Sadanna remunaration:’గుట్టల్లో గుసగుస’, ‘కండల కొండన్న ఏతులెక్కువ’ ,’బుర్రు బుజ్జన్న’ ,’కొండన్న పోశి’, ‘డాక్టర్ కొండన్న’, ‘దయ్యం బువ్వ తిన్నది’..ఇలా ఎన్నెన్నో కామెడీ షార్ట్ ఫిలిమ్స్ తో అదరగొట్టిన సదన్న అసలు ఒక్కో షార్ట్ ఫిలిమ్ కి ఎంత తీసుకుంటాడా అంటూ ఆరాలు తీస్తున్నారు సదన్న ఫ్యాన్స్.
సోషల్ మీడియాలో కనిపిస్తే చాలు
సదన్న విషయనికి వస్తే టీచర్ గా కెరీర్ మొదలెట్టిన ఈ క్రేజీ కమెడీయన్ తనదైన తెలంగాణా బాష,యాసతో కోట్లాది అభిమానుల్ని సంపాదించిన సంగతి తెల్సిందే.చిన్న తనంలోనే తండ్రిని కోల్పోయినప్పటికీ, తల్లి రెక్కల కష్టంతో ఎదిగిన సదన్న ఆలియాస్ RS నంద సోషల్ మీడియాలో కనిపిస్తే చాలు ఆడియన్స్ పెదాల మీద నవ్వులు విరభూస్తాయని చెప్పక్కర్లేదు.
సదన్న విషయానికి వస్తే
ఇక సదన్న విషయానికి వస్తే సదన్న పూర్తి పేరు రాదండి సదయ్య.పెద్దపల్లి జిల్లా కనగర్తి గ్రామానికి చెందిన సదన్న ఒకవైపు టీచర్ గా పని చేస్తూనే తెలంగాణా యాసలో ఎన్నో పల్లెటూరి కామెడీ వీడియోలని ఆడియన్స్ కి అందించి మంచి పేరు సొంతం చేసుకున్నాడు. అయితే గుట్టల్లో గుస గుస తో యుట్యూబ్ జర్నీని మొదలెట్టిన సదన్న మల్లేశం, బతుకమ్మ, తుపాకీ రాముడు, రుద్రంగి అనే సినిమాలతో పాటు మోతెవారి లవ్ స్టోరీలోనూ కనిపించి మెప్పించడం విశేషం.
చేసిన షార్ట్ ఫిలిమ్స్
ముఖ్యంగా ఆయన చేసిన , గడుసు పోరడు ,లుంగీ లింగన్న, హార్వెస్టర్ పోయింది, పెండ్లి గాని పిల్లగాడు, నా సోపతి నువ్వే, మామా లగ్గమైంది మనసు నిమ్మలమైంది, బ్యాచిలర్ భద్రన్న , తాళ్లల్ల తగిలిండు, పక్క బొక్కలు పర్రె వాసినై,కయ్యం దండగ కలిసుంటే పండగ కలిసి ఉంటే పండుగ చూపులు పిల్ల మీద చిత్తం శంబు మీద,ఒక్కసారి తింపు వంటి ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ తో అలరించాడు సదన్న.
ఒక్కో షార్ట్ ఫిలిమ్ కి దాదాపు 20 నుండి ముప్పై వేల వరకు?
ఇక జనానందమే సదానందం అనే క్యాప్షన్ తో కామెడీ షార్ట్ ఫిలిమ్స్ చేసే సదన్న అసలు ఒక్కో షార్ట్ ఫిలిం కి ఎంత తీసుకుంటాడా అన్న టాక్ సోషల్ మీడియాలో జోరుగా నడుస్తుంది.అయితే సోషల్ మీడియాలో ఉన్న టాక్స్ ప్రకారం సదన్న ఒక్కో షార్ట్ ఫిలిమ్ కి దాదాపు 20 నుండి ముప్పై వేల వరకు తీసుకుంటాడని,అయితే సందర్భాన్ని బట్టి ఈ లెక్క మారుతుందని సమాచారం.చూడాలి మరి నెట్టింట వైరల్ అవుతున్న ఈ టాక్ పై సదన్న ఎలా రియాక్ట్ అవుతాడో !
ALSO READ :కనకవ్వ నుంచి మంగ్లీ వరకు.. ఒక్కో పాటకు ఎంత తీసుకుంటున్నారంటే?