BigTV English

OTT Movie : వింత జంతువులుగా మారే మనుషులు… ఆ ఒక్కడికే ఎందుకు కనిపిస్తున్నారు?

OTT Movie : వింత జంతువులుగా మారే మనుషులు… ఆ ఒక్కడికే ఎందుకు కనిపిస్తున్నారు?

OTT Movie : ఓటీటీలో ఎన్నో రకాల వెబ్ సిరీస్  లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. కొత్తగా పుట్టుకొస్తూనే ఉన్నాయి. అయితే వీటిలో కొన్ని సిరీస్ లు చాలా డిఫెరెంట్ గా ఉంటాయి. ఫాంటసీ జోనర్లో వచ్చే సిరీస్ లు, మరో ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సిరీస్  లో హీరోకి మాత్రమే, మనుషుల రూపంలో ఉండే వింత జంతువులు కనబడుతుంటాయి. ఆ తరువాత అసలు స్టోరీ మొదలౌతుంది. ఈ సిరీస్ మొత్తం చాలా క్రేజీ గా ఉంటుంది. ట్విస్ట్ లు, సస్పెన్స్ తో పిచ్చెక్కిస్తుంది. దీని పేరు ఏమిటి ?ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..


స్టోరీలోకి వెళితే

నిక్ ఒక సాధారణ పోలీస్ డిటెక్టివ్‌గా తన జీవితాన్ని గడుపుతుంటాడు. కానీ అతను ‘గ్రిమ్’ అనే ఒక ప్రత్యేక వంశానికి చెందిన వారసుడని తెలుసుకుంటాడు. గ్రిమ్‌లు అతీంద్రియ శక్తులను కలిగి, ‘వెసెన్’ (Wesen) అనే మాయా జీవులను చూడగలుగుతుంటాడు. ఈ వెసెన్లు మనుషుల రూపంలో జీవిస్తూ, కొన్నిసార్లు ప్రమాదకరంగా మారుతుంటారు. గ్రిమ్‌ లు ఈ వెసెన్‌ లను నియంత్రిస్తూ ఉంటారు. పరిస్థితి చేయి దాటితే, అవసరమైతే వాళ్ళను నాశనం చేస్తుంటారు. నిక్ తన గ్రిమ్ శక్తులను తెలుసుకొని, వెసెన్ ప్రపంచంలోకి ప్రవేశిస్తాడు. అతను తన డిటెక్టివ్ ఉద్యోగంతో పాటు, వెసెన్‌తో సంబంధం ఉన్న నేరాలను కూడా పరిష్కరిస్తుంటాడు. అతని స్నేహితుడు మన్రో, ప్రేమికురాలు జూలియట్, నిక్ కి సహాయం చేస్తుంటారు. ప్రతి ఎపిసోడ్ వెసెన్ జాతి మనుషులు, వారి నేరాల చుట్టూ తిరుగుతుంది. వెసెన్‌లో కొందరు చెడ్డవాళ్ళుగా ఉన్నప్పటికీ, మరికొందరు మంచివాళ్ళు గా కూడా ఉంటారు. చివరికి నిక్ జీవితంలో ఎటువంటి సమస్యలు వస్తాయి ? వెసెన్ మనుషులను ఎలా ఎదుర్కుంటాడు ? నిక్ కు ఉన్న శక్తులు ఎటువంటివి ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే,  ఈ అమెరికన్ ఫాంటసీ పోలీస్ ప్రొసీజరల్ సిరీస్ ను మిస్ కాకుండా చూడండి.


Read Also : ఒంటిపై నూలు పోగు లేకుండా కుప్పలుగా శవాలు… బ్లాక్ మ్యాజిక్ తో వణుకు పుట్టించే హర్రర్ థ్రిల్లర్

నెట్ ఫ్లిక్స్ (Netflix) లో

ఈ అమెరికన్ ఫాంటసీ పోలీస్ ప్రొసీజరల్ సిరీస్ పేరు’ గ్రిమ్’ (Grimm). దీనికి స్టీఫెన్ కార్పెంటర్, జిమ్ కౌఫ్, డేవిడ్ గ్రీన్‌వాల్ట్‌ రూపొందించారు. యూనివర్సల్ టెలివిజన్ దీనిని నిర్మించింది. ఈ సిరీస్ 2011 అక్టోబర్ 28 న రిలీజ్ అయింది. ఆరు సీజన్‌లతో కూడిన 123 ఎపిసోడ్‌లతో 2017 వరకు స్ట్రీమింగ్ అయింది. సిరీస్ స్టోరీ డిటెక్టివ్ నికోలస్ బుర్‌ఖార్డ్‌ను చుట్టూ తిరుగుతుంది. ఇందులో రస్సెల్ హార్న్స్‌బీ, బిట్సీ తుల్లోచ్, సిలాస్ వీర్ మిచెల్, సాషా రోయిజ్, రెగీ లీ, బ్రీ టర్నర్ వంటి నటులు నటించారు. ఈ ఫాంటసీ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది .

Related News

Friday Ott Release Movies: ఓటీటీల్లో సినిమాల జాతర.. ఇవాళ ఒక్కరోజే 15 సినిమాలు..

Mothevari Love story: స్ట్రీమింగ్ కి సిద్ధమైన మోతెవరి లవ్ స్టోరీ.. తెలంగాణ గ్రామీణ ప్రేమకథగా!

OTT Movie : ఆ 19వ ఫ్లోర్ నరకం… యాక్సిడెంట్ తో వర్చువల్ రియాలిటీ గేమ్ ఉచ్చులో… ఓడితే కోమాలోకి

OTT Movie : అయ్య బాబోయ్ టీచర్ కు అబ్బాయిల మోజు… పోలీస్ తోనే వైరల్ వయ్యారి రాసలీలలు

OTT Movie : అందమైన అమ్మాయిపై కన్నేసే మాఫియా డాన్… 365 రోజులు బందీగా ఉంచి అదే పని… అన్నీ అవే సీన్లు

OTT Movie : భార్య ప్రైవేట్ ఫొటోలు బయటకు…. భర్త ఉండగానే దారుణం… బ్లాక్‌మెయిలర్

Big Stories

×