Brahmamudi serial today Episode: కావ్యను మోసం చేశావని బయటకు వచ్చిన రాజ్ ఆత్మ కోపంతో రగిలిపోతూ రాజ్‌ను తిడుతుంది. నువ్వు జీవితాంతం ఇలాగే ఉండిపోతావు ఇదే నా శాపం అంటూ మాయం అయిపోతాడు. మరోవైపు రుద్రాణి, ధాన్యలక్ష్మీ, రాహుల్ భోజనం చేస్తుంటారు. మిగతా ఎవరూ రాకుండా డల్లుగా కూర్చుని ఉంటారు. ఇంతలో ధాన్యలక్ష్మీ భోజనానికి రండి అత్తయ్యా అని పిలుస్తుంది. మేం రానని నువ్వైతే తిను అంటూ తిడతాడు ప్రకాష్. ఇంతలో రాజ్ కిందకు వస్తాడు. అందరం కలిసి భోజనం చేద్దామని అడుగుతాడు. దీంతో అపర్ణ కోపంగా భోజనం చేయకుండా కడుపు మాడ్చుకున్నంత మాత్రాన మూర్ఖులు మారుతారని రుద్రాణి లాంటి మూర్ఖులు కూడా అనుకోరు అని అపర్ణ చెప్తూ.. నువ్వు మర్యాదగా కావ్యను ఇంటకి తీసుకొస్తావా..? లేదా..? అని అడుగుతుంది.
ఏంటి వదిన నిరాహార దీక్ష చేస్తున్నారు కానీ ధాన్యలక్ష్మీ వేరు కుంపటి పెడితే ఒక్కరైనా పట్టించుకున్నారా..? మీదాకా వస్తేనే కష్టం లేదంటే కాదా..? అంటుంది రుద్రాణి. దీంతో ధాన్యలక్ష్మీ మూర్ఖంగా ఆలోచిస్తుంది. నేను నా కొడుకు కాపురం నిలబడాలని కోరుకుంటున్నాను అంటుంది అపర్ణ. ఇంతలో ఇందిరాదేవి కరివేపాకుల గురించి కొత్తిమీర కట్టల గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు అంటూ రాజ్ నువ్వు కావ్యను తీసుకొస్తావా..? లేదా..? అని అడుగుతుంది. దీంతో రాజ్ నేను కావ్యను తీసుకురాను. నేను కూడా మీరు భోజనం చేసే వరకు చేయను అంటూ పైకి వెళ్లిపోతాడు. రాజ్ మొడిగా ఉన్నాడు. రాజ్ వెళ్లి కావ్యను తీసుకురానంటున్నాడు. అసలు ఈ సమస్యను నువ్వెలా తీరుస్తావు అని సుభాష్ అడుగుతాడు.
తర్వాత అపర్ణ ఇంట్లో కనిపించడం లేదని సుభాష్ కంగారుగా హాల్లోకి వస్తాడు. ఫోన్ స్విచ్చాఫ్ వస్తుందని చెప్తాడు. ఇంతలో ధాన్యలక్ష్మీ వచ్చి కొడుకు తన మాట విననప్పుడు ఏ తల్లైనా ఇలాగే చేస్తుంది. అసలే అక్క చాలా సెన్సిటివ్ ఏమైనా చేసుకుంటుందేమో అంటుంది. ఇదొకతి ఎప్పుడు ఎవరికి సపోర్ట్ చేస్తుందో తెలియదు అని రుద్రాణి మనసులో అనుకుంటుంది. ఇంతలో పనిమనిషి శాంత లెటర్ తీసుకుని పరుగున వస్తుంది. అమ్మగారి గది శుభ్రం చేస్తుంటే ఈ లెటర్ దొరికిందని చెప్తుంది. సరిపోయింది లెటర్ రాసి పోయింది అంటే పర్మినెంట్‌గా ఇల్లు వదిలి వెళ్లిపోయిందేమో అంటుంది రుద్రాణి.
అపర్ణ కారు వేసుకుని కనకం ఇంటకి వెళ్తుంది. ఇంటికి సూట్‌కేసుతో ఇంటికి వచ్చిన అపర్ణ చూసి కనకం, కావ్య, మూర్తి షాక్ అవుతారు. కనకం వచ్చి మా కావ్య బట్టలా అని అడుగుతుంది. కాదని వాడు నిన్ను అక్కర్లేదని చెప్పాడు. అసలు నాకు ఆ ఇల్లే అవసరం లేదని వచ్చేశా..? అంటుంది అపర్ణ దీంతో అందరూ షాక్ అవుతారు. మర్యాదగా కావ్యను కాపురానికి తీసుకొస్తావా..? లేదా అని అడిగాను వాడు నా మాట వినలేదు అందుకే వాడికి బుద్దొచ్చి దిగొచ్చి మీ ఇంటికి వచ్చి నిన్ను తీసుకెళ్లడానికి రావాలనే నేను మీ ఇంటకి వచ్చాను అని అపర్ణ చెప్తుంది. దీంతో కావ్య మీరు చేసింది తప్పే అత్తయ్యా అంటుంది. మీరు దుగ్గిరాల ఇంటి పెద్ద కోడలు నువ్వు గడప దాటినప్పుడు ఎందుకు ఆలోచించలేదు అంటుంది కావ్య. నా కొడుకు గురించి నాకు తెలుసు కానీ నువ్వు పిచ్చిపిచ్చిగా ఆలోచించకుండా నేను చెప్పినట్టు చేయ్ అని అపర్ణ చెప్తుంది. దీంతో చిన్నపిల్లలా అలిగి వస్తారా…? అంటూ కావ్య అపర్ణను కన్వీన్స్ చేయాలని చూస్తుంది.
అపర్ణ రాసిన లెటర్ తీసుకుని స్వప్న చదువుతుంది. నాకు తెలిసి వదినకు ఆత్మాభిమానం ఎక్కువ కాబట్టి పుట్టింటికి వెళ్లదు. ఏ అనాథ శరణాలయానికో వెళ్లి ఉంటుంది అని రుద్రాణి అనగానే అందరూ షాక్ అవుతారు. ఇంతలో లెటర్ లో ఉన్న విషయాన్ని స్వప్న చదుతుంది. రాజ్ కోడలిని ఇంటికి తీసుకొచ్చిన రోజే నేను తిరిగి వస్తాను అని లెటర్ లో ఉంటుంది. అది విన్న రాజ్ మా అమ్మ నా వల్లే వెళ్లింది కానీ నా కోసం కాదు తన కోడలిని ఉద్దరించడానికి వెళ్లింది అని రాజ్ చెప్తుండగానే నువ్వు ఏమైనా చేయ్ రాజ్ కానీ మీ అమ్మ మాత్రం ఇంటికి రావాలని చెప్తాడు. దీంతో రాజ్ స్వప్న చేత కనకానికి ఫోన్ చేయిస్తాడు. మా అమ్మ అక్కడే ఉంటుందని చెప్తాడు. స్వప్న, కనకానికి ఫోన్ చేయగానే రాజ్ కోపంగా తల్లీకొడుకులను విడదీస్తారా..? అని తిట్టగానే కనకం భయపడుతుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.