Brahmamudi serial today Episode: అపర్ణ, రాజ్‌కు ఫోన్ చేస్తుంది. రేపటి గురించి ఏం ఆలోచించావా అని తెలుసుకోవడానికి ఫోన్ చేశాను అని అడుగుతుంది. దీంతో సూపర్ డ్రెస్‌తో వచ్చేస్తాను.. అని రాజ్ చెప్పగానే.. నేను అడిగింది డ్రెస్ గురించి కాదు.. నీ ఐడియా గురించి.. ఎందుకంటే కళావతి మనసును నువ్వు ఎప్పుడో గెలిచేసుకున్నావు.. నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదు. కానీ ఇప్పుడు తన మనసులో ఉన్న మాటను బయటకు తీసుకురావాలి అంటే తనకు సంబధించింది ఏదైనా నువ్వు ట్రై చేయాలి కదా అని చెప్తుంది. దీంతో రాజ్ అవును కదా ఆ విషయమే మర్చిపోయాను అయితే ఇప్పుడు నన్నేం చేయమంటారు..? అని అడుగుతాడు. దీంతో అపర్ణ ఇది కూడా నేనే చెప్పాలా..? ఆడదాని మనసు గెలుచుకోవాలి అంటే ఏ పువ్వో, చీరో గిఫ్టుగా ఇవ్వాలి. అప్పుడు సంతోషపడుతుంది అని అపర్ణ చెప్పగానే..
అర్థమైంది అమ్మా.. ఇక చూడండి ఎలా రెచ్చిపోతానో.. రేపు తనకు ఇష్టమైన గిఫ్టు పట్టుకొస్తా.. తన మనసు గెలుచుకుంటాను. తన మనసులో మాటలను బయటకు తీసుకొస్తాను.. అని రాజ్ చెప్పగానే. అది చేస్తాను ఇది చేస్తాను అని కోతలు కోయడం కాదు. రేపు అది నిజం కూడా చేయాలి అని అపర్ణ చెప్పగానే.. నేను హనుమంతుడి టైపు అమ్మా.. నా శక్తి నాకు తెలియదు.. ఇలా నువ్వు పక్కన ఉండి ఎంకరేజ్ చేస్తా ఉండు.. ఇక నేను ఏంటో కళావతికి అర్థం అయ్యేలా చేస్తాను.. అయినా రేపు మీరే చూస్తారు కదా..? అంటూ కాల్ కట్ చేస్తాడు. వీడు గతం మర్చిపోయాక నా మాట వింటున్నాడు. ముందే నా మాట విని ఉంటే ఈ పాటికి నాకు మనవడో మనవరాలో పుట్టేవాళ్లు.. అయినా వీల్లు హ్యాపీగా కలిసి ఉండటానికి ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాలో ఏంటో అనుకుంటుంది.
మరోవైపు ధాన్యలక్ష్మీ కోపంగా ప్రకాష్ ను తిడుతుంది. కళ్యాణ్, అప్పు ల విషయంలో జరిగిన సంఘటన చెప్తుంది. వాడు మరీ అలా తయారయ్యాడేంటి అంటూ విరుచుకుపడుతుంది. దీంతో ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు నువ్వు నా మీద పడతావేంటో అంటూ ప్రకాష్ తిడతాడు. మరోవైపు రాజ్ ఎవరికో ఫోన్ చేసి కావ్య కోసం రెడ్ రోజ్ బొకే ఆర్డర్ చేస్తుంటాడు. ఇంతలో యామిని వస్తుంది. ఏంటి బావా ఏదైనా పార్టీకి వెళ్తున్నావా..?అని అడుగుతుంది. లేదే ఎందుకు అలా అడిగావు అని రాజ్ అడగ్గానే.. ఇంత స్టైల్‌గా రెడీ అయి ఉంటే డౌటు వచ్చింది అంటుంది యామిని. దీంతో రాజ్ స్టైల్ గా ఉంది కదా అందుకే ఈ డ్రెస్ సెలెక్ట్ చేసుకున్నాను అంటాడు రాజ్. అదే ఎందుకు అని అడుగుతున్నాను నా గుర్తుకు వచ్చింది బావ రేపు మనం ఇద్దరం వెళ్లి మన రిలేటివ్స్ కు మన పెళ్లి పత్రికలు ఇవ్వాలనుకున్నాం కదా అందుకోసం ఇలా రెడీ అయి ట్రై చేస్తున్నావు కదా అని అడుగుతుంది.
ట్రై చేయడం నిజమే కానీ నువ్వు అనుకుంటున్నట్టు మన రిలేటివ్స్ దగ్గరకు వెళ్లడానికి కాదు. నాకు వేరే మీటింగ్ ఉంది. అని చెప్పగానే.. మీటింగా..? అని యామిని డౌటుగా అడగ్గానే.. మీటింగ్ అంటే ఆఫీసుకు వెళ్లి స్టాఫ్ ను కలవడం కాదు.. నేను వేరే ఒక ఇంపార్టెంట్ వ్యక్తిని కలవాలి అని చెప్పగానే.. సరే బావ రేపు మనం వస్తున్నామని మన రిలేటివ్స్ అందరికీ చెప్పేశాను అంటుంది. దీంతో రాజ్ సారీ యామిని రేపు నీతో టైం అసలు స్పెండ్ చేయలేను అంటూ వెల్లిపోతాడు రాజ్. నాకు తెలుసు బావ నువ్వు కలబోయే ఇంపార్టెంట్ వ్యక్తి ఎవరో.. నీ వైపు నుంచి నేను ఏమీ చేయకపోవచ్చు కానీ ఆ కావ్యకు పూర్తిగా భయాన్ని పుట్టించాను అది చాలు మిమ్మల్ని దూరం చేయడానికి అనుకుంటుంది.
