Brahmamudi serial today Episode: రాజు, ఇందును పెళ్లి చేసుకోగానే.. రేఖ కోపంగా రూంలోకి వెళ్లి పూల కుండీలు పగులగొడుతుంది. శేషు ఇది పగులగొట్టు అది పగులగొట్టు అంటూ అందిస్తుంటాడు. భ్రమరాంబ ఆపేసి రేఖ ఏంటిది పిచ్చి పట్టిన దానిలా అంటే.. వద్దు రేఖ బీకామ్ అంటాడు. బీకామ్ లేదు గీకామ్ లేదు. ఇప్పుడు మా చెల్లెమ్మ ఎవరి మాట వినదు ఇదిగో చెల్లెమ్మ ఇప్పుడు నీ చేతిలో ఉందే అది ఇందు గుండెకాయ అనుకో బాస్కెల్ బాల్ ఆడుకో అంటూ చెప్పగానే.. నువ్వెక్కడ తలతిక్క మనిషివయ్యా స్వామి గుండె కాయ దొండకాయ అంటూ దాన్ని రెచ్చగొడతావేంటి..? అంటూ శేషును పక్కకు తోసేస్తుంది. భూషణ్ ప్లీజ్ రేఖ కూల్‌గా ఉండు అంటే.. ఎలా కూల్ గా ఉండమంటావు.. ఇరవై ఏళ్లుగా ఈ ఇంట్లో ఏకచత్రాధిపత్యం వహిస్తూనే ఉన్నాను.. ఆధికారాలన్నీ ఆ ఇందు లాగేసుకుంది.
ఆ బస్తీ గాడిని తీసుకొచ్చి ఈ ఇంట్లో నాటకం ఆడింది. ఇప్పుడు శాశ్వంతంగా వాడిని పెళ్లి కూడా చేసుకుంది అంటూ రేఖ చెప్తుంటే.. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు రేఖ అంటూ భ్రమరాంబ అడిగితే.. ఓల్డ్ మెమెరీస్ గుర్తు చేసుకుంటుందిలే భ్రమరం అంటాడు శేషు. భ్రమరాంబ కోపంగా శేషును పక్కకు తోసేస్తుంది. అయినా మళ్లీ వెళ్తాడు శేషు. వెటకారంగా మాట్లాడతాడు. రేఖ ఇరిటేట్ అవుతుంది. అప్పుడే వచ్చిన ఐశ్వర్య ఈ మాత్రం దానికే నువ్వు ఇలా ఫీలవుతే ఎలా ఆంటీ ఆడది తలుచుకుంటే రాజ్యాలే తలకిందులు అవుతాయని అంటారు అని ఐషు చెబితే.. రాజ్యాలు ఏం కర్మ అమ్మా భూమే తలకిందులుగా తిరుగుతుంది అంటాడు శేషు. ఐషు కోపంగా చూస్తూ.. ఇప్పటి వరకు నువ్వు ప్రయత్నించావు.. కానీ ఏ విషయంలోనూ నువ్వు గెలవలేకపోయావు. దానికి కారణం ఏదైనా కావొచ్చు కానీ నీ చేతికి మట్టి అంటకుండా ఈ ఇంటిని నేను ఎలా నేలమట్టం చేస్తానో అంటూ చెప్తుంది ఐషు. ఆ రాజును ఇందు చేతే మెడ పట్టించి బయటకు గెంటేసేలా చేస్తాను అంటుంది. ్
రాజు కిచెన్‌లోకి వెళ్లి నందు చూసి ఏంటి మరదల్ ఏం చేస్తున్నావు అంటే.. అదేంటి కొత్తగా పిలుస్తున్నావు అంటే.. ఇన్నాళ్లు అద్దె మొగుడిగా చేశాను కాబట్టి అలా పిలవలేకపోయాను ఇప్పుడు మాత్రం ఈ ఇంటికి ఆల్లుడిని అయిపోయాను కదా ఇప్పుడు ఎవరినైనా పేరు పెట్టి పిలవొచ్చు వరసలు కలిపి పిలవొచ్చు అంటాడు. అందుకే నువ్వు కూడా నన్ను బావ అని పిలువు అందుకు నందు ఓకే అంటూ బావ అంటూ పిలుస్తుంద. రాజు మెలికలు తిరిగిపోతుంటాడు. తాను ఇక ఇందు దగ్గరకు వెళ్తానని అంటాడు. వద్దని అక్క కోపంగా ఉందని చెప్తుంది అయినా వినకుండా రాజు వెళ్లిపోతాడు పాపం బావ అని నందు అనుకుంటుంది.
సుభాష్‌తో అపర్ణ చాలా హ్యాపీగా ఫీలవుతుంది. రాజు వెళ్లిపోగానే రేఖ తనలోని రాక్షసిని బయటకు తీసుకొచ్చి మనల్ని బాధపెట్టడం మొదలు పెట్టింది. మళ్లీ రాజు వచ్చి ఇందును పెళ్లి చేసుకోవడంతో దాని పరిస్థితి చూస్తుంటే ఆశ్చర్యమేస్తుంది అంటూ చెప్తుంది. చలపతి ఏం ఆలోచించారో రాజును పంపించారు అంటుంది అపర్ణ. అప్పుడే సూప్ తీసుకొస్తుంది నందు. అపర్ణ, సుభాష్‌లతో మాట్లాడుతూ సూప్ ఇస్తుంది. వేడిగా ఉంది మెల్లగా తాగండి అని చెప్తుంది.
ఇక ఇందు రూంలోకి వెళ్లిన రాజును కోపంగా చూస్తుంది. ఎందుకొచ్చావు అని అడుగుతుంది. రూంలోకా అని రాజు అడిగితే.. కాదు నా జీవితంలోకి ఆ పెళ్లి మండపంలోకి అంటూ ఇందు చెప్పగానే.. నిన్ను పెళ్లి చేసుకోవడానికి అంటూ రాజు చెప్పగానే.. అంతకు ముందు ఎప్పుడు చెప్పలేదు సడెన్‌గా ఎలా వచ్చింది ప్రేమ అంటూ కోపంగా అడుగుతుంది. మీ నాన్న చేయి పట్టుకుని వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లిపోయావు కదా అంటుంది. అప్పుడు ఏం జరుగుతుందో తెలియలేద.. నేనేం చేస్తున్నానో తెలుసుకునే లోపే నేను ఇంట్లో ఉన్నాను అంటాడు రాజు. ఇద్దరి మధ్య చిలిపి గొడవ జరగుతుంది. అప్పుడే అపర్ణ, నందు రూంలోకి వెళ్తారు. వారిద్దరి మధ్య రాజును ఇరికిస్తుంది ఇందు. తన మాటలతో రాజును బకరాను చేస్తుంది. ముగ్గురు కలిసి రాజుతో అటాడుకుంటారు.
తన ఇంటికి పంచదార కోసం వచ్చిన పక్కింటావిడ రాజు, వెంకీల గురించి ఏదేదో మాట్లాడుతుంటే.. చలపతి కోపంగా ఆమెతో గొడవ పెట్టుకుని ఇంట్లోంచి వెళ్లగొడతాడు. లక్ష్మీ ఏంటండి మీరు మీరు ఇలా ఉంటే మన ఇంటికి ఎవరూ రారు అంటుంది. ఇంతలో ఇవాళ్టీ బ్రహ్మముడి ఏపిసోడ్ అయిపోతుంది.