BigTV English

Gold Rates: మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. పుతిన్ ప్రభావమా? ట్రంప్ ఎఫెక్టా?

Gold Rates: మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. పుతిన్ ప్రభావమా? ట్రంప్ ఎఫెక్టా?

Gold Rates: ఈ బంగారమే అంత గురూ.! గోల్డ్ ఎప్పుడూ అలాగే ఉంటుంది. దాని రేటే.. అటూ.. ఇటూ.. కదులుతూ ఉంటుంది. ఎప్పుడు పడుతుందో తెలియదు.. ఎప్పుడు పెరుగుతుందో అర్థం కాదు. ఒక్కోసారి.. కొంటే ఇప్పుడే కొనేయాలనిపిస్తుంది. ఇంకొన్నిసార్లు ఇప్పుడు మనం కొనగలమా అనే ఆలోచన వస్తుంది. అవన్నీ పక్కనబెడితే.. గోల్డ్ కొనడానికి ఇప్పుడు కరెక్ట్ టైమా? లేక.. ఇంకొన్నాళ్లు ఆగాలా?


బంగారం ధరలు ఎందుకు పెరుగుతున్నాయ్?

తగ్గిన బంగారం ధర! పడిపోతున్న గోల్డ్ రేట్లు.! బంగారం.. కొన్నా, కొనకపోయినా.. ఇలాంటి వార్తలు చెవిలో పడగానే.. గోల్డ్ లవర్స్ అందరికీ రిలీఫ్‌గా అనిపిస్తుంది. కానీ.. బంగారం రేటు కూడా చలి కాలం లాంటిదే. ఓ రోజు తగ్గుతుంది ఓ రోజు పెరుగుతుంది. కొన్నిసార్లు.. ఆల్ టైమ్ రికార్డు ధరకు చేరుకుంటుంది. ఒక్కోసారి.. వరుసగా తగ్గుతూ వస్తుంది. కచ్చితంగా.. ఏ రోజు ఎంత రేటు ఉంటుందో.. ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి. బంగారం రేటును డిసైడ్ చేసే ఫ్యాక్టర్స్ చాలానే ఉంటాయి. కాబట్టి గోల్డ్ ధర మార్కెట్‌లో ఉండే హెచ్చుతగ్గుల మీద ఆధారపడి ఉంటుంది. దీపావళికి ముందు రికార్డు స్థాయిలో 80 వేలు దాటిన పసిడి ధర.. తర్వాత క్రమంగా తగ్గింది. గతవారం 76 వేల స్థాయికి దిగొచ్చింది. ఇంకా.. తగ్గాక కొందాం అనే ఆలోచన గనక ఉంటే.. మీ ఆశలకు గండి పడినట్లే! అంటున్నారు మార్కెట్ ఎక్స్‌పర్ట్స్.


బంగారం కొనే ఆలోచన ఉందా.? ఇప్పుడే కొనేయండి!

మీకు ఇప్పుడు బంగారం కొనే ఆలోచన ఉందా.? అయితే.. ఇప్పుడే కొనేయండి. ఇంకొన్నాళ్లు ఆగుదాం. ఇంకాస్త రేటు తగ్గాక కొందాం! అని లెక్కలేసుకుంటే మాత్రం.. రాబోయే రోజుల్లో లెక్క బాగా ఖర్చు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే.. బంగారం కూడా పుష్ప మాదిరిగానే తగ్గేదేలే అంటోంది. మున్ముందు గోల్డ్ ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయి. ఇప్పటికే.. బంగారం ధర పెరుగుతూ పోతోంది. మొన్నటిదా తగ్గుతూ వచ్చిన గోల్డ్ రేటు.. ఇప్పుడు పైపైకి వెళుతోంది. కేవలం 4 రోజుల్లోనే.. 2 వేలకు పైగా పెరిగింది. ఇది పసిడి ప్రియుల్లో టెన్షన్ రేపుతోంది. పైగా.. పెళ్లిళ్ల సీజన్. డిమాండ్ కూడా కాస్త ఎక్కువగానే ఉంది. కానీ.. ఇదొక్కటే గోల్డ్ రేటు పెరిగేందుకు రీజన్ కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భౌగోళిక, రాజకీయ, ఆర్థిక కారణాలతో పాటు స్టాక్ మార్కెట్ సూచీల్లో హెచ్చుతగ్గులన్నీ బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి.

