E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: వల్లి నిజంగానే మారిందా..? నర్మదాకు అనుమానం.. సాగర్ ఇరుక్కుంటాడా..?

Illu Illalu Pillalu Today Episodes: వల్లి నిజంగానే మారిందా..? నర్మదాకు అనుమానం.. సాగర్ ఇరుక్కుంటాడా..?
Advertisement

Illu Illalu Pillalu Today Episode October 27th : ప్రేమ ధీరజ్ కోసం ఎదురు చూస్తూ వస్తాడు నా రాజు అంటూ పాటలు పాడుతూ చాలా సంతోషంగా ఉంటుంది. ధీరజ్ రాగానే తనకి ఏదో ఒకటి తెస్తాడు 30 లక్షల తీసుకుని వస్తాడు అని చాలా సంతోషంగా ఎదురు చూస్తూ ఉంటుంది.. కానీ ఈరోజు మాత్రం ఐస్ క్రీమ్ తెచ్చాడు అని తెలుసుకోకుండా 30 లక్షలు తెచ్చావు ఆ భద్రకి వార్నింగ్ ఇచ్చి మరి ఆ 30 లక్షల గురించి నేను కడతాను అని అంటుంది ప్రేమ. నువ్వు అలా తిప్పి తిప్పి తిప్పుతూ ఉంటే ఐస్క్రీం కరిగిపోతుంది అందులో ఉండేది ఐస్ క్రీమ్ ఒకసారి చూసి తిను అనేసి అంటాడు అయితే ప్రేమ మొదట డబ్బులు తీసుకురాలేదని బెట్టి చేసిన కూడా ధీరజ్ వల్ల ఐస్క్రీం తినేస్తుంది..

రామరాజుకు ఎదురుచెప్పిన సాగర్..

తర్వాత రోజు ఉదయం రామరాజు స్థలాన్ని అమ్మేందుకు నిర్ణయించుకుంటారు.. బ్రోకర్ని రమ్మని ఎలాగైనా ఆ స్థలాన్ని అమ్మాలి అని అనుకుంటాడు కానీ అసలు అమ్మడానికి ఎవరూ ఒప్పుకోరు. నువ్వు ఆ స్థలాన్ని అమ్మాల్సిన అవసరం లేదు అని ధీరజ్ అంటాడు. అసలు అమ్మకుండా ఎలా తెస్తావ్ రా ఎలా కడతావురా అని అడుగుతాడు. రామరాజు కానీ ధీరజ్ మాత్రం ఏదో ఒకటి చేసి కడతాను అని అంటాడు. అటు సాగర్ కూడా నాకోసం నువ్వు పొలం అమ్మాల్సిన అవసరం లేదు కచ్చితంగా నేనే కడతానని సాగర్ దిగేసి చెప్పేస్తాడు కానీ రామరాజు మాత్రం ధీరజ్ అంటే ఏదో ఒకటి చేసి కడతాడు కానీ నువ్వు ఎక్కడి నుంచి కడతావు. దానికోసం తప్పులు చేస్తావా ఏంటి అని రామరాజు అనగానే సాగర్ సీరియస్ అవుతాడు.

వల్లి ఎంట్రీతో నర్మదా షాక్..

Advertisement

వల్లి పూర్తిగా మారిపోయాను అని నర్మదకు చెప్పాలి అని అనుకుంటుంది.. అయితే ఏం నర్మదా ఆలస్యం అయిపోయింది ఏం ఫైల్స్ ఉన్నాయో ఏంటో అని కంగారు పడిపోతూ హడావిడిగా వస్తుంది. అయితే అక్కడ వల్లి నర్మదని పిలిచి చెల్లి నేను నీతో మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాను అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది. అసలు వల్లి అక్క ఎందుకు వచ్చింది ఇక్కడికి అని నర్మదా అనుకుంటూ ఉంటుంది. అయితే నర్మదకు వల్లి నిజం చెప్తుంది. నేను ఇకమీదట ఏ తప్పు చేయను మారిపోవాలని అనుకుంటున్నాను. దాని కోసం మీ సలహాలు కోసం ఇక్కడికి వచ్చాను అని చెప్పగానే.. ఈ వల్లిని అస్సలు నమ్మడానికి వీల్లేదు అని నర్మదా అనుకుంటుంది.. ఇవన్నీ నమ్మడానికి అసలు వీల్లేదు కచ్చితంగా ఏదో ఒక ప్లాన్ తోనే వచ్చేసింది అందుకే ఇలా మాట్లాడుతుంది అని అనుకుంటుంది.

నాకు ఒక్క అవకాశం కావాలి..

