IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ (Indian Premier League 2025 Tournament ) కోసం క్రికెట్ అభిమానులు అంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్న.. ఈ సమ్మర్ టోర్నమెంట్ కోసం… ఇప్పటినుంచి… ఫ్యాన్స్ అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ (Indian Premier League 2025 Tournament ) రాగానే… రచ్చ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఐపీఎల్ 2025 గురించి ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మెగాటోనికి సంబంధించిన షెడ్యూల్ ఖరారు అయిందని వార్తలు వస్తున్నాయి.
Also Read: Donate Organs Campaign: అవయవ దానం.. రంగంలోకి టీమిండియా ప్లేయర్స్ !
ప్రారంభ అలాగే ఫైనల్.. తేదీలను ఇప్పటికే ప్రకటించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి…. షెడ్యూల్ కూడా ఖరారు చేసిందట. అయితే ఈ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 కు (Indian Premier League 2025 Tournament ) సంబంధించిన… షెడ్యూల్ ను వచ్చే వారం రిలీజ్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వచ్చే ఆదివారం తర్వాత ఈ షెడ్యూల్ రిలీజ్ చేయనున్నారని సమాచారం అందుతుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారట అధికారులు.
దాదాపు 70 కి పైగా గతంలో నిర్వహించినట్లుగానే… మ్యాచ్ల సంఖ్య కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈసారి 10 జట్టుకు మొత్తం 74 మ్యాచ్ లు ఆడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంటు మార్చి 21వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఇక ఫైనల్ వచ్చేసి… మే 25వ తేదీన చాలా గ్రాండ్ గా జరగనుంది. అయితే ఈసారి ఫైనల్ మ్యాచ్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరగనుంది. 2024 టోర్నమెంట్… కేకేఆర్ ( KKR) సాధించిన సంగతి తెలిసిందే. ఈ కారణంగానే ఐపిఎల్ 2025 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ను ఈసారి ఈడెన్ గార్డెన్స్ లో నిర్వహించబోతున్నారు. అలాగే ప్లే ఆప్స్ లాంటి మ్యాచులు హైదరాబాదులో జరిగే ఛాన్సులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే వీటికి సంబంధించిన.. వివరాలను మరో వారం రోజుల్లో ప్రకటించబోతుంది బిసిసిఐ. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు… గతంలో లాగానే… ఢిల్లీ అలాగే వైజాగ్ స్టేడియాలలో ఆడనుంది.
ఢిల్లీకి ఈ రెండు స్టేడియాలు హోమ్ గ్రౌండ్ లు గా ఉండనున్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం ప్లే ఆఫ్ 1 అండ్ ఎలిమినేటర్ మ్యాచులు… హైదరాబాదులో ( Hyderabad ) నిర్వహించేందుకు కసరత్తులు జరుగుతున్నాయట. ఎందుకంటే.. ఐపీఎల్ 2024 టోర్నమెంట్ లో ఫైనల్స్ ఓడిన జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్. అందుకే.. అక్కడ మ్యాచ్ లు జరిగే ఛాన్స్ ఉంది. ఇక ప్లే ఆఫ్ 2 మాత్రం కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ లో జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉండగా… ఇప్పటి వరకు అన్ని జట్లకు కెప్టెన్లను ప్రకటించారు. కానీ… బెంగళూరు, అలాగే ఢిల్లీ జట్లకు ఇంకా కెప్టెన్స్ ఫైనల్ కాలేదు. మరో నెల రోజుల సమయం మాత్రం టోర్నమెంట్ ప్రారంభానికి ఉంది. ఆలోపే ప్రకటించే ఛాన్స్ ఉంది.
Also Read: Nitish Kumar Reddy: సిక్స్ ప్యాక్ తో షేక్ చేస్తున్న నితీష్ కుమార్..హీరోలు కూడా పనికిరారు !
🚨 IPL 2025 SCHEDULE. 🚨
– IPL schedule set to be announced next week. (Sports Tak). pic.twitter.com/59GoUz0Qde
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 10, 2025