Brahmamudi serial today Episode: యామిని, కావ్యకు ఫోన్ చేసి మా పెళ్లి కానివ్వు మీ మధ్య ఉన్న కాస్త బంధం కూడా తెంపేస్తానని చెప్తుంది. ఎప్పుడూ మాటకు మాట సమాధానం ఇచ్చేదానివి ఇప్పుడు మౌనంగా ఉన్నావు. అయినా అంతకు మించి ఏం చేస్తావులే.. ఏం చేసినా రాజ్ ప్రాణాలకు ప్రమాదం కదా అంటుంది యామిని. కావ్య కోపంగా ఆ ఒక్క కారణంతోనే నువ్వు బతికి పోతున్నావు అంటుంది కావ్య. ఆ ఒక్క కారణం చాలు కదా..రాజ్ ను నా సొంతం చేసుకోవడానికి అంటుంది యామిని. దీంతో అది నీ వల్ల కాదు అని హెచ్చరిస్తుంది కావ్య. నా వల్ల ఏం కాదో కళ్లారా చూశాక కూడా ఇంకా ఇలా మాట్లాడుతున్నావా..? అంటుంది యామిని.
ఆయనతో మూడు ముళ్లు వేయించుకోవడానికి ఐదు నిమిషాలు ముందు కూడా నేనే తన భార్యను అన్న విషయం నాకు కానీ ఆయనకు కానీ తెలియదు. కానీ ఆ ఐదు నిమిషాల్లోనే మొత్తం జరిగిపోయింది. ఒకరికి ఒకరం శత్రువుల్లా చూసుకున్నా మా మధ్య ఆ మూడు ముళ్ల బంధం పడిపోయింది. నువ్వంటున్న ఆ పెళ్లి జరిగే చివరి నిమిషం వరకు నేను నమ్మకంగా ఉంటాను. ఆయన ఎప్పటికైనా నావైపే వస్తారు. నన్నే భార్యగా స్వీకరిస్తారు అంటూ కావ్య చెప్పగానే.. ఇంత జరిగినా నీలో నమ్మకం మాత్రం చావలేదు. సరే నీ నమ్మకం నీది నా నమ్మకం నాది. నా రాజ్‌ను సొంతం చేసుకునే చూపిస్తా బాయ్ కళావతి అంటూ కాల్ కట్ చేస్తుంది యామిని. తర్వాత కావ్య దేవుడి దగ్గర కూర్చుని బాధపడుతుంది.
కళ్యాణ్, అప్పు, స్వప్న, అపర్ణ, ఇంద్రాదేవి వెళ్లి రాజ్‌ను కలుస్తారు. అందరూ మౌనంగా ఉంటారు. దీంతో రాజ్ నాతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని చెప్పి మీరేంటి మౌనంగా ఉన్నారేంటి..? అని అడగ్గా.. అంటే అది.. అంటూ అపర్ణ ఏదో చెప్పబోతుంటే.. మీరు మాట్లాడకండి.. మిమ్మల్ని ఎంతో నమ్మాను.. మీ కొడుకు స్థానంలో ఉండి మీ పుట్టిన రోజు జరిపించాను. కానీ మీరు నన్ను చాలా బాధపెట్టారు అంటాడు. దీంతో ఇంద్రాదేవి.. చూడు రామ్ వీళ్లు నీతో నిజం దాచారు. కానీ అలా దాచేసి నీతో ఏదో చేయకూడని పని చేశారా..? అన్నదానమే కదా చేయించారు అంటుంది. అది చెప్పి చేయించొచ్చు కదా..? కళావతి చెప్పకపోతే పెద్దావిడ అయ్యుండి ఈవిడైన ఎలా అబద్దం చెప్తుంది అంటాడు రాజ్. దీంతో అపర్ణ.. కళావతి నన్ను చూడగానే.. ఎవరో తెలియనట్టు ఉండటంతో నేను అలాగే ఉండిపోయాను బాబు అని చెప్తుంది. అదే ఎందుకు కళావతి ఈ విషయం నా దగ్గర దాచాల్సిన అవసరం ఏముంది..? అది మోసం కాదా..? అంటూ నిలదీస్తాడు రాజ్.