వల్లి అక్క నిజంగానే ఏదో మాస్టర్ ప్లాన్ వేసినట్లే ఉంది అని నర్మదా అనుమానం పడిపోతూ ఉంటుంది. తన గురించి ప్రతి విషయాన్ని నేను ఆలోచించి తీసుకోవాలి అని అనుకుంటుంది. ఇక నర్మదా ఛాన్స్ ఇవ్వడం కాదు అక్క నువ్వు మంచి దానివి అని నిరూపించుకో అప్పుడు నేనే అందరితో మాట్లాడి నిన్ను ఆ ఇంటికి తీసుకుని వెళ్తాను అని చెప్పగానే.. సరే చెల్లి నేనేంటో నేను నిరూపించుకుంటాను. నా గురించి నేను చూసుకుంటాను అని నర్మదా తో వల్లి అంటుంది మరి వల్లి అక్క నిజంగానే మారిపోయిందా లేదు అంటే నేనేం చేయలేను అని అనుకుంటుంది అయితే మళ్లీ నిజంగానే మారిపోతుందా లేదా అని నర్మదా అనుకుంటూ లోపలికి వెళ్తుంది. అక్కడ ఒక పర్మిషన్ నేను ఫైల్ మీద సాగర సంతకం చేసి ఉండడం చూసి షాక్ అవుతుంది ఎలాగైనా సరే లంచాలు తీసుకుంటున్న సాగర్ ని పట్టుకోవాలి అని అనుకుంటుంది.

మరో ఫ్రాడ్ లో సాగర్..

Advertisement

సాగర్ చిన్న చిన్న వాటితో సరిపోవట్లేదు ఒకేసారి పెద్దపెద్ద తిమింగలలో కావాలి అని వాళ్ళ సార్ తో అనగానే అతను ఒక మంచి ఫైల్ ఇస్తాడు. అయితే ఈసారి నాకు 20 లక్షలు కావాలి అని సాగర్ అంటాడు. ఏకంగా 30 లక్షలు ఫైలుని వాళ్ళ సారు ఇవ్వగానే దానిమీద సంతకం పెట్టి బయటికి వస్తాడు. అయితే తన ఫ్రెండ్ తనకు ఐదు లక్షలు ఇవ్వమని చెప్పినా కూడా రిక్వెస్ట్ చేసిన ఇవ్వడు అయితే నీ గురించి నీ భార్య తెలియకుండా నేను ఎంతో మేనేజ్ చేశాను కదా దాని గురించి ఇప్పుడు చూసుకుంటాను అని అనుకుంటాడు.. ఎలాగైనా సరే నిన్ను ఇరికించేలా నేను చూసుకుంటాను అని అనుకుంటాడు..

ధీరజ్ కు షాక్..

ధీరజ్ తన ట్రావెల్ బిజినెస్ కోసం డబ్బులు కోసం అందరిని వెతుకుతూ ఉంటాయి. అయితే తనకి డబ్బులు ఇవ్వడానికి ఎవ్వరు ముందుకు రారు. ఎలాగైనా సరే ఆ డబ్బు లేని సంపాదించి బిజినెస్ ని మొదలు పెట్టాలి అని అనుకుంటారు. అయితే అది చూసిన తర్వాత అందరూ 15 లక్షల కంటే ఎక్కువ ఒక్క రూపాయి కూడా ఇవ్వము అని అంటారు కానీ చింతామణి నేను ఇస్తాను.. ఇప్పుడు నేను తప్ప నీకు ఎవరూ లేరు బిజినెస్ బిజినెస్ ఫ్యామిలీ ఫ్యామిలీని అంటుంది. ఆ మాటను నమ్మి ధీరజ్ ఒప్పుకుంటాడు అయితే భద్ర ప్లాన్ ప్రకారం చింతామణి ఇలా చేస్తుందని తెలియక ఇరుక్కుంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది మరి రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Intinti Ramayanam Today Episode: కమల్ మాటతో షాక్.. శ్రీకర్ ప్లాన్ అదుర్స్.. పల్లవికి స్ట్రాంగ్ వార్నింగ్..

Related News

Podarillu Today Episode : శైలు దెబ్బకు కేశవ షాక్.. మాధవ్ కు ఆడుకున్న చక్రీ.. మనీష తో హ్యాపీ..

Karthika Deepam 2 Serial Today Episode October 27th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ తనను కలిసిన నిజం మాలినికి చెప్పిన జ్యోత్స్న   

Brahmamudi Serial Today Episode October 27th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: తప్పు ఒప్పుకున్న మేనేజర్ – ఎమోషనల్ అయిన నందు 

Intinti Ramayanam Today Episode: కమల్ మాటతో షాక్.. శ్రీకర్ ప్లాన్ అదుర్స్.. పల్లవికి స్ట్రాంగ్ వార్నింగ్..

Tuesday TV Movies : మంగళవారం టీవీల్లోకి హిట్ సినిమాలు.. ఆ ఒక్కటి డోంట్ మిస్..

ముఖేష్ కి ఏమైంది.. ఆమెను టార్గెట్ చేస్తూ మరీ దారుణంగా!

నామినేషన్ వార్.. అసలైన ఆట మొదలుపెట్టిన గోట్స్!

Big Stories

Advertisement
×