E-Paper
Advertisement

గాజుల గలగలతో ఓవర్ నైట్ స్టార్.. ఇప్పుడు అయ్యప్ప పాటతో మరోసారి ట్రోలింగ్!

గాజుల గలగలతో ఓవర్ నైట్ స్టార్.. ఇప్పుడు అయ్యప్ప పాటతో మరోసారి ట్రోలింగ్!
Advertisement

Gajula Galagala Song:గాజులు గాజులు గలగల అంటూనే ఒక్క వీడియోతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపొయింది రాధమ్మ కూతురు. రిలీజ్ అయిన ఒక్క రోజులోనే మిలియన్ క్రాస్ చేసిన ఈ పాట రెండు వారాల్లోనే ఏకంగా కోటి 80 లక్షల మంది చూశారంటే పాట ఆడియన్స్ ని ఎలా ఆకర్షించిందో అర్థమైపోతుంది .

ఇక ఈ పాట తర్వాత రాధమ్మ కూతురు ఎన్నో ప్రశంసలతో పాటు అనేక విమర్శలను కూడా ఎదుర్కొంది. ముఖ్యంగా కళ్యాణి అమ్మ అనే ఆవిడ రాధమ్మ కూతురిపై చేసిన కామెంట్స్ ఒక్కసారిగా నెట్టింట్లో మంటలు పెట్టింది .

Advertisement

గాజుల గలగల టైటిల్స్ తో ఎన్నో పాటలు

దీనికి కౌంటర్ గా రాధమ్మ కూతురు చెప్పుతో వార్నింగ్ ఇవ్వడం కూడా తెగ వైరల్ అయింది .ఇక ఒక పది రోజులపాటు ఈ రచ్చ కంటిన్యూ అయింది .ఇక ఇదే గాజుల గలగల టైటిల్స్ తో ఎన్నో పాటలు యూట్యూబ్లో చక్కర్లు కొడుతున్నాయి కూడా .

Advertisement

ఇదిలా ఉంటే ఇప్పుడే కొత్తగా రాలేదు ఇదివరకు కూడా ఎన్నో రీల్స్ చేశాను కానీ ఓవర్ నైట్ లోనే స్టార్ అవ్వడంతో జలసీ తో నాపై ఇక్కడ లేని ట్రోల్స్ వస్తున్నాయి అయినా నేనేం పట్టించుకోను .

అయ్యప్ప దేవుడిపై పాట పాడటంతో మరోసారి హైలైట్

వరుసగా రీల్స్ చేసుకుంటూనే పోతాను అంటూ ఎక్కడ తగ్గకుండా రీల్స్ చేసుకుంటూ పోతుంది రాధమ్మ కూతురు. ఇక ఇప్పటికే ఈవిడ పలు షార్ట్ ఫిలిమ్స్ ఫోక్ సాంగ్స్ లో నటించింది కూడా .ఇదిలా ఉంటే తాజాగా ఇదే రాధమ్మ కూతురు అయ్యప్ప దేవుడిపై పాట పాడటంతో మరోసారి సోషల్ మీడియాలో హైలైట్ అయింది .

ఇరుముడి కట్టు శబరిమలై

ఇరుముడి కట్టు శబరిమలై అనే పాట పాడి వదలడంతో మరోసారి రాధమ్మ కూతురిని టార్గెట్ చేశారు నెటిజెన్లు .అక్క పాట పాడు కానీ దయచేసి అయ్యప్ప మాల వేసుకోవాలని ఆలోచన చేయకు. అయ్యప్ప మాల వేసుకోవాలనే ఆలోచన కూడా రానివ్వకు అక్క అని ఒకతను కామెంట్ చేస్తే, నీ గొంతు నుండి పాటలు వింటుంటే అసహ్యంగా ఉంది కొద్దిరోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ మరో నెటిజన్ మండి పడ్డాడు.

ఇక భవాని మాల అయిపోయింది ఇప్పుడు అయ్యప్ప మాల మీద పడ్డావా తల్లి అంటూ మరొక వ్యక్తి ఫైర్ కాగా ఈ పాటలో భక్తి లేదు అంతా యాక్షన్ అంటూ ఇంకొకరు కామెంట్ చేశారు .

వీడియోలు మాత్రం తీసి పెట్టకు

ఒకరు మాత్రం ప్లీజ్ ఆపరా పాటలు పడనా పర్వాలేదు కానీ వీడియోలు మాత్రం తీసి పెట్టకు అంటూ సెటైర్ వేస్తే నీ కంటే మంచిగా పాడిన వాళ్ళు పాత వాళ్ళే ఉన్నారు నువ్వు కొత్తగా చించేది ఏమీ లేదు , దయచేసి నువ్వు కొన్నాళ్లు ఇంట్లో ఉండు నువ్వు ఏ పాటలు పడకు నీ నుంచి వచ్చే పాటలు వినబుద్ధి కావడం లేదు అంటూ మరొకరు రాధమ్మ కూతురుపై మండిపడుతున్నారు .

అయితే ఇన్ని విమర్శల్లోనూ కొన్ని ప్రశంసలు కూడా ఉన్నాయి స్వామియే శరణమయ్యప్ప గుడ్ సాంగ్ భవాని అంటూ కొందరు కామెంట్ చేస్తే చాలా చక్కగా పాడావు దేవుడిచ్చిన గొంతు గాత్రం సూపర్ బంగారు, స్వామియే శరణమయ్యప్ప అంటూ మరొకరు రాధమ్మ కూతురిని ఆకాశం ఎత్తేశారు .

also read:కనకవ్వ నుంచి మంగ్లీ వరకు.. ఒక్కో పాటకు ఎంత తీసుకుంటున్నారంటే?

అయ్యప్ప మాల వేసుకుంటుందా ఏంటి?

మొత్తానికి రాధమ్మ కూతురు ఇప్పుడు అయ్యప్ప మాల వేసుకుంటుందా ఏంటి ?అంటూ సెటైల్ వదులుతున్నారు సోషల్ మీడియా జనాలు .ఏది ఏమైనా గాజుల గలగల తో ఓవర్ నైట్ లోనే స్టార్డం సంపాదించిన ఈ రాధమ్మ కూతురు ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ అనే చెప్పాలి!

Tags

Related News

Intinti Ramayanam Today Episode: పల్లవికి స్ట్రాంగ్ వార్నింగ్.. భానుమతి ప్లాన్ సక్సెస్.. పల్లవి ప్లానేంటి..?

అంజలిలో ఈ టాలెంట్ ఉందా..? హీరోయిన్ అయిపోవచ్చు..

Thursday TV Movies : గురువారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. డోంట్ మిస్..

Nindu Noorella Saavasam Serial Today Episode November 5th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి నిజం చెప్పడం విన్న అమర్ రియాక్షన్ ఎలా ఉండబోతుంది..?  

వామ్మో రోహిత్ వల్ల బిగ్ బాస్ కి ఇంత నష్టమా.. అందుకే ఎలిమినేట్ అయ్యాడా?

సదన్న క్రేజ్ మామూలుగా లేదుగా.. ఒక్క వీడియోకు ఇంత తీసుకుంటాడా?

బిగ్ బాస్ గురించి ఆలోచించడం ఆపండి..వార్నింగ్ ఇచ్చిన కౌశల్!

Big Stories

Advertisement
×