Nindu Noorella Saavasam Serial Today Episode: రణవీర్ ఫోన్ చేసి చెప్పగానే.. చంభా ఆలోచనలో పడిపోతుంది. ఇక్కడి నుంచి ఎలా పారిపోవాలి అని ఆలోచిస్తుంది. ఇంతలో బాల్కనీలోంచి చీరను కిందకు కట్టుకుని దిగి వెళ్లిపోవాలని ప్లాన్ చేస్తుంది. అలాగే చీరను కట్టుకుని చంభా కిందకు దిగుతుంది. మనోహరిని కూడా దిగమని చెప్తుంది. మనోహరి కన్పీజ్ లో ఉంటుంది. ఇంతలో బాల్కనీలోకి అమర్, మిస్సమ్మ వస్తారు. వాళ్లను చూసిన మనోహరి షాక్ అవుతుంది. మిస్సమ్మ, అమర్ దగ్గరకు రాగానే.. ఇన్నాళ్లకు నీ పాపం పండిపోయిందే.. ఇక నీ పని అయిపోయినట్టే అని మనసులో అనుకుంటుంది. అమర్ మనోహరిని చూస్తూ ఏం చేశావు మనోహరి నువ్వు అని అడుగుతాడు. చాలా చేసిందండి లెక్కకు మించిన తప్పులు చేసింది అని మనసులో అనుకుంటుంది. అమర్ మాత్రం ఏం చేశావు మనోహరి నువ్వు మాకు తెలియకుండా మాకు చెప్పకుండా నువ్వేం చేశావు అని అడుగుతాడు.
మనోహరి టెన్షన్ పడుతుంది. అక్కను చంపిందండి నన్ను కూడా చంపాలనుకుంది. చివరికి పిల్లలను కూడా పొల్యూట్ చేసింది అని మనసులో అనుకుంటుంది. ఆరు చెప్పిందని నిన్ను ఇంట్లో పెట్టుకున్నాను.. ఆరు స్నేహితురాలివి అని నిన్ను అతిథిలా కాకుండా మా ఇంటి సభ్యురాలిగా చూసుకున్నాను అంటాడు అమర్. ఇంకా మాట్లాడతారేంటండి.. దాని చెంప పగులగొట్టకుండా అని మిస్సమ్మ మనసులో అనుకుంటుంది. కానీ నువ్వే చేశావు.. నీ శత్రువులెవరు..? నీ స్నేహితులెవరు.? నీ వెనక ఉన్నది ఎవరు..? నీకు ఎవరెవరితో పరిచయాలు ఉన్నాయి.? నీకు ఎవరెవరికతో గొడవలు ఉన్నాయి.. అసలు ఎవరు నువ్వు అని అమర్ అడగ్గానే.. ఇది హంతకురాలు అండి ఇది నీచమైన దుర్మార్గురాలు దీన్ని చంపినా పాపం లేదు అని మిస్సమ్మ మనసులో అనుకుంటుంది. ఇంతలో మనోహరి భయపడుతూ.. అమర్ అది… అంటూ ఏదో చెప్పబోతుంటే..
అమర్ కల్పించుకుని మనోహరి నువ్వు నా దగ్గర ఏం దాస్తున్నావు..? నాకు నువ్వు చెప్పని విషయం ఏంటి..? ఏం చేశావు నువ్వు.. అని అడగ్గానే.. అమర్ అది అంటూ తడబడుతుంటే.. చెప్పవే రాక్షసి నువ్వు చేసిన పాపాలన్నీ ఒక్కోక్కటి చెప్పు అని మనసులో అనుకుంటుంది మిస్సమ్మ.. రాథోడ్ తీసుకెళ్లిన ఎవిడెన్సులు అన్ని ఎవరో కాల్చేశారు.. ల్యాబ్‌ను ధ్వంసం చేశారు.. అక్కడ నీ ఫోటో ఉందట. అవన్నీ చేసింది ఎవరు..? ఎవరు నీ మీద పగ బట్టారు మనోహరి. ఎవరి నుంచో నీకు థ్రెట్ ఉంది. నువ్వు చేసిన పని ఏదో ఎవరికో ఎఫెక్ట్ అయింది. వాళ్లు నిన్ను చంపాలనుకుంటున్నారు.. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటూ అమర్ చెప్తుంటే.. మిస్సమ్మ షాక్ అవుతుంది. మనోహరికి ఈయన జాగ్రత్తలు చెప్తున్నారేంటి..? అని మనసులో అనుకుంటుంది. అమర్ మాత్రం మనోహరికి జాగ్రత్తలు చెప్తూనే ఉంటాడు.
నా ఇంట్లో ఉన్నంతసేపు నువ్వు సేఫే మనోహరి ఇక్కడ నీకేం కాదు.. ల్యాబ్‌ను కాల్చేసింది ఎవరో..? వెళ్లి తెలుసుకుని వస్తాను భాగీ, మనోహరి జాగ్రత్త అని చెప్పి అమర్ వెళ్లిపోతాడు. మనోహరి కూల్ గా ఊపిరి పీల్చుకుని ఇదంతా రణవీర్ చేసి ఉంటాడా..? నన్ను కాపాడటానికి రణవీరే చేసి ఉంటాడు అని మనసులో అనుకుంటుంది. మిస్సమ్మ మాత్రం కోపంగా మనోహరి నువ్వు మళ్లీ ఏదో చేసి తప్పించుకున్నావు అన్న మాట.. ఈసారి నువ్వు దొరికిపోతావు అనుకున్నాను మనోహరి.. కానీ దొరక్కుండా ఎవిడెన్స్ నాశనం చేశావన్న మాట. ఇంకెన్నాళ్లు ఇలా తప్పించుకుంటావు.. నీ పాపాలను పంచుకుంటున్న నీ పార్ట్ నర్ నిన్ను ఎన్నాళ్లిలా కాపాడతాడు. ప్రతిసారి నీ టైమే నడుస్తుంది అనుకోకు.. నీకు బ్యాడ్ టైం వస్తుంది. తప్పకుండా వస్తుంది అంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది.
కింద నుంచి చంభా పిలవగానే.. నువ్వు అక్కడే ఉండు.. మనిద్దరం కలిసి రణవీర్ దగ్గరకు వెళ్లాలి అంటూ మనోహరి కిందకు పరుగెడుతుంది. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.