Intinti Ramayanam Today Episode October 17th : నిన్నటి ఎపిసోడ్ లో.. రాజన్నప్రసాద్ కి గుండెపోటు రావడంతో అందరూ హాస్పిటల్ కి తీసుకొని వెళ్తారు.. అయితే డాక్టరు ఆయన కండిషన్ సీరియస్ గా ఉందని చెప్పడంతో అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. ఎలాగైనా సరే దేవుడు ఆయన్ని కాపాడాలి అని పార్వతీ టెన్షన్ పడుతూ ఉంటుంది.. ఆ టైంలో అక్కడికి పల్లవి వస్తుంది. అవని ఇన్ని తప్పులు చేసినా కూడా మీరు ఆమెని నెత్తిన పెట్టుకున్నారు. ఇంట్లోంచి గెంటే లేదేంటి? అత్తయ్య నువ్వు చంపాలని చూసింది అయినా కూడా మీరు ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉండి పోయారు. నేను చేసింది తప్పేలా అవుతుంది? నీ భార్య గురించి నువ్వు అర్థం చేసుకుని ఇంతేనా అని కమల్ ని అడుగుతుంది. ఇంత జరిగినా కూడా అవని అంటే ఏంటో మాకు తెలుసు నీ గురించి కూడా మాకు అర్థం అయిపోయింది. నువ్వు ఇక నుంచి వెళ్ళమ్మా అని పార్వతి పల్లవి చంప పగలగొడుతుంది. రాజేంద్రప్రసాద్ ఆపరేషన్ అయిన తర్వాత ఇంటికి తీసుకెళ్లొచ్చు అని డాక్టర్ చెబుతారు. రాజేంద్రప్రసాద్ మళ్లీ తిరిగి ఇంటికి రావడంతో అందరూ సంతోషంగా ఉంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. రాజేంద్రప్రసాద్ ని మళ్ళీ ఇలా చూస్తామని అనుకోలేదు అంటూ భానుమతి కన్నీళ్లు పెట్టుకుంటుంది. అయితే రాజేంద్రప్రసాద్ సంతోషంగా ఉండాలని లేకపోతే మళ్లీ ఆరోగ్యం పాడవుతుంది అని అవని అంటుంది. వీళ్ళందరూ సంతోషంగా ఉన్న టైంలో పల్లవి పంపించిన మనిషి మీతో నేను మాట్లాడొచ్చా అని అవనిని అడుగుతాడు. మీరు ఈరోజు ఇండ్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని డెడ్లైన్ విధిస్తాడు. మావయ్య గారికి హెల్త్ బాలేదండి ఇప్పుడే ఇంటికి వచ్చాము ఒక నాలుగు రోజులు టైం ఇవ్వండి అని అవని.
మీలాంటి వాళ్ళు ఇలానే సాకులు చెప్తారు ఇవన్నీ నా దగ్గర కుదరవు. మీకు ఆల్రెడీ రెండు రోజులు ముందే చెప్పాను ఇప్పుడు ఖాళీ చేసి వెళ్లి పోవాల్సిందే మీకు ఇంకొక రెండు మూడు గంటలు టైం ఇస్తాను అని అతను అంటాడు. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావ్ ఒక నాలుగు రోజులు అడిగాను కదా ఎందుకు ఎక్కువ చేస్తున్నావ్ అని కమల్ సీరియస్ అవుతాడు. పార్వతి ఒక నాలుగు రోజుల తర్వాత వెళ్తాం బాబు మీరు పెద్దమనిషి చేసుకొని సహాయం చేయండి అని అడుగుతుంది.. ఇదంతా నాకు తెలియదమ్మా మీరు ఖాళీ చేయాల్సిందే అని అతను అంటాడు.