4 రోజుల్లోనే రూ.2 వేలకు పైగా పెరిగిన గోల్డ్ రేటు

ఇప్పుడు మన దగ్గరే కాదు.. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ బంగారం ధరలు పెరుగుతున్నాయి. ఇంటర్నేషనల్ బులియన్ మార్కెట్‌లో 4 రోజులుగా వంద డాలర్ల కంటే ఎక్కువే పెరిగింది బంగారం ధర. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు.. ఔన్సుకు 2 వేల 678 డాలర్ల దగ్గర కొనసాగుతోంది. భారత్‌లోనూ బంగారం రేటు రోజురోజుకు పైకి వెళుతుందే తప్ప.. కిందకి దిగడం లేదు. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల గోల్డ్ త్వరలోనే 72 వేలను తాకుతుందంటున్నారు. 24 క్యారెట్ గోల్డ్ అయితే రేపో, మాపో 78 వేల మార్క్‌ని టచ్ చేసేస్తుంది. ఇలా.. రోజురోజుకు పెరుగుతున్న గోల్డ్ రేట్లు కొనుగోలుదారులకు షాక్ ఇస్తున్నాయి. వారం కిందటి వరకు మురిపించిన బంగారం ధరలు.. ఇప్పుడు ఆందోళన పెంచుతున్నాయి.

మున్ముందు గోల్డ్ ధరలు మరింత పెరిగే చాన్స్

ఈ ఏడాది చివరి నాటికి.. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 2 వేల 750 డాలర్లకు చేరుకోవచ్చనే అంచనాలున్నాయి.అంటే మన దేశంలోనూ.. బంగారం ధరలు భారీగా పెరుగుతాయన్నమాట. ఇందుకు.. గోల్డ్ మీద పెట్టుబడి పెట్టేందుకు పెరుగుతున్న డిమాండ్ ఓ కారణమైతే.. అమెరికా డాలర్ బలహీనపడుతుండటం మరో కారణంగా చెబుతున్నారు. వీటికి తోడు భౌగోళిక, రాజకీయ ఆందోళనలు కూడా ఈ ఏడాది.. బంగారం ధరలు 29 శాతం పెరిగేందుకు కారణమయ్యాయి. మున్ముందు.. ఇది మరింత పైకి వెళ్లే అవకాశముంది. అందుకోసమే.. బంగారం కొనే ఆలోచన ఉంటే వెంటనే కొని పెట్టుకోమని నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్తులో గోల్డ్ ధర ఎంతలా పెరుగుతుందో.. ఊహించలేమంటున్నారు.

Also Read: చుక్కలు చూపిస్తున్న బంగారం ధర.. తులం ఎంతపెరిగిందో తెలుసా..?

2025లో గోల్డ్ రేట్లు ఊహించని స్థాయికి వెళతాయా?

2025లో బంగారం ధరలు ఆల్ టైమ్ హైకి.. చేరుకుంటాయా? అప్పుడు.. గోల్డ్ రేటు ఎంతుంటుందో.. అస్సలు ఊహించలేమా? పుత్తడిపై.. పెట్టుబడులు పెరగడానికి రీజనేంటి? అసలు.. బంగారం ధరలు ఇంతలా ఎందుకు పెరుగుతున్నాయ్? ఇది.. పుతిన్ ప్రభావమా? డొనాల్డ్ ట్రంప్ ఎఫెక్టా? బంగారం ధరల్ని ఆకాశానికెత్తేస్తున్న అసలు కారణాలేంటి?

