Brahmamudi serial today Episode: దుగ్గిరాల ఇంట్లో బారసాల జరుగుతుండగా.. అనామిక వస్తుంది. అందరూ తిడుతుండగానే.. నేనొక రహస్యం చెప్తాను అంటుంది. దీంతో అందరూ అనామికను ఇక్కన్నుంచి వెళ్లిపోమ్మని తిడుతుంటే.. రుద్రాణి, ధాన్యలక్ష్మీ ఆపి ఏంటా నిజం చెప్పు అని అడుగుతారు. దీంతో రాజ్, కావ్య వంద కోట్లు అప్పు చేశారు. అందుకోసం మీ ఆస్తులు ఒక్కోక్కటి తాకట్టు పెడుతున్నారు. అని చెప్తుంది అనామిక. దీంతో అందరూ షాక్ అవుతారు. ఏంట్రా అనామిక చెప్పేది నిజమా అని సుభాష్.. ఏంటి కావ్య నిజమేనా అంటూ అపర్ణ అడుగుతారు. ఇంతలో రుద్రాణి.. అమ్మో ఇప్పుడు అర్థం అవుతుంది. ఇన్నాళ్లు ఒక్క టిఫిన్ ఒక్క కూర అని ఎందుకు రూల్స్ పెట్టిందో.. ఒక్క కారు ఉంచి మన అన్ని కార్డులు బ్లాక్ చేయించి మన అందరినీ పేదరికంలోకి నెట్టేసింది. ఇందుకేనా..? అంటుంది.
దీంతో ఇందిరాదేవి కోపంగా నువ్వు ఆపు రుద్రాణి.. ఒక అనామకురాలు వచ్చి ఏదేదో వాగితే నువ్వు రాదాంతం చేయడానికి కారణం దొరికిందా..? అంటూ ప్రశ్నిస్తుంది. దీంతో రాహుల్ కూడా అమ్మమ్మ అనామిక చెప్పింది అబద్దమే అయితే రాజ్, కానీ కావ్య కానీ ఎందుకు ఏమీ అనడం లేదు. ఎందుకు మౌనంగా ఉంటున్నారు అంటాడు. ఇంతలో ధాన్యలక్ష్మీ అత్తయ్యా ఇందులో నిజం ఉందనిపిస్తుంది అంటుంది. దీంతో ఇందిరాదేవి ఏంటా నిజం ధాన్యలక్ష్మీ కుటుంబంలో అనవసరమైన ఖర్చులు తగ్గించడానికి కావ్య చేసిన ప్రయత్నం మీకు ఇలాగా కనిపిస్తుందా..? అంటుంది. దీంతో అనామిక అది అనవసరమైన ఖర్చులు తగ్గించడానికి చేసిన ప్రయత్నం కాదు అమ్మమ్మ గారు.
బ్యాంకు వాళ్లు వంద కోట్లు కట్టాలని ఇచ్చిన నోటీసు ఇది మీరే చూడండి.. అని పేపర్లు ఇస్తుంది అనామిక. ఆ పేపర్లు చూసిన సుభాష్ షాకింగ్‌గా అలాగే నిలబడిపోతే.. అందరూ ఏమైందని అడుగుతారు. అందులో ఏముందని అడుగుతారు. దీంతో సుభాష్ అవును బ్యాంకుకు వంద కోట్లు కట్టాలి అని చెప్తాడు. దీంతో అందరూ షాక్ అవుతారు. దీంతో అనామిక సంతోషంగా హమ్మయ్య ఇన్నాళ్లకు దుగ్గిరాల వాళ్ల ముఖచిత్రాలు మాడిపోవడం, వాడిపోవడం కళ్ళారా చూశాను. ఇక ప్రశాంతంగా నిద్రపోతాను. ఇక మీరు మీరు చూసుకోండి. మీరంతా నడిరోడ్డు మీదకు వచ్చినప్పుడు ఆదృశ్యాన్ని చూడ్డానికి మళ్లీ వస్తాను టాటా.. అంటూ వెళ్లిపోతుంది అనామిక.