అప్పుకు భోజనం తీసుకెళ్తాడు కళ్యాణ్ స్నానం చేసి వచ్చిన అప్పుతో ఏంటి పొట్టి అలిసిపోయావా..?అని అడుగుతాడు. అవును కూచి వన్ వీక్ నుంచి ఒక కేసు సాల్వ్ అవ్వడం లేదు అందుకే బాగా అలసిపోతున్నాను అంటుంది. అయితే నే అలసట నేను తీర్చుదునా..? అని అడగ్గానే.. ఇద్దరి మధ్య రొమాంటిక్ సీన్ క్రియేట్ అవుతుంది. ఇంతలో కళ్యాణ్ ప్రేమగా అప్పును బెడ్ దగ్గరకు తీసుకెళ్లి భోజనం కలిపి పెడతాడు. దీంతో అప్పు బాధగా చూస్తుంది. ఏమైంది తినే ఓపిక కూడా లేదా..? అని అడుగుతాడు కళ్యాణ్. దీంతో అసలు ఇంత ఓపిక నీకు ఎలా వచ్చింది. మా అమ్మ వాళ్లే నన్ను భరించలేకపోయారు అంటూ ఎమోషనల్ అవుతుంది.
యామిని, రుద్రాణికి కాల్ చేస్తుంది. ఆ ఇంట్లో ఏం జరుగుతుంది అని అడుగుతుంది. నీకింకా తెలియదా..? ఇక్కడ చాలానే జరుగుతుంది అంటూ రుద్రాణి చెప్పగానే.. ఆ కావ్య ఏదో ప్లాన్ చేస్తుంది అని తెలుసు కానీ అదేంటో తెలియడం లేదు అని యామిని చెప్పగానే.. నీ బొంద నీ పేరు విని నీ ప్లాష్ బ్యాక్ తెలుసుకుని నువ్వేదో పెద్ద సైకో విలన్ అనుకున్నాను కానీ నాకంటే కామెడీగా ఉన్నావు. ఈ సారి ప్లాన్ చేసింది కావ్య కాదు. రాజ్ వాళ్ల అమ్మ.. అవును ఎవ్వరికీ తెలియకుండా మా వదిన రాజ్‌ను కలిసి మా కోడలు నిన్ను ప్రేమిస్తుంది. తన మనసు గెలుచుకో అని చెప్పిందట.. అందుకే మంగమ్మ శపథం చేసినట్టు ఇక రోజు ఇంటికి వస్తాడట అని చెప్తుంది.
దీంతో యామిని అలా జరగడానికి వీల్లేదు.. మనం ఎలాగైనా ఆపాలి అంటుంది యామిని.. నువ్వు ఇంకా ప్లాన్ చేయడం దగ్గరే ఉన్నావు.. నేను ఆల్‌రెడీ ఒక ప్లాన్ చేశాను అని చెప్తుంది రుద్రాణి. అవునా ఏం చేయబోతున్నారు అని యామిని అడుగుతుంది. దీంతో రేపు కావ్యకు ఆఫీసు నుంచి ఫోన్ వస్తుంది. కావ్య ఆఫీసుకు వెళ్లి సాయంత్రం వరకు ఇంటికి రాదు. అని చెప్పగానే.. యామిని అయితే మా బావ ప్లాన్ ఫెయిల్ అవుతుంది. రేపు రాజ్ మా ఇంటి నుంచి ఎంత స్పీడుగా ఆ ఇంటికి వస్తాడో అంతే స్పీడుగా మా ఇంటికి వచ్చేలా చేయాలి ఆ బాధ్యత మీది మర్చిపోకండి అని చెప్పి కాల్ కట్ చేస్తుంది యామిని.
స్వప్న నిద్రలో లేచి రాహుల్ ను చూసి రుద్రాణి అనుకుని ఎప్పుడు చూసినా ఆస్తి అంటూ తిరుగుతావు అంటూ తిడుతుంది. నిద్రమత్తులోనే రెండు చెంపలు వాయించి వెళ్లిపోతుంది. మరోవైపు ఆఫీసుకు వెళ్తున్న అప్పును కళ్యాణ్ ఆట పట్టిస్తాడు. కిందకు వెళ్లి అందరికీ స్టేషన్‌కు వెళ్తున్నాను అని చెప్పగానే. క్షేమంగా వెళ్లి లాభంగా రా అని ఇంద్రాదేవి చెప్తుంది. సరేనని అప్పు వెళ్లిపోతుంటే.. లోపలి నుంచి ధాన్యలక్ష్మీ కోపంగా ఆగు అంటూ వస్తుంది. అప్పు ఆగిపోతుంది.ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?