బంగారంపై ఇన్వెస్ట్ చేయాలంటున్న గోల్డ్‌మ్యాన్ సాచ్స్

కర్ణుడి చావుకు అనేక కారణాలన్నట్లు.. బంగారం ధరల పెరుగుదలకు కూడా ఎన్నో కారణాలున్నాయి. లేటెస్ట్‌గా గోల్డ్‌మ్యాన్ సాచ్స్ ఇచ్చిన రిపోర్ట్ కూడా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. 2025లో బంగారం ధర ఆల్ టైమ్ రికార్డు ధరకు చేరుకుంటుందని చెబుతోంది గోల్డ్‌మ్యాన్ సాచ్స్. ఇన్వెస్టర్లంతా.. బంగారం మీద పెట్టుబడులు పెట్టాలని సూచించింది. సెంట్రల్ బ్యాంకుల నుంచి ఉన్న డిమాండ్, అమెరికాలో వడ్డీ రేట్ల తగ్గింపు లాంటి ఫ్యాక్టర్స్ అన్నీ.. బంగారం ధరలు అమాంతం పెరిగేలా చేస్తాయని చెబుతున్నారు మార్కెట్ నిపుణులు. వచ్చే ఏడాది మధ్యలో ఔన్స్ బంగారం ధర 2 వేల 850 డాలర్లకు చేరుతుందని.. 2025 మూడో త్రైమాసికంలో 2900 డాలర్లకు చేరుతుందనే అంచనాలున్నాయ్. మరోవైపు.. దేశాల మధ్య రాజకీయ యుద్ధాలు కూడా బంగారం ధరలపై ప్రభావం చూపనున్నాయి. వీటన్నింటి ఎఫెక్ట్‌తో.. వచ్చే ఏడాది బంగారం ధరలు గరిష్ఠ స్థాయికి చేరుకుంటాయని నిపుణులు భావిస్తున్నారు.

బంగారం ధరలపై రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం

బంగారం ధరలు పెరిగేందుకు పరోక్షంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కూడా మరో కారణమంటున్నారు. అమెరికా మిసైళ్లను.. రష్యాపై ప్రయోగించేందుకు బైడెన్ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వడంతో.. రెండు దేశాల మధ్య ఉద్రిక్తత మళ్లీ పెరిగింది. అది.. బులియన్ మార్కెట్‌పైనా ఎఫెక్ట్ చూపించింది. మరోవైపు.. రష్యా కూడా న్యూక్లియర్ వార్ ప్రిపరేషన్స్‌లో ఉన్నట్లు కనిపిస్తోంది. రష్యా చర్యలతో.. నాటో దేశాలన్నీ వార్ మోడ్‌లోకి వెళ్లిపోయాయి. ఏ క్షణమైనా యుద్ధం తమ దాకా వస్తుందనే ఆందోళనలో ఉన్నాయి. యూరప్ దేశాల్లో ఇప్పుడు న్యూక్లియర్ బాంబ్ టెన్షన్ నెలకొంది. దాంతో.. అక్కడి మార్కెట్లన్నీ హెచ్చుతగ్గుల్ని చూస్తున్నాయి. ఏ క్షణమైనా అణుబాంబు పేలొచ్చనే చర్చ జరుగుతోంది. దాంతో.. స్టాక్ మార్కెట్లు అంత సేఫ్ కాదనే లెక్కలతో.. గోల్డ్ మీద ఇన్వెస్ట్‌మెంట్లు పెరుగుతున్నాయి.

