E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode November 5th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి నిజం చెప్పడం విన్న అమర్ రియాక్షన్ ఎలా ఉండబోతుంది..?  

Nindu Noorella Saavasam Serial Today Episode November 5th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి నిజం చెప్పడం విన్న అమర్ రియాక్షన్ ఎలా ఉండబోతుంది..?  
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: మనోహరిని హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జ్‌ చేశాక అందరూ ఇంటికి వెళ్లిపోతారు. రామ్మూర్తి కూడా ఇంటికి వెళ్లిపోయి పార్థుతో మాట్లాడతాడు. మనోహరి గురించి చెబుతూ తిట్టి.. తాను ఆత్మహత్య డ్రామా అడకుండా ఉండి ఉంటే ఈ పాటికి మా అల్లుడు మీ వాళ్లను కనిపెట్టి నిన్ను మీ వాళ్ల దగ్గరకు చేర్చేవాడని చెప్తాడు. అంతా అయోమయంగా వింటుంటాడు పార్థు. రామ్మూర్తి, మంగళను పిలిచి పార్థుకు భోజనం పెట్టిస్తాడు.

మరసటి రోజు మిస్సమ్మ ఇంటి ముందు ముగ్గేస్తుంటే.. టెర్రస్‌ లోంచి చూస్తుంది మనోహరి. భాగీ ఒక్కతే ఉన్నట్టుంది ఇప్పుడే వెళ్లి వార్నింగ్‌ ఇవ్వాలి అనుకుని కిందకు వెళ్తుంది. అప్పుడే అమర్‌ జాగింగ్‌కు వెళ్లడానికి వచ్చి తన షూస్‌ కనిపించడం లేదని మిస్సమ్మను అడిగితే.. మిస్సమ్మ  ఉలకదు పలకదు.. అమర్‌ కోపంగా నిన్నే అడిగేది నా షూస్‌ ఎక్కడ అని అడుగుతాడు. అందుకు మిస్సమ్మ ఆశ్చర్యంగా మీరు నాతో మాట్లాడుతున్నారా..? అని అడుగుతుంది. అమర్‌ నీతోనే మాట్లాడుతున్నాను.. నా షూస్‌ ఎక్కడున్నాయి అని అమర్‌ అడిగితే.. అదిగోండి కింద ఉన్నాయి అని మిస్సమ్మ చూపిస్తుంది. అమర్‌ షూస్‌ వేసుకుని వెళ్లిపోతాడు.

Advertisement

అప్పుడే కిందకు వచ్చిన మనోహరి అమర్‌ షూస్‌ అక్కడ లేవని అమర్‌ జాగింగ్‌కు వెళ్లి ఉంటాడని నిర్దారించుకుని మిస్సమ్మ దగ్గరకు వెళ్లి గుడ్‌ మార్నింగ్‌ చెప్తుంది. అందుకు మిస్సమ్మ డల్లుగా గుడ్‌ మార్నింగ్‌ చెబితే.. ఏంటి భాగీ బాధగా ఉన్నావా..? అంటుంది. బాధనా నాకెందుకు ఉంటుంది అని మిస్సమ్మ  అడిగితే.. నన్ను ఇరికించడానికి ఇబ్బంది పెట్టడానికి ఎన్నో ప్లాన్స్‌ వేశావు కదా నీ ప్లాన్స్‌ అన్ని అట్టర్‌ ప్లాప్‌ అయ్యాయి కదా అందుకు అని మనోహరి చెబితే.. నేను నీ మీద ప్లాన్స్ వేస్తే నువ్వుఇలా ఉండేదానివా..? ఎప్పుడో జైలుకు వెళ్లేదానివి అంటుంది మిస్సమ్మ. అవునా నన్ను జైలుకు పంపించాలంటే నీ దగ్గర సాక్ష్యాలు ఉండాలి కదా.. నన్ను ఆశ్రమానికి పంపించినంత ఈజీ అనుకున్నావా..? జైలుకు పంపించడం అంటే అయినా సాక్ష్యాలు ఉన్నావా..? అంటూ మనోహరి ప్రశ్నిస్తుంది.

