E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode November 27th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు కాళ్ల మీద పడిపోయిన ప్రశాంత్ 

Brahmamudi Serial Today Episode November 27th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు కాళ్ల మీద పడిపోయిన ప్రశాంత్ 
Advertisement

Brahmamudi serial today Episode: రఘువీర్‌కు అమ్ముడుపోయింది ప్రశాంతేనని చెప్పిన ఇందు. హాస్పిటల్‌లో ప్రశాంత్‌ వాళ్ల అమ్మకు ట్రీట్‌మెంట్‌ జరుగుతుందని ఆ ట్రీట్‌మెంట్‌కు అవసరం అయిన డబ్బుల కోసమే ప్రశాంత్‌ రఘువీర్‌కు అమ్ముడుపోయాడని ముందే మన అకౌంటెంట్‌ను అడ్వాన్స్‌ అడిగాడట మన అకౌంటెంట్‌ డబ్బులు ఇవ్వనన్నందుకే ఇలా చేశాడని ఇప్పుడు మనం ప్రశాంత్‌కు హెల్ప్‌ చేస్తే బాగుంటుంది అంటూ ఇందు చెప్తుంది. ప్రతి మనిషికి ఒక క్యారెక్టర్‌ ఉంటుంది. తనకు రెండో అవకాశం ఇస్తే ఎలా ఉంటుందో నువ్వే చూస్తావు కదా అంటూ క్యాషి కౌంటర్‌లో మూడు లక్షలు బిల్‌ కట్టి వెళ్లిపోతారు రాజు, ఇందు.

ప్రశాంత్‌ వెళ్లి రఘువీర్‌ను కలుస్తాడు. థాంక్యూ ప్రశాంత్‌ నీ వల్లే మేము రుద్రప్రతాప్‌ డీల్‌ దక్కించుకున్నాము అంటాడు. ఇవన్నీ తనకేం తెలియదని తనకు డబ్బులు కావాలని అవతల మా అమ్మకు ఆపరేషన్‌ చేస్తున్నారు డబ్బులు ఇవ్వండి అని అడుగుతాడు. రఘువీర్‌ డబ్బులు ఇస్తూ.. ఈ డీల్‌తోనే మన మధ్య రిలేషన్‌ అయిపోయింది అనుకోకు ఇక నుంచి మనం కలిసి పని చేద్దాం అంటే.. వద్దు సార్‌ ఇదే ఆఖరి సారి ఇక నేను వెళ్తాను అంటూ డబ్బులు తీసుకుని వెళ్లిపోతాడు. హాస్పిటల్‌కు వెళ్లి రిసెప్షన్‌లో డబ్బులు కట్టబోతే ఇప్పుడే ఒక మేడం వచ్చి మీకు బాగా కావాల్సిన వాళ్లమని మూడు లక్షలు కట్టారు అని చెబితే.. అవునా ఎవరా మేడం ఎక్కడున్నారు అని ప్రశాంత్‌ అడిగితే మీ అమ్మ దగ్గర ఉన్నారేమో చూడండి అని రిసెప్షనిస్ట్‌ చెప్తుంది. ప్రశాంత్‌ పరుగెత్తుకుంటూ వెళ్లి చూస్తాడు. అక్కడ ఇందు, రాజు డాక్టర్‌తో మాట్లాడుతుంటారు. డోర్‌లోంచి చూసిన ప్రశాంత్‌ షాక్‌ అవుతాడు.

Advertisement

ప్రశాంత్‌ చాల మంచోడని ఇందు చెప్తుంటే.. ప్రశాంత్‌ ఏడుస్తుంటాడు.  ఇందు, రాజు బయటకు రాగానే ప్రశాంత్‌, ఇందు కాళ్ల మీద పడి ఏడుస్తూ.. ఇంత మంచివాళ్లైనా మిమ్మల్ని మోసం చేశాను క్షమించండి అంటూ ఏడుస్తుంటాడు. ఇందు పైకి లేపి నువ్వు కావాలని తప్పు చేయలేదు అవసరం కోసం ఇలా చేశావు కానీ నువ్వెంత నిజాయితీపరుడివే మాకు తెలుసు అంటుంది. మీరు ఎక్కడికి వచ్చి నిజం చెప్పమన్నా చెప్తాను మేడం ఆ రఘువీర్‌, ఐశ్వర్యనే నాతో ఈ పని చేయించారు అని పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోతాను అంటూ ఏడుస్తుంటాడు. చూడు నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు.. నాకు అది చాలు జరిగిందంతా ఇక్కడితో మర్చిపో ఎప్పుడూ నవ్వుతూ నవ్వించే ఆ పాత ప్రశాంత్‌ ను నేను మళ్లీ చూడాలి అంటూ ఇందు చెబితే.. లేదు మేడం ఈరోజు నుంచి నాలో కొత్త వ్యక్తిని చూస్తారు. మీరు నాకు ఇచ్చింది అవకాశం కాదు కొత్త జీవితం. ఈరోజు నుంచి నేను బతికే ప్రతి నిమిషం మన కంపెనీ కోసం నిజాయితీగా పని చేస్తాను. నేనే కాదు మన కంపెనీలో ఇంకెవరు తప్పు చేసినా సరే నేను చూస్తూ ఊరుకోను మేడం అంటూ చెప్తుంటే.. సరేలే కానీ మీ అమ్మను మంచిగా చూసుకో అంటూ చెప్తుంది. రాజు కూడా వెళ్లి అమ్మను హ్యాపీగా చూసుకో అంటూ చెప్పగానే.. రాజు వెళ్లిపోతాడు.

