E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode November 5th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు చలపతి గ్రీన్ సిగ్నల్ – ఇందు మెడలో రాజు తాళి కడతాడా..? 

Brahmamudi Serial Today Episode November 5th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు చలపతి గ్రీన్ సిగ్నల్ – ఇందు మెడలో రాజు తాళి కడతాడా..? 
Advertisement

Brahmamudi serial today Episode: లక్ష్మీ వెళ్లి రాజును కన్వీన్స్‌ చేయాలని చూస్తుంది. కానీ రాజు చలపతి మాటే తనకు శిరోధార్యం అంటూ నాన్న మాట తీసేయలేనని చెప్తాడు. అందుకు లక్ష్మీ ఏడుస్తూ.. ఇందు జీవితాంతం కుమిలి కుమిలి ఏడిసేలా చేస్తావా..? చెప్పు నా మాటకు సమాధానం చెప్పు.. ఇటు చూసి చెప్పరా అని రాజును తిప్పితే రాజు ఏడుస్తుంటాడు. అంతా చలపతి వింటుంటాడు. ఏంట్రా ఈ కన్నీళ్లు అని లక్ష్మీ అడిగితే.. ఈ కన్నీళ్లే నా సమాధానం అమ్మా అని రాజు అంటే.. ఇంత బాధ మనసులో పెట్టుకుని కూడా నాతో ఎందుకు చెప్పలేదురా..? అంటూ లక్ష్మీ అడిగితే.. ఏం చెప్పను అమ్మా.. ఇంకొద్దిసేపట్లో ఇందు మెడలో ఇంకొకడు తాళి కడతాడు. అప్పుడు ఇందు ఇంకొకరి భార్య. అది తలుచుకుంటేనే నేను తట్టుకోలేను అమ్మా అంటూ రాజు ఏడుస్తుంటాడు.

ఇందు నా జ్ఞాపకం కాదమ్మా నా జీవితం అనుకున్నాను.. తనకు ఏ కష్టం వచ్చినా నేను ఉన్నాను ఇందు అని ధైర్యం చెప్పాలి అనుకున్నాను.. కానీ ఇప్పుడు తను కష్టంలో ఉంటే తనను కాపాడాల్సిన నేనే ఇలా చేతులు కట్టుకుని ఉన్నాను.. అంటూ రాజు చెప్తుంటే.. అరేయ్‌ రాజు నువ్వు తినకపోతేనే ఆయన తినలేదురా..? కానీ నువ్వు జీవితాంతం బాధపడుతుంటే ఆయన ఎలా చూస్తాడురా అంటే కానీ ఎవరినో ఒకరిని బాధపెట్టక తప్పదమ్మా అంటాడు రాజు. వెనక నుంచి వింటున్న చలపతిని చూసిన లక్ష్మీ దగ్గరకు వెళ్లి తిడుతుంది.

Advertisement

మనం తీసుకున్న నిర్ణయం వల్ల ఎవరో ఒకరు బాధపడటం మన తప్పే అవుతుంది అంటూ హితబోధ చేస్తుంది. దాంతో కన్వీన్స్‌ అయిన చలపతి ఏడుస్తూ.. రాజు దగ్గరకు వెళ్లి నా మాట నీకు బలహీనత కాకూడదురా..? నా కోసం నువ్వు నీ ప్రేమను వదులుకుంటే నేను తండ్రిగా గెలిచినట్టా..? కాదురా ఏం జరిగితే అది జరుగుతుంది. చూసుకుందాం.. వెళ్లరా వెళ్లి నీ భార్యను తీసుకురా వెళ్లు అంటూ చెప్పగానే.. రాజు సంతోషంగా చలపతిని హగ్‌ చేసుకుని నాన్న ఈ మాట ముందే చెప్పొచ్చు కదా అంటాడు. ఇప్పుడు చెప్పాను కదా వెళ్లరా అంటే వెంకీ అన్నయ్య బైక్‌ రెడీ అంటాడు. రాజు, వెంకీ బైక్‌ మీద వెళ్లిపోతారు.

