Brahmamudi serial today Episode: ఇందు, రాజు ప్లాన్ ప్రకారం వెళ్లి మేనేజర్‌ను కలుస్తారు. ఒక కెఫేలో కూర్చుని తమతో చేయబోయే డీల్‌కు ఎలాంటి ప్రాబ్లమ్ రాదనుకంటామని అడిగితే.. రాదని ఐశ్వర్య మేడంకు ఎలాంటి ప్రాబ్లమ్ రాకుండా డీల్ ఫినిష్ చేశానని మేనేజర్ చెప్పగానే.. ఇందు నిజంగానా సార్ అంటే అవును మేడం మీరు ఎవ్వరికీ చెప్పొద్దు అంటాడు మేనేజర్. రాజు కూడా అనుమానంగా నేను ఇలాంటివి నమ్మలేకపోతున్నాను.. ఐశ్వర్య ఇలాంటి పనులు చేయదే అంటే భలే వారు సార్ ఆ దుగ్గిరాల కుటుంబంలో అందరి కంటే పెద్ద ఫ్రాడ్ ఎవరైనా ఉన్నారంటే ఐశ్వర్య మేడమే సార్ అని చెప్తాడు. మరి ఈ విషయంలో ఐశ్వర్యను ఎలా బయట పడేశారు సార్ అని ఇందు అడిగితే.. ఇలాంటి వాటికి మన దగ్గర చాలా సొల్యూషన్స్ ఉన్నాయి అని మేనేజర్ చెప్పగానే.. అవేంటో మాకు చెప్తే మాకు నమ్మకం వస్తుంది కదా..? అని రాజు అడగ్గానే.. మేనేజర్ అసలు నిజం చెప్తాడు.
కొంతమంది అమయాకులను మా కంపెనీలో జాబ్ పేరుతో తీసుకుని ఈ నెపం మొత్తం వాళ్ల మీద ఏసేసి వాళ్లను జైలుకు పంపిస్తాం అని చెప్తాడు. అంతకముందే ఒక వ్యక్తిని చాటు నుంచి వీడియో తీయమని రెడీగా ఉంచి ఉంటారు రాజు, ఇందు ఆ వ్యక్తి మేనేజర్ చెప్పు అన్ని విషయాలు వీడియో రికార్డింగ్ చేస్తుంటాడు. అంతా రికార్డింగ్ చేసిన తర్వాత ఒక వెయిటర్ వచ్చి జ్యూస్ ఇస్తాడు. తర్వాత ఆ జ్యూస్ తాగిన మేనేజర్‌కు నిజం చెప్తారు. నువ్వు అరెస్ట్ చేయించింది నా తమ్ముడిని అందుకే ఇదంతా చేశాము నువ్వు తాగిన జ్యూస్‌లో పాయిజన్ కలిపానని ఇంకొద్ది సేపట్లో నువ్వు చనిపోతావని బెదిరిస్తారు. అంతకుముందే రెడీగా ఉంచుకున్న డాక్టర్‌ను పిలిచి ఇతని సిచ్యుయేషన్ ఏంటి అని అడుగుతాడు. ఇంకొద్ది సేపట్లో చనిపోతాడని డాక్టర్ బెదిరిస్తారు. మరి నేనేం చేయాలి అని అతను అడిగితే.. యాంటీ డోస్ ఇవ్వాలని డాక్టర్ చెప్తాడు. ఆ యాంటి డోస్ స్టేషన్‌లో ఉన్న మా వెంకీ దగ్గర ఉంది అక్కడికి వెళ్దాం పద అంటూ మేనేజర్‌ను ఇంటికి తీసుకెళ్తారు.
చలపతి ఇంటికి వెళ్లిన మేనేజర్ వెంకీ దగ్గరకు తనకు యాంటీ డోస్ ఇవ్వమని తాన తప్పు చేశానని తనను క్షమించమని ఏడుస్తూ అడుగుతుంటాడు. అప్పుడే చలపతి, లక్ష్మీ వస్తారు. ఎవర్రా ఈయన అని చలపతి అడిగితే.. వెంకీ మీద కేసు పెట్టిన వ్యక్తి అని రాజు చెప్పగానే.. చలపతి కోపంగా కొడుతుంటాడు. లక్ష్మీ కత్తిపూట తీసుకొచ్చి చంపబోతుంటే.. డాక్టర్ మీరు ఆగండి మేడం అనవసరంగా మీరు అతన్ని చంపి ఎందుకు నేరస్తులు అవుతారు. ఇంకో గంటలో అతను చనిపోతాడు అని చెప్తాడు. మేనేజర్ ఏడుస్తూ వెంకీ కాళ్ల మీద పడి యాంటీ డోస్ ఇవ్వమని అడుగుతాడు. అందుకు వెంకీ ఒక స్లిప్ ఇస్తూ ఈ అడ్రస్‌కు వెళ్లు యాంటీ డోస్ దొరుకుతుంది అని చెప్తాడు. ఆ స్లిప్ ఓపెన్ చూస్తే అందులో మణికొండ పోలీస్ స్టేషన్ అని ఉంటుంది. మేనేజర్ షాక్ అవుతాడు. వెంటనే పరుగెత్తుకుంటూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి నందుకు నిజం చెప్తాడు మేనేజర్.
తనను వెంటనే అరెస్ట్ చేయండి.. యాంటీ డోస్ ఇచ్చేయండి అంటూ రిక్వెస్ట్ చేస్తాడు. సాక్ష్యాలు ఉండాలి కదా అంటూ నందు అడిగితే.. తన మెయిల్‌లో ఉన్న అన్ని సాక్ష్యాలు ఇవ్వడమే కాకుండా మళ్లీ తాను ఏం చేసింది మొత్తం చెప్తాడు. అదంతా వీడియో తీస్తారు. మేనేజర్‌ను సెల్ లో వేస్తుంది నందు. రాజు కోపంగా ఇప్పుడు చెప్పు ఇందు ఐవ్వర్యను ఏం చేద్దాం.. తనను జైలుకు పంపించే వరకు నేను వదలను అంటూ కోపంగా చాలా స్పీడుగా వెళ్తుంటాడు రాజు. వెనకాలే వెళ్తుంది ఇందు. తర్వాత నందు, చలపతి ఇంటికి వెళ్తుంది. మేనేజర్ జరిగింది ఒప్పుకున్నాడు నీ మీద ఉన్న కేసు కొట్టేశామని వెంకీకి చెప్తుంది. నువ్వు ఇక కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు అంటుంది. లక్ష్మీ, చలపతి హ్యాపీగా ఫీలవుతారు. ఇంతలో ఇవాళ్టీ బ్రహ్మముడి ఏపిసోడ్ అయిపోతుంది.