అపర్ణకు వచ్చిన కొరియర్‌ కవర్‌లో ఏముందో తెలుసుకోవడానికి అర్దరాత్రి రూంలోకి ముసుగు వేసుకుని శేషును తీసుకుని వెళ్తుంది భ్రమరాంబ. అంతా గమనిస్తున్న అపర్ణ నిద్రపోయినట్టు నటిస్తూ.. లోపలికి వచ్చిన భ్రమరాంబన చేయి మీద తొక్కుతుంది. చేతులకు రక్తం కారుతుంది. దీంతో భ్రమరాంబ భయంతో బయటకు వెళ్లిపోతుంది. తర్వాత మరుసటి ఉదయం అందరూ టిఫిన్‌ చేస్తుంటే.. భ్రమరాంబ చేతులకు గాయలు అవ్వడంతో టిఫిన్‌ చేయడానికి ఇబ్బంది పడుతుంది. అపర్ణ వెటకారంగా భ్రమరాంబ ఏం జరిగింది నువ్వే చెప్పు అని అడిగితే.. ఏం జరిగితే మీకేంటి..? చేయి నాది గాయం నాది.. మీ కొరియర్‌ విషయంలో మమ్మల్ని ఎవ్వరూ పట్టించుకోవద్దు అన్నారు  కదా ఇప్పుడు మా విషయంలో మీరెందుకు అడుగుతున్నారు అంటూ నిలదీస్తుంది. సరేలే నిజం ఎప్పటికైనా తెలుస్తుంది తినేటప్పుడు గొడవ ఎందుకు తినండి అంటుంది అపర్ణ. అప్పుడే ఐశ్వర్య వచ్చి తన కోసం రఘువీర్‌ ఇంటికి వస్తాడని మీరెవరు ఏమీ అనొద్దని చెప్పి వెళ్తుంది. వెనకే రాజు, ఇందు వెళ్తారు. అంతపెద్ద బిజినెస్‌ మ్యాన్‌ వస్తుంటే.. మనం ఈ చీరల్లోనా ఉండేది పట్టు చీరలు కట్టుకుందాం పదండి అంటూ భ్రమరాంబ, రేఖ, సుభాష్‌ వెళ్లిపోతారు.

Advertisement

బయటకు వెళ్లిన ఇందును ఎందుకు తినకుండా వచ్చేశావు అని రాజు అడిగితే.. తినబుద్ది కాలేదు అంటూ ఇందు చెబితే.. ఆ రఘువీర్‌ వస్తున్నాడనా అంటూ రాజు అడిగితే. ఆ రోగ్‌ గురించే అంటూ ఇందు చెప్పగానే.. వాడిని ఏదో ఒకటి చేద్దాం అప్పటి వరకు మన గురించి ఇప్పుడు చూసుకుందామా అంటూ రాజు రొమాంటిక్‌గా మాట్లాడతాడు. తర్వాత అందరూ రఘువీర్‌ కోసం వెయిట్‌ చేస్తుంటారు. అందరూ ఐశ్వర్య గురించి మాట్లాడుతుంటే ఐశ్వర్య కూడా వస్తుంది. రాజు వచ్చి రఘువీర్‌ను తిడుతుంటాడు. ఇంతలో  ఇవాళ్టీ బ్రహ్మముడి ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Illu Illalu Pillalu Today Episodes: చందుకు టెన్షన్.. ధీరజ్, ప్రేమ లవ్ ఆసనం.. రామారాజుకు టెన్షన్..

Intinti Ramayanam Today Episode: పల్లవి ఎంట్రీతో పార్వతి టెన్షన్.. రమ్య కిడ్నాప్.. అవని దెబ్బకు ఫ్యూజుల్ అవుట్..

Podarillu Today Episode : అయ్యో పాపం చక్రీ.. మహా ప్లాన్ సక్సెస్.. విక్కీ సర్ప్రైజ్ గిఫ్ట్.

Nindu Noorella Saavasam Serial Today Episode November 27th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్ రూంలోంచి డబ్బులు కొట్టేసిన మనోహరి 

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. ‘పొదరిల్లు ‘ పరిస్థితి ఏంటి..?

Friday TV Movies : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

నాగార్జున షో చూడరు..అంతా స్క్రిప్ట్ .. సంచలన విషయాలు బయటపెట్టిన రోహిత్!

Big Stories

Advertisement
×