Brahmamudi serial today Episode: కనకం ఇంటికి వెళ్లిన రాజ్ నేను నిన్ను తీసుకెళ్లడానికే వచ్చాను అని కావ్యకు చెప్పగానే.. నేను రానని కూడా చెప్పాను కదండి పదండి నాన్న లోపలికి అనగానే ఒక్క నిమిషం అయితే దీని మీద సంతకం పెట్టి వెళ్లు అంటాడు. ఏంటది అని కావ్య అడగ్గానే విడాకుల పేపర్లు.. నాతో కలిసి ఉండటం కంటే నీకు నీ బిడ్డే ముఖ్యం అయినప్పుడు ఇక మనం కలిసి ఉండటంలో అర్థం లేదు. నీకు నీ బిడ్డ కావాలంటే ఇందులో సంతకం చేయి.. నేను నా దారిలో వెళ్లిపోతాను.. లేదు నాతో కలిసి ఉండాలంటే ఇప్పుడే నాతో రా అని చెప్తాడు. దీంతో మూర్తి బాధగా అల్లుడు గారు మీరు కూడా ఇలా ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటే ఎలా అల్లుడు గారు అని అడుగుతాడు.
ఇంతలో కావ్య ఇప్పుడు కొత్తగా సంతకాలు చేసి ఇవ్వడం ఏంటి..? గతంలో మీకు ఒకసారి సంతకం చేసి ఇచ్చాను కదా ఆ పేపర్లు పోయాయా..? అంటుంది. ఇంతలో మూర్తి అమ్మ కావ్య ఏం మాట్లాడుతున్నావు.. అంటాడు. దీంతో కావ్య కోపంగా మీరు ఆగండి నాన్న సరే ఇప్పుడే మీకేంటి సంతకం చేస్తే వెళ్లిపోతారు. ఒక్క నిమిషం ఆగండి అంటూ లోపలికి వెళ్తుంటే.. ఎక్కడికి అని రాజ్ అడుగుతాడు. దీంతో కావ్య సంతకం చేయాలంటే పెన్ను ఉండాలి కదా..? ఉండండి తీసుకొస్తాను అంటూ కావ్య లోపలికి వెళ్లగానే నేను భయపెడదామని విడాకుల డ్రామా ఆడితే తనేంటి నిజంగానే సంతకం చేయడానికి పెన్ను కోసం వెళ్తుంది అని మనసులో అనుకుంటాడు. ఇంతలో కావ్య లోపలి నుంచి పెన్ను తీసుకుని వచ్చి సంతకం చేస్తుంది. అడిగారు కదా సంతకం చేశాను తీసుకోండి అని చెప్తుంది.
దీంతో రాజ్ కోపంగా అంటే నాతో విడిపోవడానికి కూడా సిద్ద పడతావు తప్ప నాతో పాటు రానంటావు అంటాడు. దీంతో ఆరు నెలలు సావాసం చేస్తే గాడిద కూడా గుర్రం అయిందంట అలాగే మీతో చేరి చేరి మాట మీద నిలబడటం అలవాటై పోయింది. సంతకం చేస్తే వెళ్లిపోతాను అన్నారు కదా ఇంకా ఇక్కడే ఉన్నారేంటి..? అంటుంది కావ్య. దీంతో రాజ్ కోపంగా విడాకుల పేపర్స్ చింపేసి ఎక్కడికి వెళ్లేది. నిన్ను తీసుకెళ్లకుండా నేను వెళ్లను అంటాడు. దీంతో కనకం అల్లుడుగారేంటి.. రాకెట్ లా పైకి వచ్చి చివరికి చింపేసి తుస్సుమన్నారు.. ఎంతైనా నా కూతురంటే అల్లుడి గారికి ప్రేమే అని మనసులో అనుకుంటుంది. మీరు ఇలాంటి డ్రామాలాడతారని నాకు ముందే తెలుసు అంటుంది కావ్య. డ్రామాలు కాదు ఇక్కడి నుంచి నిన్ను తీసుకెళ్లకుండా నేను ఎక్కడికి వెళ్లను అంటాడు రాజ్.. వెళ్లకపోతే ఏం చేస్తారు అని కావ్య అడగ్గానే.. నిరాహారదీక్ష చేస్తానని చెప్పి ఇంటి ముందు టెంట్ వేసుకుని దీక్ష కు కూర్చుంటాడు.