ట్రంప్ గెలిచాక పడిపోయిన గోల్డ్ రేట్లు

నిజానికి.. అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలిచాక.. డాలర్, బిట్ కాయిన్ లాంటివి రికార్డు గరిష్ఠాలకు పెరిగాయి. కానీ.. గోల్డ్ రేటు మాత్రం పడిపోయింది. అయితే.. బైడెన్ నిర్ణయంతో సీన్ మారింది. ఇప్పుడు గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. అయితే.. తాను అధికారం చేపట్టాక వడ్డీ రేట్లు తగ్గిస్తామని ట్రంప్ ప్రకటించడంతో.. ఇన్వెస్టర్లంతా గోల్డ్ మీదకు షిఫ్ట్ అవుతున్నారు. ఇది కూడా బంగారం రేటు పెరిగేందుకు మరో కారణంగా చెబుతున్నారు. అంతేకాదు.. గ్లోబల్ సెంట్రల్ బ్యాంకులు కూడా మంచి రేటు ఇస్తూ.. బంగారం కొనుగోళ్లను పెంచుతున్నాయి. ఇదిలాగే కంటిన్యూ అయితే.. 2025 గోల్డ్ రేట్లు ఊహించని స్థాయికి వెళతాయని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. అందువల్ల.. ఇప్పుడే బంగారం కొనుగోలు చేసి పెట్టుకున్న వాళ్లకు ఆందోళన అవసరం లేదని నిపుణులు సూచిస్తున్నారు.

స్టాక్ మార్కెట్లు పతనమైతే గోల్డ్ మీదకే ఇన్వెస్ట్‌మెంట్లు

పశ్చిమ దేశాలతో పెరుగుతున్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు.. డాలర్‌పై ప్రభావం చూపుతున్నాయి. దాంతో.. కొన్ని దేశాలు డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించుకోవడం లక్ష్యంగా.. బంగారం నిల్వల్ని పెంచుకునేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. మరోవైపు.. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ కూడా వడ్డీ రేట్ల పెంపును రద్దు చేసింది. వాణిజ్య యుద్ధాలు, ఆంక్షలు, పెరుగుతున్న ప్రపంచ ఉద్రిక్తతలన్నీ బంగారం ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. వాస్తవానికి.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో.. ఎప్పుడేం జరుగుతుందో అంచనా వేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. రష్యా ఎప్పుడైనా.. న్యూక్లియర్ అటాక్ చేసే అవకాశం ఉందనే భయాలు నెలకొన్నాయి. ఫలితంగా.. స్టాక్ మార్కెట్లు దారుణంగా పతనమైతే.. ఆటోమేటిక్‌గా గోల్డ్ మీద ఇన్వెస్ట్‌మెంట్లు పెరుగుతాయి. అదే జరిగితే.. బంగారం రేటు ఆటోమేటిక్‌గా పెరుగుతుంది. అందువల్ల.. బంగారం కొనే ఆలోచన ఉంటే.. ఇప్పుడే కొని పెట్టుకోమని సూచిస్తున్నారు ఆర్థిక నిపుణులు.

 

Related News

Real Estate: అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌ కొంటున్నారా..అయితే అన్ డివైడెడ్ షేర్ (UDS) అంటే ఏంటి ?.. ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ?

Real Estate: బ్యాంక్ లోన్ తీసుకొని ప్లాట్ కొంటే లాభమా….లేదా అపార్ట్ మెంట్ ఫ్లాట్ కొంటే లాభమా..? రెండింటిలో ఏది బెస్ట్ ఆప్షన్

Mobile Recharge: 365 రోజుల వ్యాలిడిటీ 1,999 రీచార్జ్ లో Airtel, Vi, BSNL ఎవరిది బెస్ట్ ఆఫర్

Bank Loans: లోన్ రికవరీ ఏజెంట్లు బెదిరిస్తున్నారా..అయితే మీ హక్కులను వెంటనే తెలుసుకోండి..? ఇలా కంప్లైంట్ చేయవచ్చు..

Golden City: ఇది ప్రపంచంలోనే గోల్డెన్ సిటీ.. 3వేల మీటర్ల లోతులో అంతా బంగారమే..?

Central Govt Scheme: కేవలం 4 శాతం వడ్డీకే రూ.5 లక్షల రుణం కావాలా? ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీం మీ కోసమే

Big Stories

×