భానుమతి పెద్దదాన్ని అడుగుతున్నాను కాదనకుండా ఒక నాలుగు రోజులు ఉండనివ్వు బాబు ఆ తర్వాత మేము వెళ్ళిపోతాము అని ఎంత బ్రతిమలాడినా.. ఇదంతా కుదరదు అని అతను కఠినంగా చెప్పేస్తాడు. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావ్ మావయ్య గారు ఇప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చాడు. హెల్త్ బాగాలేదు ఒక నాలుగు రోజులు తర్వాత కాళీ చేస్తామని చెప్తున్నాను కదా అని అవన్నీ రెచ్చిపోతుంది. మీరు ఖాళీ చేయను అని అంటే నా పద్ధతిలో నేను చేయాల్సి వస్తుంది అని అతను అంటాడు. మోసం చేసి నీలాగా ఇంటిని లాక్కోవడం మాకు తెలీదు అని అవని అంటుంది. నీ మీద మోసం చేసినందుకు పోలీస్ కేసు పెట్టాలని అవని అతనిపై సీరియస్ అవుతుంది.
అతను మీరు పోలీస్ స్టేషన్ కి వెళ్తే నేను కోర్టుకు వెళ్తాను నా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయని అంటాడు. రాజేంద్రప్రసాద్ అవని ఇప్పుడు నాకు ఇవన్నీ భరించే ఓపిక లేదు ఎన్నో చూశాము. అతని అడిగినా టైం లోనే మనం వెళ్ళిపోదాము అని రాజేంద్రప్రసాద్ అంటాడు. శ్రియ మాత్రం నేను వేరే ఇంటికి వెళ్లలేను. అగ్గి పెట్టి లాంటి ఇళ్లల్లో నేను ఉండలేను శ్రీ నువ్వు వస్తావా రావా..? నేను వెళ్ళిపోతాను అని అంటుంది. శ్రీకర్ శ్రీయ ఎంత చెప్తున్నా వినకుండా ఇంట్లోంచి వెళ్లిపోతారు.
ఇక అందరూ ఇంటిని కాళీ చేస్తారు రాజేంద్రప్రసాద్ ఆ ఇంటిని వదిలి వెళుతూ ఉంటే కన్నీళ్లు పెట్టుకుంటాడు. మొత్తానికి పల్లవి అనుకున్న ప్లాన్ సక్సెస్ అయినందుకు చక్రధర్ పండగ చేసుకుంటూ ఉంటాడు. రోడ్డున పడ్డారు నాకు చాలా సంతోషంగా ఉంది. అవని ఇరికింట్లో ఉన్న పెద్ద ఇంట్లో ఉన్న తన కుటుంబాన్ని సంతోషంగా ఉంచాలని అనుకుంటుంది ఆ సంతోషం వాళ్ళ ఉంచకుండా నువ్వు దూరం చేయాలి అని అంటాడు. నాకేం చేయాలో తెలుసు డాడీ నేను చేస్తాను అని అంటుంది.
Also Read : మీనాకు క్లాస్ పీకిన ప్రభావతి..సత్యం షాకింగ్ నిర్ణయం..బాలు దెబ్బకు మనోజ్ ఫ్యూజుల్ అవుట్..
రాజేంద్రప్రసాద్ కుటుంబం ఓ ఇంటిని చూసుకొని అక్కడ ఉండాలని అనుకుంటారు.. ఆ ఇంటిని చూసి అవని బాగానే ఉంది మావయ్య మనం ఇక్కడే ఉన్నాము అని అంటుంది. అవని ఇంటి డబ్బులు కట్టడానికి చాలా కష్టపడుతుంది అని రాజేంద్రప్రసాద్ అనుకుంటూ ఉంటాడు. పార్వతి రాజేంద్రప్రసాద్ కి ఒక గది చూపించి మీరిద్దరూ ఇక్కడ ఉండండి అనేసి అంటుంది. దానికి ఇంత పెద్ద గది మాకెందుకమ్మా అని పార్వతి అంటుంది. ఇంటిని గడపడానికి ఎలా అని ఆలోచిస్తున్నాను అవని నువ్వు గనుక లేకపోతే ఆ డబ్బులు కూడా ఉండేవి కాదు కదా అని రాజేంద్రప్రసాద్ అంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..