మరోవైపు ఇంట్లో ఉన్న రుద్రాణి సంతోషంతో పాటలు పెట్టుకుని డాన్స్ చేస్తుంది. రాహుల్ వచ్చి అడిగితే ఆనందంతో సెలబ్రేట్ చేసుకుంటున్నానని చెప్తుంది. ఇంతలో కింద నుంచి ఇంద్రాదేవి అందరిని పిలుస్తుంది. అందరూ హాల్లోకి రాగానే కావ్య దగ్గరకు వెళ్లిన రాజ్ చేస్తున్న నిరాహార దీక్ష గురించి చెప్తుంది. దీంతో రుద్రాణి షాక్ అవుతుంది. అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. ఇక రాహుల్ ఈ ప్లాన్ కూడా గోవిందా అనుకుంటాడు. అపర్ణ నమ్మలేకపోతున్నాను అత్తయ్య అంటుంది. నువ్వేంటి అక్క మన రాజ్ భార్య కోసం అలా చేశాడంటే నేను నమ్మలేకపోతున్నాను అంటుంది ధాన్యలక్ష్మీ.
వాడిలో ఇంత చేంజ్ ఏంటి అని సుభాష్ అడుగుతాడు. ఇంతలో రుద్రాణి బాధపడాల్సిన విషయాన్ని పట్టుకుని అంత సంతోషంగా చెప్తారేంటి అని అడుగుతుంది. దీంతో ఇంద్రాదేవి ఇందులో బాధపడాల్సిన విషయం ఏముంది రుద్రాణి అని అడుగుతుంది. దుగ్గిరాల ఇంటి వారసుడు భార్య కోసం నిరాహార దీక్ష చేస్తున్నాడంటే మన పరువు ఏమవుతుందో తెలుసా..? నలుగురు మనల్ని చూసి నవ్వుకుంటారు వెంటనే ఫోన్ చేసి రమ్మనండి అంటుంది. ఏం అవసరం లేదు వాడు దీక్ష చేయని అంటుంది ఇంద్రాదేవి. అపర్ణ కూడా సంతోషంగా ఉంది. ఈ సంతోషంలో అదరికీ స్వీట్లు తీసుకొస్తాను అంటూ లోపలికి వెళ్తుంది.
మరోవైపు కావ్య ఇంటి ముందు దీక్ష చేస్తున్న రాజ్ దగ్గరకు ఒక తాగుబోతు వచ్చి మద్దతు ఇస్తాడు. అదంతా చూస్తున్న కావ్య నవ్వుకుంటుంది. మరోవైపు ఇంట్లో హ్యపీగా తింటున్న అప్పును చూసి కళ్యాణ్ షాక్ అవుతాడు. నువ్వు నువ్వేనా అని అడుగుతాడు. దీంతో బావ అక్కతో నిజమైనా చెప్తాడు. అబార్షన్ కు అయినా ఒప్పిస్తాడు. అందుకే హ్యాపీగ ఉన్నాను అందుకే తింటున్నాను అని చెప్తుంది. నిన్ను ఇలా చూస్తుంటే నాకు హ్యాపీగా ఉంది పొట్టి అంటాడు కళ్యాణ్. మరోవైపు రాజ్ దీక్ష దగ్గరకు మీడియా వాళ్లు వస్తారు. వాళ్లతో రాజ్ పక్కనే ఉన్న తాగుబోతు మాట్లాడుతుంటే అంతా కామెడీ గా ఉంటుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.