Intinti Ramayanam Today Episode November 2nd : నిన్నటి ఎపిసోడ్ లో.. అక్షయ్ చాలా సంతోషంగా ఇంటికి వచ్చి నాకు జాబ్ వచ్చిందని చెప్తాడు.. అందరూ అక్షయ్ కి జాబ్ రావడంతో సంతోషంగా ఉంటారు.. ఏం జాబ్ వచ్చింది అని అడగ్గాని ఫీల్డ్ ఆఫీసర్ జాబ్ వచ్చింది అని అక్షయ్ చెప్తాడు.. ఆ మాట వినగానే శ్రియ అది ఇంటింటికి వెళ్లి బిల్స్ ని కలెక్ట్ చేసుకునే జాబు ఇది ఒక జాబ్ అని వెటకారంగా మాట్లాడుతుంది. మీ ఆయన ఏదో పెద్ద లాయరు సుప్రీంకోర్టు జడ్జ్ అయినట్టు మాట్లాడుతున్నావే అంత పెద్ద లాయర్ ఏంటి ఈపాటికి పాతికమంది ఇంటి దగ్గర క్యూ కట్టే వాళ్ళు కదా అని అంటాడు.
చక్రధర్ తన మొదటి భార్య గుర్తుగా చేతి మీద ఉన్న టాటూ ని తన ఫ్రెండ్ చూసి అడగగానే అసలు నిజం చెప్పేస్తాడు.. ఇక మీనాక్షి ఎక్కడుందో అవని ఆలోచిస్తూ ఉంటుంది. రాజేంద్రప్రసాద్ గతంలో ఉన్న ఇంటికి వచ్చేస్తుంది. అవని ఉంటున్న ఇల్లు ఇదే అనుకుంటాను ఎవరినైనా అడిగి తెలుసుకుందామని మీనాక్షి అంటుంది.. అక్కడున్న ఓ వ్యక్తిని అడిగి ఇది రాజేంద్రప్రసాద్ గారి ఇల్లే అనా అడుగుతుంది.. ఆ వ్యక్తి అవునండి రాజేంద్రప్రసాద్ గారి ఇల్లు కానీ ఇప్పుడు వాళ్ళు ఇక్కడ లేరు నిన్న వేసి ఎక్కడికో వెళ్లిపోయారని అంటారు.. వాళ్లను ఎక్కడ వెతకాలి అని ఆలోచిస్తూ ఉంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ప్రోమో విషయానికొస్తే.. మీనాక్షి ఇక్కడికి వచ్చిందంటే అవనిని కలిసిందేమో తెలుసుకోవాలని వెంటనే రాజేంద్రప్రసాద్ ఇంటికి వెళ్తాడు. చక్రధర్ ని చూసిన పల్లవి నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అడుగుతుంది. నా భర్త బిజినెస్ చేసి బాగుపడతాడు డబ్బులు ఇవ్వమంటే ఇవ్వను పో నీ సమస్యలు నా దగ్గరికి తీసుకురావద్దు అని అంతగా మాట్లాడావు కదా మళ్లీ ఇక్కడికి ఎందుకు వచ్చావు అని పల్లవి అడుగుతుంది.. అదేంటమ్మా పల్లవి నిన్ను చూడడానికే వచ్చాను అని చక్రధర్ అంటాడు. ఒకవైపు అవని ఎంత చెప్తున్నా సరే పల్లవి మాత్రం తన తల్లి ఇంట్లోకి రానివ్వడానికి ఒప్పుకోదు. ఇక మీనాక్షి రాలేదని కన్ఫామ్ చేసుకున్న చక్రధర్ అక్కడ నుంచి బయలుదేరుతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ప్రోమో విషయానికి వస్తే.. అవని ఆఫీస్ కి వెళ్ళాలి ఆరాధ్యను తీసుకురావాలి నేను బట్టలని ఐరన్ చేసుకోవాలి అని తీసుకొని వస్తుంది. అప్పుడే పల్లవి కూడా బట్టలని ఐరన్ చేసుకోవాలని తీసుకొస్తుంది. నేను అర్జెంటుగా వెళ్లాలి పల్లవి నన్ను ముందు అరేంజ్ చేసుకుని ఇవ్వు అని అంటుంది. నాక్కూడా అర్జెంటు పనులున్నాయి నేను కూడా ఐరన్ చేసుకోవాలి నేనే ముందు ఐరన్ చేసుకుంటానని పల్లవి వాధిస్తుంది. అవని ఎంతగా అర్జెంటు అని చెప్తున్నా సరే పల్లవి మాత్రం అస్సలు ఒప్పుకోరు. కావాలనే ఇలా చేస్తున్నావా ఏది నేను చేయాలనుకుంటే దాంట్లో అడ్డుగా వచ్చి పడతావ్ ఏంటి అని అవని అంటుంది. నేను అది అడుగుతున్నాను నేను ఏం చేయాలనుకున్న నువ్వు ఎందుకు అడ్డుగా వస్తున్నావు అని పల్లవి అంటుంది.
