట్టించుకోవద్దు.. నా ముఖం చూసైనా మా అమ్మ గురించి పట్టించుకోండి మేడం.. అంటూ రిక్వెస్ట్‌ చేస్తాడు. తను ఆ పనిలోనే ఉందని ఒకసారి మా రేఖ పిన్ని ఒక్కసారి మాట ఇచ్చిందంటే తప్పదు.. మనం వెళ్దాం పద అంటూ లక్కీని తీసుకుని వెళ్లిపోతాడు.

Advertisement

ఇందు, అపర్ణ ఇద్దరూ తమ నాటకం మొదలు పెట్టాలని రాజు ఎక్కడున్నాడని చూస్తారు. అప్పుడే రాజు ఇంట్లోకి వస్తుంటాడు. రాజును చూసిన ఇందు అదిగో వస్తున్నాడు.. ఇక మనం స్టార్ట్‌ చేద్దాం అంటుంది. మరీ ఎక్కువ విసిగించకండి బాధపడతాడు అని సుభాష్‌ చెబితే చాలు ఊరుకోండి నా మనవడితో నేను ఆడుకుంటున్నాను అంటుంది అపర్ణ. రాజుకు వినబడేటట్టు ఇందు నో నేను దీనికి ఒప్పుకోలేను.. అంటుంది. ఇదేంటో గరం మీద ఉంది అనుకుంటూ దగ్గరకు వెళ్లి ఏమైంది అని రాజు అడగ్గానే.. ఏదో ఒకటి అయింది. ఇందులో నువ్వు ఇన్వాల్వ్‌ అవ్వొద్దు.. నేను చూసుకుంటాను అంటుంది. మేము చెప్పేది మీ మంచి కోసమే కదమ్మా అంటూ సుభాష్‌ చెబితే.. మీరెన్ని చెప్పినా నేను వినను గాక వినను అంటుంది. అందుకు రాజు కోపంగా ఏయ్‌ ఇందు ఏం మాట్లాడుతున్నావు.. పెద్దవాళ్లు ఏం చెప్పినా మనం వినాలి అంటాడు.

విషయం తెలియక మాట్లాడుతున్నావు అంటుంది ఇందు. ప్రాబ్లం ఉన్నా సరే మనం సాల్వ్‌ చేసుకుని వాళ్లను సంతోషపెట్టాలి అంటాడు. అప్పుడు అపర్ణ, సుభాష్‌ మేము ఏం చేసినా నువ్వు కాదనకుండా ఉంటావా..? అని అడుగుతారు. మీరు ఏది అడిగినా నేను చేస్తాను.. అమ్మమ్మ మీరేం చెప్తున్నారో అడగండి అంటాడు రాజు  మీ పెళ్లి మేము చూడకుండానే జరిగిపోయింది కదా… అలాగే ఇందు తాళిబొట్టుకు నల్లపూసలు లేవు.. అందుకే పంతులు గారిని పిలిపించి అమ్మవారి సమక్షంలో నీచేత ఆ నల్లపూసల తాళి వేయిస్తే ఒక పని పూర్తవుతుంది అని అపర్ణ చెప్పగానే. రాజు షాక్‌ అవుతాడు. మౌనంగా ఉండిపోతాడు. దీంతో అపర్ణ చెప్పు బాబు ఏం మాట్లాడటం లేదు.. అనగానే.. రాజు ఏదోలా సైడ్‌ అయిపోదాం అని మనసులో అనుకుని ఏదేదో చెప్తుంటే.. అపర్ణ, సుభాష్‌ కచ్చితంగా చేయాలని చెప్తారు. దీంతో రాజు తమ దూరపు చుట్టం ఎవరో చనిపోయారని మైల ఉంది కాబట్టి ఇప్పుడు వద్దు అంటూ చెప్పి వెళ్లిపోతాడు. నువ్వు ఎన్నిరోజులు ఇలా తప్పించుకుని తిరుగుతావో చూస్తాను మనవడా అనుకుంటూ అపర్ణ, సుభాష్‌, ఇందులు నవ్వుకుంటారు.

Advertisement

రెస్టారెంట్‌ కూర్చున్న వెంకీతో నందు గట్టిగా అడుగుతుంది. తనతో ఎందుకు అంత మూడీగా ఉంటున్నావు.. నేనేం తప్పు చేశాను అంటూ నిలదీస్తుంది. దీంతో వెంకట్‌ తాను బిజీగా ఉన్నానని అందుకే మాట్లాడలేకపోతున్నాను అంటాడు. నీతో స్పెండ్ చేస్తే.. నాకు టైం వేస్ట్‌ అవుతుంది కానీ తనకు ఒరిగేది ఏమీ లేదని చెప్తాడు. నీ వల్లే నా లైఫ్‌ స్పాయిల్‌ అవుతుంది. నీ టైం వేస్ట్‌ చేసుకోకు.. నా టైం వేస్ట్‌ చేయకు అంటూ గట్టిగా చెప్పి వెళ్లిపోతాడు. నందు ఏడుస్తూ.. కూలబడిపోతుంది.

దుగ్గిరాల ఇంట్లో అందరూ హాల్లో కూర్చుని మాట్లాడుతుంటే.. ఒక వ్యక్తి వచ్చి ఐశ్వర్యను పిలుస్తాడు. భ్రమరాంబ కోపంగా ఏయ్‌ ఎవరు నువ్వు సరాసరి ఇంట్లోకి వచ్చి ఐషును పిలుస్తున్నావు అని అడగ్గానే.. తన దగ్గర ఐశ్వర్య మూడు లక్షలు అప్పు తీసుకుందని ఆ అప్పు వసూలు చేసుకోవడానికి వచ్చానని చెప్తాడు. అందరూ షాక్‌ అవుతారు. అప్పు పత్రం ఏమైనా ఉందా..? అని అందరూ అడిగితే నేను ఐషును నమ్మి డబ్బులు ఇచ్చానని ఆ టైంలో పేపర్‌ రాసుకోలేదని చెప్తాడు. ఇందు కోపంగా ఐశ్వర్యను పిలవమని స్వాతికి చెబితే స్వాతి వెళ్లి ఐశ్వర్యను తీసుకొస్తుంది. ఐషు కిందకు వచ్చి ఆ వ్యక్తిని తిడుతుంది. ఇంతలో ఈరోజు బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

తప్పు మగాడిదైనా.. నింద ఆడదానికేనా? అనసూయ స్ట్రాంగ్ కౌంటర్!

ఆ ఇద్దరూ మరీ అంత వరస్ట్? ఇచ్చిపడేసిన నాగ్!

బిగ్ బాస్ 10.. ఈ వారం కృష్ణుడు ఎలిమినేట్.. రెమ్యూనరేషన్ ఎంతంటే?

మహాభారతం ‘భీముడు’ పై కేస్ ఫైల్.. అసలేం జరిగిందంటే?

Podarillu Chakri : చక్రికీ బంఫర్ ఆఫర్.. ఇది అస్సలు ఊహించిఉండరు..

Podarillu Today Episode : కేశవకు జాగారం.. మాధవ్ కు వార్నింగ్.. నిజం చక్రికీ తెలుస్తుందా..?

Intinti Ramayanam Today Episode: పార్వతిని చంపేందుకు ప్లాన్.. కిడ్నాపర్స్ ఎంట్రీ.. పల్లవి దొరుకుతుందా..?

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి దిమ్మతిరిగే షాక్.. మీనాపై చింతామణి రివేంజ్.. పాపం..

Big Stories

Advertisement
×