దీంతో ఇంద్రాదేవి కల్పించుకుని కళావతి నీ దగ్గర నిజం దాచింది. నిజం చెప్పకపోవడం తప్పే అవుతుంది. అబద్దాన్ని నిజం చేయాలనుకోవడం మోసం అవుతుంది. నా మనవరాలు నిన్ను మోసం చేయలేదు అని చెప్పగానే.. కాస్త అర్థం అయ్యేట్టు చెప్పండి నాన్నమ్మగారు అంటాడు రాజ్. దీంతో అందరూ కలిసి తమ మాటలతో రాజ్‌ను కన్వీన్స్ చేస్తారు. కావ్య.. రాజ్‌ను ప్రేమిస్తుందని చెప్తారు. దీంతో రాజ్ ఎమోషనల్ అవుతాడు. అంటే ఇన్ని రోజులు కళావతి నాతో తిరిగింది అనగానే ఇష్టంతోనే అంటుంది ఇంద్రాదేవి.. నాతో కలిసి రెస్టారెంట్లకు తిరిగింది అని అడగ్గానే.. ప్రేమ ఉంది కాబట్టి అంటాడు కళ్యాణ్. అంటే నేను ఇచ్చిన చీరను కట్టుకుంది అనగానే.. నిన్ను భర్తగా కట్టుకోవాలనుకుంది కాబట్టి అనగానే రాజ్ సంతోషంతో అయ్యబాబోయ్ ఇన్ని రోజులు ఈ విషయం తెలియకుండానే పిచ్చోడిలా తిరిగానా..? అనుకుంటూ ఎగ్జైంటిం అవుతాడు. డైరెక్టుగా వెళ్లి నేను కూడా ప్రేమిస్తున్నాను అని చెప్తాను అనగానే.. వద్దని అందరూ చెప్తారు.
ఏం చేయాలో కావ్యతో ఎలా నడుచుకోవాలో అందరూ చెప్తారు. రాజ్ సరే అంటాడు. అందరూ కలిసి రాజ్‌ను ఇంట్లోకి తీసుకొచ్చి టిఫిన్స్ పెడుతుంటారు. కావ్య కిందకు వచ్చి రాజ్ ను చూసి షాక్ అవుతుంది. ఈయన ఏంటి అమ్మమ్మ వాళ్లందరితో గతంలో ఉన్నట్టే మాట్లాడుతున్నారు. కొంపదీసి గతం గుర్తుకు వస్తుందా ఏంటి అనుకుంటుంది. ఇంతలో రాహుల్, రుద్రాణి వచ్చి రాజ్‌ను చూసి షాక్ అవుతారు. దగ్గరకు వచ్చి ఏంటి మీరు మీరు ఒక్కటయిపోయారా.? అని అడుగుతుంది. అవునని స్వప్న చెప్పగానే.. అయితే అంతా గుర్తుకు వచ్చిందా..? అంటుంది. రామ్‌కు గుర్తు రావడం ఏంటి..? అంటుంది స్వప్న. దీంతో రాహుల్ మళ్లీ రామ్ ఏంటి..? రాజ్ కదా అంటాడు. దీంతో ఒకరి తర్వాత ఒకరు కన్పీజ్ గా రాజ్‌తో మాట్లాడతారు. ఇంతలో కావ్య దగ్గరకు రాగానే.. రాజ్ హాయ్ కళావతి గారు ఇంత లేటుగానా.. నిద్ర లేచేది.. నేను మిమ్మల్ని కలవడానికి ఎంత ఎర్లీగా వచ్చానో చూడండి అంటాడు. కావ్య మాత్రం ఇక్కడి నుంచి వెళ్లిపోండి అంటూ చేయి పట్టుకుని బయటకు తీసుకెళ్తుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఫస్ట్ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?