తర్వాత ధాన్యలక్ష్మీ కోపంగా ఏ బినామీ ఆస్థులు కొనడానికి బ్యాంకులో అప్పు చేశారు అంటూ నిలదీస్తుంది. అపర్ణ కూడా ఎందుకు అప్పు చేశారో చెప్పండి అంటూ అరుస్తుంది. దీంతో కళ్యాణ్ కూల్‌గా అన్నయ్యా మీరు ఏదో కారణం ఉంటేనే ఇలా చేసి ఉంటారు. ఆ బలమైన కారణం ఏంటో అందరికీ చెప్పండి అన్నయ్య అంటాడు. ఇంకా బలమైన కారణం ఏంట్రా ఆసలు ఎందుకు ఆప్పులు చేశారో తెలుసుకో అంటుంది ధాన్యలక్ష్మీ. అందరూ రాజ్, కావ్యలను ఎందుకు అప్పులు చేశారని నిలదీస్తారు. దీంతో కావ్య చెప్పబోతుంటే.. రాజ్ ఆపేసి.. నువ్వేం చేయలేదు.. అంతా నేను చెప్పిందే చేశావు అంటూ నేను కళావతి రాత్రింబవళ్లు కష్టపడి 25 కోట్ల అప్పును తీర్చగలిగాం ఇక 75 కోట్ల అప్పును తీరుస్తాం.. కంపెనీ ఆస్తులు ఎక్కడికి పోలేదు ఇందులో కళావతి తప్పేం లేదు.. రా కళావతి అంటూ కావ్యను తీసుకుని పైకి వెళ్లిపోతాడు.
రాజ్, కావ్య కలిసి వంద కోట్లు అప్పు చేయడమేంటని సుభాష్‌తో అపర్ణ బాధపడుతుంది. వాళ్లు ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావడం లేదని ఏదో బలమైన కారణం నిజాన్ని బయటకు చెప్పుకోకుండా అడ్డుపడుతుంది అంటాడు సుభాష్. ఇలాగే మౌనంగా ఉంటే ఇంట్లో సమస్య ఇంకా పెద్దది అయ్యేలా ఉంది అంటుంది అపర్ణ. రూంలోకి వెళ్లిన కావ్య కూడా ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదు అంటుంది కావ్య. దీంతో రాజ్ మంచి చేయాలనుకున్నవాడికి ఒక్కటే దారి, కానీ చెడు చేయాలనుకున్న వాడికి ఎన్నో దారులు అంటూ ఇది కూడా మనకు మంచిదే ఎందుకంటే వంద కోట్ల విషయం బయటకు వచ్చింది కానీ తాతయ్య విషయం బయటకు రాలేదు అందుకే మనం సంతోషించాలి అంటాడు. మీరు అన్నది నిజమే కానీ రుద్రాణి అప్పు ఎందుకు చేశామో కూపీ లాగడం మొదలుపెడుతుంది అంటుంది కావ్య.
ప్రకాష్, కళ్యాణ్ ఆలోచిస్తుంటే.. ధాన్యలక్ష్మీ వచ్చి ఇలా ఎవరికి వాళ్లు ఆలోచిస్తూ కూర్చుంటే.. సమస్యలకు పరిష్కారం దొరుకుతుందా..? ఇప్పటికైనా నేను చెప్పినట్టుగా నిర్ణయం తీసుకోండి. పరిస్థితులు చేయి దాటకముందే బయటపడతాం అంటుంది. దీంతో కళ్యాణ్ ఏంటమ్మా నువ్వు ఇంత స్వార్థంగా ఎలా ఆలోచిస్తున్నావు.. ఒకవైపు వంద కోట్ల అప్పు విషయం బయట పడింది. అన్నయ్య, వదిన మాత్రమే కష్టపడి సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తుంటే.. దాని గురించి ఆలోచించి మన వాటా గురించి ఆలోచించమంటావా..? అంటాడు. దీంతో ఇంత పెద్ద తప్పు బయటపడితే ఇంకా ఇలా ఆలోచిస్తావేంటి అంటూ సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను అసలు మీ అన్నయ్య వంద కోట్లు అప్పు చేసినప్పుడు నీకు చెప్పాడా..? అని అడుగుతుంది. లేదని కళ్యాణ్ చెప్తాడు. ఆ వంద కోట్లు వాళ్లు తీసుకుని వాటి కోసం ఆస్థులు అమ్ముకుంటూ వస్తున్నారు అదైనా అర్థం చేసుకో అంటూ ధాన్యలక్ష్మీ చెప్పగానే.. కళ్యాణ్, ప్రకాష్ ఆలోచనలో పడిపోతారు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?