కట్‌ చేస్తే.. జాగింగ్‌ కోసం వెళ్లిన అమర్‌ కొద్ది దూరం వెళ్లాక వాటర్‌ బాటిల్‌ మర్చిపోయానని వెనక్కి తిరిగి వస్తుంటాడు. కాఫీ కప్పు పట్టుకుని మనోహరికి ఇచ్చేందుకు యాదమ్మ  బయటకు వస్తుంది. అప్పుడే మనోహరి, మిస్సమ్మతో ఆరును చంపింది తానేనని.. అందుకు ఉన్న ఏకైక సాక్ష్యాన్ని చంపింది కూడా తానేనని.. తర్వాత మిస్సమ్మ అమర్‌ను పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు తల్లి అయిన పాపానికి ఐదేళ్లు ఇంటికి దూరం చేసింది కూడా తానేనని.. పార్థు చంపింది తానేనని తనను పెళ్లి చేసుకోవడం వల్లే పార్థుకు  ఆ శిక్ష పడిందని చెప్తుంది. అమర్‌ వచ్చి గేటు దగ్గర నిలబడి అంతా వింటుంటాడు.

Advertisement

కాఫీ తీసుకుని బయటకు వచ్చిన యాదమ్మ అమర్‌ను చూసి షాక్‌ అవుతుంది. అప్పుడే మనోహరి తాను ఇంకా భాగీని తప్పించి అమర్‌ను పెళ్లి చేసుకుంటాను అంటూ చెప్పబోతుంటే.. యాదమ్మ కాఫీ కప్పు కింద పడేస్తుంది. అ సౌండ్‌కు తిరిగి చూసిన మనోహరి కోపంగా యాదమ్మను తిడితే.. యాదమ్మ సారీ మేడం చేయి జారింది అంటూ గేటు వైపు చూస్తూ.. ఏంటి సార్‌ జాగింగ్‌ నుంచి అప్పుడే వచ్చారు అని అడుగుతుంది. యాదమ్మ మాటలకు మనోహరి, మిస్సమ్మ తిరిగి చూస్తారు. గేటు దగ్గర అమర్‌ కోపంగా చూస్తూ నిలబడి ఉంటాడు. అమర్‌ను చూసిన మనోహరి, మిస్సమ్మ షాక్‌ అవుతారు. అమర్‌ దగ్గరకు వచ్చి యాదమ్మను లోపలికి పంపిస్తాడు. మనోహరి భయంతో వణికిపోతూ.. అమర్‌ నేను చెప్పింది మొత్తం విన్నాడా..? ఏంటి అని మనసులో అనుకుంటుంది.  ఇంతటితో  నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

వామ్మో రోహిత్ వల్ల బిగ్ బాస్ కి ఇంత నష్టమా.. అందుకే ఎలిమినేట్ అయ్యాడా?

సదన్న క్రేజ్ మామూలుగా లేదుగా.. ఒక్క వీడియోకు ఇంత తీసుకుంటాడా?

బిగ్ బాస్ గురించి ఆలోచించడం ఆపండి..వార్నింగ్ ఇచ్చిన కౌశల్!

కనకవ్వ నుంచి మంగ్లీ వరకు.. ఒక్కో పాటకు ఎంత తీసుకుంటున్నారంటే?

ట్రోలర్స్ కు సింగర్ ఝాన్సీ మాస్ వార్నింగ్… నన్ను మించి ఎదగలేరంటూ!

‘దారిపొంటొతుండు’తో సెన్సేషన్..మామిడి మౌనిక పాటకు రూ.లక్షల్లో పారితోషికమా?

నా ఆయుష్షు తీసుకున్నా పర్లేదు.. మా అక్కను బ్రతికించు దేవుడా.. కన్నీళ్లు పెట్టిస్తున్న ముఖేష్!

Big Stories

Advertisement
×