Kavya Shree: తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కడ లేని పేరు కావ్య శ్రీ.. గోరింటాకు సీరియల్ ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ సీరియలు మంచి సక్సెస్ ని అందుకోవడంతో ఒక్కసారిగా ఈమె పాపులర్ అయిపోయింది. తర్వాత ఎన్నో సీరియల్స్ లో నటించింది. సీరియల్ యాక్టర్ నిఖిల్ తో ప్రేమాయణం నడిపించింది. దాదాపు ఐదేళ్లపాటు నిఖిల్ తో ప్రేమాయణం నడిపింది. ఈమధ్య వీళ్ళిద్దరూ బ్రేకప్ చెప్పుకున్న విషయం తెలిసిందే.. నిఖిల్ కావ్య కోసం వెయిట్ చేస్తున్నాడు కానీ కావ్య మాత్రం నిఖిల్ ని మళ్ళీ తన లైఫ్ లోకి రానిచ్చే పరిస్థితి కనిపించడం లేదు.. ప్రస్తుతం తన కెరియర్ పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. ఈమధ్య బుల్లితెరపై ప్రసారమవుతున్న షోలలో ఈమె ఎక్కువగా కనిపిస్తూ వస్తుంది. కొన్నిసార్లు ఆమె మాట్లాడిన మాటలు నిఖిల్ కి డైరెక్ట్ గా కౌంటర్ ఇచ్చాయంటూ నెటిజన్లు కామెంట్లు కూడా చేస్తుంటారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ కావ్య గురించి ఓ షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈమెకు ఆల్రెడీ పెళ్లయింది అంటూ ఓ వార్త ప్రచారంలో ఉంది. అందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త అయితే సోషల్ మీడియాని ఓ ఊపు ఊపేస్తుంది.. కాస్త వివరాల్లోకి వెళితే..
గోరింటాకు సీరియల్ తో తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ కావ్య శ్రీ.. ఈమె గురించి ఈమధ్య తెలియని వాళ్ళు ఉండరు. ఒకప్పుడు నిఖిల్ లవర్ గా ఉన్న ఈమె వీళ్లిద్దరు బ్రేకప్ తర్వాత ఒక్కసారిగా అందరి నోట్లో నానుతుంది. బిగ్ బాస్ లోకి వెళ్లిన తర్వాత నిఖిల్ కావ్య గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకోవడంతో మరోసారి ఆమె పేరు హైలెట్ అయింది. అయితే కావ్య నిఖిల్ కన్నా ముందు ఒకతని ప్రేమించి పెళ్లి చేసుకున్న అంటూ ఓ వార్త వినిపిస్తుంది. అతని పేరు వివరాలైతే తెలియదు కానీ.. వాళ్ళిద్దరి మధ్య మనసుపడ్డలు రావడంతో విడాకులు తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇందులో నిజం ఎంత ఉందో తెలియాలంటే కావ్య ఈ వార్తలపై రియాక్ట్ అయ్యి సమాధానం చెప్పేవరకు వెయిట్ చెయ్యాలి..
Also Read:‘ హ్యుమన్ హిస్టరీ రికార్డ్ ‘.. ప్రగ్నెన్సీ పై ఒక్కమాటతో నోరు మూయించిందిగా..
కావ్య ప్రస్తుతం చిన్ని సీరియల్ లో నటిస్తుంది. అలాగే బుల్లితెరపై ప్రసారమవుతున్న కొండగలు ఈవెంట్లలో సందడి చేస్తూ వస్తుంది. తన పెళ్లి గురించి ప్రతి షోలో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ కావ్య మాత్రం వాటికి సైలెంట్ గానే ఉంటూ సమాధానం చెప్పేది. అయితే ఈమధ్య ఈమె పెళ్లి చేసుకోను అని ఓ షోలో అన్నది. నిఖిల్ మోసం చేయడం వల్లే ఆమె పెళ్లి చేసుకోకుండా ఉండిపోతుంది అంటూ నేటిజెన్లు కూడా కామెంట్లు చేస్తున్నారు. కొందరైతే వీరిద్దరూ మళ్లీ కలిసిపోతే బాగుండు అని అనుకుంటున్నారు. ఏది ఏమైనా కూడా వీరిద్దరి గురించి నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంటుంది. ఇకపోతే కావ్య బిగ్ బాస్ లోకి ఎంటర్ ఇవ్వబోతుందంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. మరి దీనిపై అతి త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది..