BigTV English

Brahmamudi Serial Today September 16th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రేవతి ఇంటికి వెళ్లిన అపర్ణ – అయోమయంలో రుద్రాణి    

Brahmamudi Serial Today September 16th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రేవతి ఇంటికి వెళ్లిన అపర్ణ – అయోమయంలో రుద్రాణి    

Brahmamudi serial today Episode:  రేవతి ముసుగు తొలగిపోవడంతో అందరూ షాక్‌ అవుతారు. రుద్రాణి మాత్రం ముసుగు వేసుకుని వచ్చీ మరీ మా వదినను మోసం చేస్తున్నావా..? రేవతి అంటూ తిడుతుంది. దీంతో రాజ్‌ అడ్డు పడి అక్కను తానే తీసుకొచ్చానని చెప్తాడు. అందుకు తామంతా సహకారం అందిచామని మిగతావాళ్లు చెప్తారు. దీంతో రుద్రాణి మరింత ద్వేషంగా అయితే అందరూ కలిసి మా వదినను మోసం చేశారా అంటూ నిలదీస్తుంది. ఇంతలో ఇంద్రాదేవి కల్పించుకుని రుద్రాణిని తిడుతుంది. రేవతికి తెలియని వయసులో తప్పుడు సలహాలు ఇచ్చి తను ఇంట్లోంచి వెళ్లిపోవడానికి కారణం అయింది ఎవరు..? నువ్వు కాదా..? అంటూ నిలదీయడంతో అంటే అప్పుడు రేవతి ప్రేమించిన వాడు దక్కకపోతే చచ్చిపోతాను అంటే ఏదో ధైర్యం కోసం అంటూ చెప్పబోతుంటే..


చాల్లే నోరు మూయ్‌ చేసిందే పనికిమాలిన పని మళ్లీ దాన్ని సమర్థించుకుంటున్నావా..? ఇప్పుడు మాట్లాడాల్సింది నువ్వు నేను కాదు.. అపర్ణ. ఇంత మంది రేవతి ఇంటికి రావాలని కోరుకుంటున్నాం.. అపర్ణ కూడా తన నిర్ణయాన్ని మార్చుకోవాల్సింది అపర్ణ అంటూ ఇంద్రాదేవి చెప్పగానే.. అమ్మా అప్పుడెప్పుడో అక్క తప్పు చేసిందని ఇప్పటికి కూడా శిక్ష వేయడం సరి కాదమ్మా. అక్క పెళ్లి చేసకునే సమయానికి నేను చిన్న పిల్లాడిని.. అక్క వెళ్లి పోతుంటే ఆపొచ్చు అనే విషయం కూడా తెలియదు నాకు. మీరందరూ పెద్ద వాళ్లు కదమ్మా అక్క వెళ్లిపోతుంటే ఎందుకు ఆపలేదు. మీకు చెప్పకుండా వెళ్లిపోవడం తప్పే.. కానీ దానికి ఇంత పెద్ద శిక్ష వేయాలా..? ఒక మనిషిని మనం ప్రేమిస్తే వాళ్ల తప్పును కూడా క్షమిస్తే ప్రేమ ఉన్నట్టు.. అని నువ్వే చెప్పావు కదా అమ్మా.. మరి అక్కను ఎందుకు క్షమించలేదు అమ్మ. మనం అందరం ఉండి కూడా అక్క అనాథలాగా ఎక్కడో ఎందుకు ఉండాలి. తన బిడ్డకు ఎవ్వరూ లేరని ఎందుకు చెప్పుకోవాలి చెప్పు అంటూ రాజ్‌ ప్రశ్నిస్తాడు.

కావ్య కూడా అత్తయ్యా తన  తప్పు తాను తెలుసుకుంది. తను ఒక బిడ్డకు తల్లి అయిన తర్వాతే మీరు పడుతున్న బాధలను అర్థం చేసుకుంది. తను కోలుపోయిన తల్లి ప్రేమను తిరిగి పొందాలని ఆశ పడుతుంది. ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి అత్తయ్యా అంటుంది. నువ్వు దూరం పెట్టినప్పటి నుంచి అది ఎక్కడుందో తెలుసుకుని దాని బాగోగులు చూసుకోవాలని నేను మీ మామయ్య కలిసి తనకు ఎన్నో సార్లు డబ్బులు ఇవ్వాలని ప్రయత్నించామే.. కానీ ఇది అమ్మ నాకు వేసిన శిక్ష నేను చేసిన తప్పుకు శిక్ష అనుభవించాలి. అమ్మ నన్ను క్షమించింన రోజే నేను మళ్లీ ఆ ఇంటి బిడ్డను అవుతానని ఆ శిక్ష అనుభవిస్తుందే.. అంటూ ఇంద్రాదేవి చెప్పగానే.. నీ కోపాన్ని పక్కన పెట్టి ఒక్కసారి అక్కను చూడమ్మా.. తన బాధను అర్థం చేసుకుని తనను క్షమించు అమ్మ అంటూ రాజ్‌ చెప్పగానే.. రుద్రాణి కోపంగా అంటే ఏంట్రా ముసుగు వేసుకుని వచ్చి మోసం చేసినా కూడా తనను క్షమించాలా..? అంటుంది.


దీంతో అపర్ణ ముసుగులో ఉన్నది రేవతి అన్న విషయం నాకు తెలుసు.. నా కూతురును నేను గుర్తు పట్టలేనా.? మొదట్లో అది చేసిన పనికి కోపం వచ్చినా.. మెల్లమెల్లగా నాలో బాధ మొదలైంది. కానీ లాస్ట్‌ టైం అది ఇంటికి వచ్చినప్పుడు దాన్ని  చూసేసరికి అది చేసిన తప్పు గుర్తుకు వచ్చి దాని మీద అరిచేశాను. ఎప్పటికీ దాన్ని క్షమించకూడదు అనుకున్నాను. కానీ ఒక రోజు అనుకోకుండా నా మనవణ్ని తీసుకుని తన ఇంటికి వెళ్లాను.. అంటూ రేవతి ఇంటికి స్వరాజ్‌తో వెళ్లిన విషయం చెప్తుంది. రేవతి, జగదీష్‌ ఏడుస్తూ ఎమోషనల్‌ అయిన విషయం గుర్తు చేస్తుంది. ఏడుస్తూ వెళ్లి రేవతిని దగ్గరకు తీసుకుని ఆరోజు నిన్ను చూశాక నీ మాటలు విన్నాక నాలోని కోపం బాధ అన్నీ అక్కడే చచ్చిపోయాయి. ఇన్నేళ్లుగా నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు అర్థం అయింది.

నువ్వు చెప్పింది నిజమేరా ఒక మనిషిని మనం ప్రేమించామంటే వాళ్ల తప్పులను కూడా క్షమించేంత గొప్పగా ప్రేమించాలి. కానీ కన్న కూతురు నాకు చెప్పకుండా పెళ్లి ఎలా చేసుకుంటుంది అనే కోపం నా ప్రేమను కప్పేసింది అనుకుంటా..? అందుకే దూరంగా వెళ్లిపోమ్మని శిక్షించాను.. అంటూ అపర్ణ ఎమోషనల్‌ అవుతుంది.దీంతో రేవతి అమ్మా అంటూ అపర్ణను హగ్‌ చేసకుంటుంది. నువ్వు ముసుగు వేసుకుని వచ్చినంత మాత్రాన నిన్ను  నేను గుర్తు పట్టలేనా..? నేను నీ తల్లినే నువ్వే కాదు.. నీ ఊపిరి తగిలితే పొంగిపోతానే అంటూ అపర్ణ చెప్పగానే.. రేవతి ఏడుస్తూ అపర్ణ కాళ్ల మీద పడుతుంది.

ఇంతలో కావ్య అమ్మో అత్తయ్య మీరు మామూలు మనిషి కాదు నాటకాలు ఆడుతుంది మేము అనుకున్నాం. కానీ మాకు తెలియకుండానే మా వెనక ఇంత పెద్ద నాటకం ఆడారా..? అంటుంది. దాని ముఖం ఎక్క డ బయటపడుతుందో.. నువ్వు ఎక్కడ ఆవేశ పడతావో అని భయపడి చచ్చాను కదే అంటుంది ఇంద్రాదేవి. అందరూ హ్యాపీగా నవ్వుకుంటారు.. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Illu Illalu Pillalu Today Episode: కళ్యాణ్ దగ్గరకు వెళ్తున్న ప్రేమ.. వేదవతి బిల్డప్ కు రామరాజు షాక్.. కళ్యాణ్ కు దిమ్మతిరిగే షాక్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ ను టార్గెట్ చేసిన బాస్.. రాజేంద్ర ప్రసాద్ పై సీరియస్.. పల్లవి ప్లాన్ తెలిసిపోతుందా..?

GudiGantalu Today episode: ప్రభావతి చేత షాప్ ఓపెనింగ్.. స్పెషల్ గెస్టుగా శోభన.. మీనాకు ఘోర అవమానం..

Today Movies in TV : మంగళవారం టీవీల్లోకి మైండ్ బ్లాక్ అయ్యే సినిమాలు.. డోంట్ మిస్..

Illu Illalu Pillalu Today Episode: శ్రీవల్లిని టెన్షన్ పెట్టిన నర్మద.. భాగ్యం ప్లాన్ బెడిసికొట్టేసిందా? కళ్యాణ్ కోరిక తీర్చబోతున్న ప్రేమ..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ పై బాస్ సీరియస్.. భరత్ ను మార్చేసిన పల్లవి.. పెళ్లి రోజుల వేడుక కోసం ఏర్పాట్లు..

GudiGantalu Today episode: రోహిణికి షాకిచ్చిన ప్రభావతి.. మీనా, బాలు రొమాన్స్.. మనోజ్ కు కొత్త కష్టాలు..

Big Stories

×