Gundeninda GudiGantalu Today episode May 16th: నిన్నటి ఎపిసోడ్ లో.. మనోజ్ జాబ్ మానేసి ఓనర్ ని తిట్టేసి బయటకు వచ్చేస్తాడు. మీనా సత్యంతో టిఫిన్ పెట్టేసాను మామయ్య పది నిమిషాల్లో టిఫిన్ అవుతుంది మీరు తినేసి టాబ్లెట్ వేసుకోవాలని చెప్తూ ఉంటుంది. పార్వతి అమ్మ మీనా అంటూ వస్తుంది. వాళ్ళు ఉన్నాడేమో చూస్తూ భయపడుతూ ఇంట్లోకి సుమతి పార్వతి వస్తారు. వాళ్లిద్దరిని చూసిన ప్రభావతి రెచ్చిపోతుంది. ఇది మీ నా ఇల్లు కాదు సత్యం గారి ఇల్లు. అయితే గీతే నా ఇల్లు అని కొట్టినట్టు మాట్లాడుతుంది. దానికి సత్యం ప్రభావతి పై సీరియస్ అవుతాడు. ఇంటి గుమ్మం దగ్గర నిల్చొని మీనా అని పిలుస్తారు. ఆ పిలుపు విని మీనా అత్త ప్రభావతి మండిపడుతుంది. మీనా ఇల్లు కాదిది.. సత్యం ఇల్లులు అని, ఎప్పుడూ పడితే అప్పుడు ఊడిపడటానికి, దర్జాగా రావడానికి అవమానంగా లేదా అని ప్రభావతి మీనా తల్లిని అంటుంది. దీంతో మీనా మండిపోతుంది. అత్తపై చూపించలేని కోపాన్ని తన తల్లిపై చూపిస్తుంది. పిలవని పేరంటానికి ఎందుకు వచ్చారంటూ గట్టిగా మందలిస్తుంది. ఇంకోసారి ఈ ఇంటివైపు రావొద్దని ఏదైనా ఉంటే ఫోన్ లోనే చెబితే సరిపోతుందని మీనా తిడుతుంది. మీకు ఇక్కడ అవమానం జరిగితే అది చూసి నేను తట్టుకోలేనని అంటుంది. ఇక ఇదే సమయంలో సత్యం జోక్యం చేసుకుంటాడు. ప్రభావతికి మాత్రం సత్యం కు వార్నింగ్ ఇస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. మనోజ్ జాబ్ మానేయడం పై రోహిణి దారుణంగా మాట్లాడుతుంది. అసలు నువ్వు ఎందుకు జాబ్ మానేస్తున్నావ్ నీకు జాబ్ చేయడం ఇష్టం లేదా.. రెండు వారాలు కూడా కాలేదు అప్పుడే జాబ్ మానేశావ్ ఏ రోజైనా ఒక నెల జాబ్ చేసి చేతిలో నెల జీతం పెట్టావా? అని మనోజ్ ని దారుణంగా అవమానిస్తుంది రోహిణి. అదేంటి రోహిణి నేను జాబ్ చేస్తేనే నువ్వు నాతో ఉంటావా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అంటే.. లేకుంటే ఏంటి మనోజ్ ఈ విషయం కనుక మీ తమ్ముడికి కానీ ఇంట్లో వాళ్లకు గాని తెలిస్తే ఎంత దారుణంగా మాట్లాడతారో నువ్వు ఆలోచించవా అని రోహిణి అంటుంది..
ఓనర్ రోహిణి అందుకే నేను జాబ్ మానేశానని మనోజ్ ఎంత చెప్పినా కూడా రోహిణి మాత్రం వినదు. రోహిణి అక్కడినుంచి వెళ్ళిపోతుంటే ఎక్కడికి రోజు మీ వెళ్ళిపోతున్నావంటే నీకంటే పని పాట లేదు ఖాళీగా ఉంటావు. నాకు మాత్రం పని ఉంది నేను వెళ్ళిపోతున్నానని రోహిణి సీరియస్గా వెళ్ళిపోతుంది.. ఇక మీనా వాళ్ళ నాన్న సంవత్సరికం గురించి ఇంట్లో వాళ్ళందరూ అన్ని తయారు చేస్తుంటారు. అక్కడికి వచ్చిన వాళ్ళు తల ఒక్కరు ఒక్క మాట అంటారు. బాలునే చేయి విరగొట్టాడు కదా అంత తప్పు వీడేం చేశాడు అంటూ చుట్టుపక్కల వాళ్ళందరూ నానా మాటలు అంటారు.
ఏదో జరిగింది అందుకే బాలు చేయి విరగొట్టాడు. మా ఆయన కార్ డ్రైవర్ ఏ కదా అందుకే మాకు ఈ విషయం తెలిసింది అని ఒక ఆవిడ అందులో ఉంటుంది. ఇక ఇవన్నీ ఎందుకు హారతి ఇవ్వండి అని అందరూ అనగానే శివా నేను హారతి ఇస్తానని అంటాడు. చెయ్యి నొప్పి కావడంతో హారతి కింద పడేస్తాడు అది చూసినా పార్వతి నా కొడుకు కన్నతండ్రి కి హారతి కూడా ఇవ్వలేకపోతున్నాడని బాధపడుతుంది. అలాంటి మూర్ఖుడిని పెళ్లి చేసుకొని నువ్వేం కాపురం చేస్తావు నువ్వు ఏం సుఖ పెడతావని కూతురుతో పార్వతి అంటూ బాధపడుతుంది. తండ్రి మాట కాదనలేక అక్కడికి వెళ్తాడు.
అయితే బయట ఉన్న వాళ్ళందరూ బాలు ఎందుకు అలా చేయి విరగగొట్టావ్ వాడు ఎంత తప్పు చేసినా నువ్వు ఇలా చేయి పేరు కొట్టడం కరెక్ట్ కాదు కదా అనేసి అడుగుతారు. ఇక లోపలికి వస్తూ ఉంటే పార్వతి తన అల్లుడు గురించి అందరికీ చెప్తున్నాడు విని సీరియస్ అవుతాడు. ఎందుకు నా గురించి ఇలా చెప్తున్నారు నేను ఇలా కొట్టడానికి కారణం ఏదైనా బలమైన కారణమే ఉంటుందని మీరు ఆలోచించలేదా? కొంచమైనా మీకు ఉందా అని అంటాడు.. శివ కూడా రెచ్చిపోయి మాట్లాడుతాడు. బాలు కోపం కట్టలు తెలుసుకోవడంతో శివను మళ్లీ కొడతాడు. మీనా బాలుని ఆపి అరుస్తుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..