అక్కడికొచ్చిన కమల్ ఏమైంది వదిన ఏంటి గొడవ పడుతున్నారు అని అడుగుతాడు. నేను ఆరాధ్యను తీసుకురావడానికి వెళ్లాలి తొందరగా ఐరన్ చేసుకుంటాను అంటే పల్లవి వినడం లేదు కన్నయ్య అని అంటుంది.. సరే వదిన నువ్వు కచ్చితంగా ఐరన్ చేసుకోవాలి అంటే పల్లవి తర్వాతే చేసుకో అని అంటాడు. భార్యను సపోర్ట్ చేయడం అంటే ఇది అని పల్లవి మురిసిపోతుంది. నేనెప్పుడూ నీ మాటే వింటాను కదా వదినా ఈసారి ఒక్కసారి నువ్వు నా మాట విను అని కమలంటాడు. సరే కన్నయ్య పళ్ళు దీన్ని చేసుకొని ఇవ్వు నేను తర్వాత చేసుకుంటాను అని అవని లోపలికి వెళ్ళిపోతుంది.
పల్లవి నేనే గెలిచాను అని సంతోష పడుతూ ఐరన్ చేసుకోవాలని అనుకుంటుంది. అయితే ఐరన్ బాక్స్ పట్టుకోగానే పల్లవికి షాక్ కొడుతుంది. పల్లవి అరుపులు విని అవని కమల్ అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తారు. అయ్యో కన్నయ్య కరెంట్ షాక్ కొట్టినట్టు ఉంది. ఏదో ఒకటి చెయ్యి అని అనగానే నువ్వేం టెన్షన్ పడకు వదినా నేను చేస్తాను అని పల్లవి నీ కర్ర తీసుకొని కొడతాడు. పల్లవి చనిపోలేదని తెలుసుకున్న కమల్ హమ్మయ్య ఇంకా బతికే ఉందా అని అనుకుంటాడు.. అది కరెంట్ షాక్ కొడుతది అందుకే నేను మా వదిన వద్దని నిన్ను చేసుకోమన్నాను.
ఇప్పటికైనా అర్థమైందా? ఏ దాంట్లో వేలు పెట్టి ఏది చేయకుండా ఉంటే మనకు ఏదీకాదు అని అన్ని కమల్ పల్లవికి దిమ్మతిరిగిపోయే షాక్ ఇస్తాడు.. ఇక తర్వాత ఆరాధ్య స్కూల్ నుంచి వస్తూ ఉంటుంది. అక్కడ మీనాక్షి కూర్చొని ఉంటుంది. నాకు బాగా ఆకలేస్తుంది నేను నటించి ఏమీ తినకుండా వెతుకుతున్నాను. ఏదో ఒకటి తినాలి అని అనుకుంటుంది. ఆరాధ్య ఫ్రెండ్స్ నీ దగ్గరే ఏమైనా స్నాక్స్ ఉంటే తీయవే తిందామని అంటారు.. అక్కడ ఒక ఆవిడా కనిపించడంతో ఆరాధ్య ఆవిడకు ఆ స్నాక్స్ ఇస్తుంది. ఇంతకుముందు మిమ్మల్ని ఎక్కడో చూశానండి కానీ గుర్తు కావట్లేదని అవని ఆరాధ్య ఇద్దరు మాట్లాడుకుంటారు..
Also Read : నగలను అమ్మేసిన మనోజ్.. సుశీల కోసం బంగారు చైన్.. అడ్డంగా ఇరుక్కున్న ప్రభావతి..
ఆరాధ్య కోసం అవని వస్తుంది.. అవని వాళ్ళ అమ్మని చూడకుండా ఆరాధ్యని తీసుకొని వెళ్ళిపోతుంది.. ఇక రాత్రి అవ్వగానే చక్రధర్ ఒక రౌడీని పిలిచి మీనాక్షి ఫోటో ఇస్తాడు. ఈమని పట్టుకొని చంపేస్తే నేను నీకు 5,00,000 ఇస్తాను అని రేటు కుదుర్చుకుంటాడు. ఈమె సిటీలో ఎక్కడున్నా సరే వెతికి పట్టుకొని మీకు కాల్ చేస్తానని ఆ రౌడీ అంటాడు. మీనా నా మొదటి భార్య అవని భరత్ నా పిల్లలు ఈ విషయాన్ని బయటికి రాకుండా ఉండాలంటే మీనాక్షి చచ్చిపోవాల్సిందే అని అనుకుంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో చక్రధర ప్లాన్ వర్క్ అవుట్ అవుతుందా..? అవని తన తల్లిని సేఫ్గా తన ఇంటికి తీసుకొస్తుందా..? పల్లవి తండ్రిని అవని తండ్రి అని తెలుసుకుంటుందా అన్నది చూడాలి…