Asia cup 2025 : ఆసియా కప్ లో భాగంగా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో ప్రస్తుతం షేక్ హ్యాండ్ వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రధానంగా మ్యాచ్ ముగిసిన తరువాత ప్రత్యర్థిని గౌరవిస్తూ.. షేక్ హ్యాండ్ ఇస్తారు. కానీ ప్రస్తుతం ఇండియా- పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో పహల్గామ్ బాధితులు, కొంత మంది టీమిండియా అభిమానులు ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ ను బాయ్ కాట్ చేయాలని నినాదాలు చేశారు. అయితే వారిని గౌరవిస్తూ.. పాకిస్తాన్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. దీంతో టీమిండియా షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం నిబంధనలకు విరుద్ధమని ఐసీసీకి పీసీబీ ఫిర్యాదు చేసింది. మ్యాచ్ రిఫరీ యాండీ పైక్రాప్ట్ ను తొలగించాలని, లేకపోతే యూఏఈతో మ్యాచ్ ఆడమని పాక్ బెదిరించింది. అయితే పాక్ బెదిరింపులను ఐసీసీ తోసిపుచ్చినట్టు సమాచారం.
Also Read : Shivam Dube: లక్కీ ప్లేయర్ గా మారిన దూబే…32 మ్యాచ్ ల్లోనూ టీమిండియా విజయం..సూపర్ 4కు ఎంట్రీ
షేక్ హ్యాండ్ విషయంలో మ్యాచ్ రిఫరీకి సంబంధం ఉండదు. షేక్ హ్యాండ్ ఇవ్వాలని ఎంసీసీ మ్యాన్ వల్ లో ఏమి లేదని ఐసీసీ చెప్పినట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఈ మ్యాచ్ లో టీమిండియా పాకిస్తాన్ పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ ఫలితం కంటే ఎక్కువగా షేక్ హ్యాండ్ వివాదం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.. ఆపరేషన్ సింధూర్ కంటే ముందు ఇరు జట్లు తలపడినప్పుడు ఆటగాళ్లు ఒకరినొకరూ పలకరించుకునేవారు.. కానీ తాజా మ్యాచ్ లో కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇవ్వకపోవడంతో పాకిస్తాన్ క్రికెటర్లకు అవమానం జరిగినట్టయింది. దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఐసీసీకి ఫిర్యాదు చేసింది. దీనిపై ప్రస్తుతం సోషల్ మీడియాలో షేక్ హ్యాండ్ గురించి చర్చలు జరగడం విశేషం. ప్రధానంగా టాస్ వేసే సమయంలో టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్.. పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా కి షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. అలాగే మ్యాచ్ ముగిసిన తరువాత టీమిండియా ఆటగాళ్లు సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే పాక్ క్రికెటర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా డైరెక్ట్ డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లిపోయారు.
టీమిండియా ఆటగాళ్లు పాకిస్తాన్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం చాలా బాధకరమని పాకిస్తాన్ కోచ్ మైక్ హాసన్ పేర్కొన్నారు. మరోవైపు గ్రౌండ్ లోనే పాకిస్తాన్ జట్టు మేనేజర్ నవీద్ చీమా నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు పీసీబీ.. ఐసీసీకి ఫిర్యాదు చేసింది. వాస్తవానికి షేక్ హ్యాండ్ ఇవ్వాలనే రూల్ అయితే ఏమి లేదని.. ఆటగాళ్లు ఎవరైనా షేక్ హ్యాండ్ చేయాలా..? వద్దా అనేది వారి వ్యక్తిగత నిర్ణయమే. ఐసీసీ రూల్ బుక్ లో మాత్రం ఆటగాళ్లు, సహచరులను, మ్యాచ్ అధికారులను, అంపైర్లను గౌరవించాలని ఉంటుంది. కానీ షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం పెద్ద నేరం అని ఐసీసీ రూల్స్ లో ఎక్కడా ప్రస్తావించలేదు. ఒకవేళ ఆటగాళ్లతో దురుసుగా ప్రవర్తించి.. షేక్ హ్యాండ్ ఇవ్వకుంటే దానిని ఐసీసీ నేరంగా పరిగణిస్తుంది.కానీ టీమిండియా విషయంలో అలా జరుగలేదు. కాబట్టి పాకిస్తాన్ పై ఐసీసీ సీరియస్ అయినట్టు సమాచారం.