అపర్ణ పెళ్లి మండపంలోకి వెళ్లి కంగారు పడుతుంది. రాజుకు కాల్‌ చేశాను. లిఫ్ట్‌ చేశాడు కానీ ఏమీ మాట్లాడలేదు. పక్కన చలపతి ఉన్నాడేమో ఎందుకు నాకు కంగారుగా ఉంది అంటే.. నాన్నమ్మ నన్ను నమ్ము బావ వస్తాడు అని ధైర్యం చెప్తుంది ఇందు. నందు, ఇందు, అపర్ణ మాట్లాడుకోవడం చూసిన భ్రమరాంబ భయంతో రేఖ అక్కడ ఏదో గూడుపుఠాణి జరుగుతుంది అంటూ పంతులు గారు త్వరగా తాళి కట్టించండి అంటుంది. ముహూర్తానికి ఇంకా టైం ఉందమ్మా అంటాడు. కొద్దిసేపు చూశాక రేఖ పంతులు గారు మాంగళ్య ధారణ చేయించండి అంటే పంతులు కోపంగా పంతులు నేనా మీరా..? ఇంకా జిలకర్ర బెల్లం పెట్టలేదు.. నేను పురోహితుడిని అన్ని సంప్రాదాయంగా చేయిస్తాను అంటాడు. పూజ అయిపోయాక పంతులు తాళి పెళ్లికొడుకు చేతికి ఇచ్చి కట్టమని చెప్పగానే.. పెళ్లికొడుకు తాళికట్టబోతుంటాడు. ఇందు, నందు, అపర్ణ భయపడుతుంటారు. రేఖ, భ్రమరాంబ, ఐశ్వర్య, భూషణ్‌ హ్యాపీగా ఉంటారు.

Advertisement

అప్పుడే రాజు వచ్చి పెళ్లి కొడుకును కొట్టి తాళి లాగేసుకుంటాడు. రాజును చూసిన అపర్ణ, సుభాష్‌, నందు, ఇందు హ్యాపీగా ఫీలయితే.. రేఖ, భ్రమరాంబ, భూషణ్‌, ఐశ్వర్య షాక్‌ అవుతారు. రాజు దగ్గరకు వెళ్లి పెళ్లికొడుకును అక్కడి నుంచి వెళ్లిపోమ్మని వార్నింగ్‌ ఇస్తాడు. పెళ్లికొడుకు పారిపోతాడు. రేఖ కోపంగా చూస్తుంది. రాజును తిడుతుంది. ఎందుకు వచ్చావు మళ్లీ అని అడిగితే.. నా భార్య జోలికి వస్తే ఎదురు తిరిగి నిలబడటానికే వచ్చాను అంటాడు రాజు. నీ భార్య ఎప్పుడైంది..? ఎలా అయింది అంటూ నటిస్తేనే నీ భార్య అవుతుందా..? అంటే.. నటించాము అని మీరనుకున్నారు.. జీవించామని మేము అనుకున్నాం.. జస్ట్‌ ఇప్పుడు తాళి కడితే మొత్తం పూర్తి అయిపోతుంది అంటూ రాజు చెప్పగానే రేఖ షాక్‌ అవుతుంది.

మా నాన్న చెప్పాకే ఇక్కడికి వచ్చాను.. ఇందుకు మొగుడు అవుతాను అంటే.. ఐశ్వర్య కోపంగా లక్కీని  రాజు మీదకు రెచ్చగొడుతుంది. వాడు అంతలా మాట్లాడుతుంటే మౌనంగా ఉంటావేంటి..? వెళ్లి వాణ్ని తరిమేయ్‌ అంటే లక్కీ అడుగు ముందుకు వేయగానే.. రాజు వార్నింగ్‌ ఇస్తాడు. సుభాష్‌ రాజును ఇందు మెడలో తాళి కట్టమని చెప్తాడు. అసలైన పెళ్లి కొడుకు వచ్చాడు పంతులుగారు ఇప్పుడు కట్టించండి తాళి అని చెప్తుంది అపర్ణ. ఇందు, రాజు పెళ్లి పీటల మీద కూర్చుంటారు. ఇంతలో  ఇవాళ్టీ బ్రహ్మముడి ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

గాజుల గలగలతో ఓవర్ నైట్ స్టార్.. ఇప్పుడు అయ్యప్ప పాటతో మరోసారి ట్రోలింగ్!

Intinti Ramayanam Today Episode: పల్లవికి స్ట్రాంగ్ వార్నింగ్.. భానుమతి ప్లాన్ సక్సెస్.. పల్లవి ప్లానేంటి..?

అంజలిలో ఈ టాలెంట్ ఉందా..? హీరోయిన్ అయిపోవచ్చు..

Thursday TV Movies : గురువారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. డోంట్ మిస్..

Nindu Noorella Saavasam Serial Today Episode November 5th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి నిజం చెప్పడం విన్న అమర్ రియాక్షన్ ఎలా ఉండబోతుంది..?  

వామ్మో రోహిత్ వల్ల బిగ్ బాస్ కి ఇంత నష్టమా.. అందుకే ఎలిమినేట్ అయ్యాడా?

సదన్న క్రేజ్ మామూలుగా లేదుగా.. ఒక్క వీడియోకు ఇంత తీసుకుంటాడా?

Big Stories

Advertisement
×