Illu Illalu Pillalu Today Episode November 2nd : నిన్నటి ఎపిసోడ్ లో.. పోలీస్ స్టేషన్ కి వచ్చిన అమ్మాయి ధీరజ్ అన్నయ్య నన్ను కాపాడేడు అని అందరితోనూ చెబుతుంది. నాన్న తప్పుగా అర్థం చేసుకున్నాడు నన్ను క్షమించు అన్నయ్య అని అంటుంది. ఒంటరిగా వెళ్లొద్దని నేను అందుకే చెప్పాను ఇలాంటి ఎదవలు ఏదో ఒకటి చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. నీకు ఎంత చెప్పినా నువ్వు అని కూతురిపై ఆ తండ్రి అరుస్తారు. నేను చెప్పాను కదండీ నా కొడుకులు ఎవరు ఏ తప్పు చేయరు నేను అలా పెంచాను అని.. అమ్మాయి విషయంలో నా కొడుకులు ఎప్పుడూ తప్పు చేయరు అని రామరాజు అంటాడు..నా కొడుకుల అలాంటివారు కాదు ఇప్పటికైనా అర్థం చేసుకోండి అని ఎస్సై పై సీరియస్ అవుతాడు రామరాజు.. ఒక తండ్రి వచ్చి తన కూతుర్ని కిడ్నాప్ చేశారు అని అంటే మేము కచ్చితంగా ఎవరినైనా అనుమానించాల్సి వస్తుంది సార్.. ఈ క్రమంలో అబ్బాయిని కొట్టాల్సి వచ్చింది అంటాడు. మొత్తానికి ధీరజ్ ను తీసుకొని ఇంటికి వెళ్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ప్రోమో విషయానికొస్తే.. రామరాజు కొడుకు జైలుకు వెళ్తున్నాడనే సంతోషంలో భద్ర కుటుంబం సంతోషంతో దీపావళి సంబరాలను చేసుకుంటున్నారు. అప్పుడే రామరాజు కుటుంబం అక్కడికి వస్తుంది. వాళ్ల మొహాల్లో సంతోషం చూసి సేన ఫ్యామిలీ షాక్ అవుతారు. అమ్మాయిలను నమ్మించి మోసం చేస్తాడు అని నానా మాటలు అన్నారు కదా నా కొడుకు ఏ రోజు తప్పు చేయడు నేను అలా పెంచాను అని రామరాజు అంటాడు.. నేనెప్పుడూ పొరపాటు చేయను రా నా కొడుకులు అలాంటి వాళ్ళు కాదు ఆపదలో ఉన్న అమ్మాయిలని ఆదుకొని అన్నలాగా నిలబడతారు అది గుర్తుపెట్టుకోండి అని రామరాజు సేన వాళ్ళ కుటుంబంతో అంటాడు.
మనం సంతోషం అందరికి తెలిసేలా.. అవతల వాళ్లు కుళ్ళుకొనేలా బాంబులను పేల్చాలి. ఇప్పుడు పేల్చండి రా మతాబులు. అవతలి వాళ్ళు చెవులు పగిలిపోయేలా ఆకాశం దద్దరిల్లెల పేల్చండి అని రామరాజు అంటాడు. వాళ్ళ సంతోషాన్ని చూసిన భద్ర విశ్వం నీ పక్కకు తీసుకొని వెళ్లి ఈ సంతోషాన్ని నేను చూడలేకున్నాను రా నాకు చాలా అసూయగా ఉంది అని అంటుంది. రామరాజు ఇంతగా నవ్వుతూ ఉండటం చూసి నాకు కోపం వస్తుంది ఏదో ఒకటి చేయాలి రా అని అంటాడు.
అయితే నువ్వు ఆ ఇంటిని విడగొడితేనే ఆ సంతోషం దూరమైపోతుంది.. అమూల్యని తొందరగా నీ ట్రాప్ లోకి తీసుకొచ్చి పెళ్లి చేసుకో.. అప్పుడే ఆ ఇంట్లో వెలుగులు సంతోషాలు దూరం అవుతాయి అని భద్ర అంటుంది. త్వరలోనే అది జరుగుతుందట రేపే మంచి ప్లాన్ వేస్తున్నానని విశ్వం అంటాడు. ఏదో ఒకటి చేసి ఆ ఇంట్లో ఆ సంతోషాన్ని దూరం చేయాలి. కుటుంబాన్ని చిన్నా భిన్నం చేయాలి అని భద్ర విశ్వం మాస్టర్ ప్లాన్ వేస్తారు.. మనము ఆ రామరాజుకి ఇంక నవ్వు అనేది కనిపించకుండా చేయాలి.. ఆ ఇంట్లోని వాళ్లందర్నీ విడగొడితే ఆ నవ్వు దూరమవుతుంది నువ్వు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేయాలి రా విశ్వం అని భద్ర అంటుంది..
ఆ తర్వాత ప్రేమ ధీరజ్ ఇద్దరు కూర్చుని చాలా సంతోషంగా మురిసిపోతూ ఉంటారు.. ఏంటి ఏమైంది అంత సంతోషంగా ఉన్నావేంటి అని ప్రేమను ధీరజ్ అడుగుతాడు.. నిజంగా ఇది సంతోషించాల్సిన విషయమే కదా అని ప్రేమ అంటుంది.. అవును నిజమే నేను కచ్చితంగా జైలుకు వెళ్ళిపోతానని అనుకున్నాను. ఏమి చేయలేని పరిస్థితి. నువ్వు ఆ టైంలో అలా చేసి ఉండకపోతే ఖచ్చితంగా నేను ఈపాటికి జైల్లో ఉండేవాణ్ణి అని ధీరజ్ అంటాడు. ఇకపోతే మనం ఇలా ఎప్పుడు కొట్టుకుంటూ కాకుండా ఫ్రెండ్స్ లాగా ఉండి పోదామా అని ప్రేమ అడుగుతుంది.
Also Read:ఎయిర్ హోస్టెస్ జాబ్.. అమ్మకు ఇష్టం లేకుండానే ఆ పని చేశాను.. పెళ్లి అప్పుడే..?
సరే మనం ఇప్పటినుంచి ఫ్రెండ్స్ అని ప్రేమ ధీరజ్ లో అనుకుంటారు. చిన్నప్పుడు విషయాలను గుర్తు చేసుకుంటూ ఉంటారు. చిన్నప్పటినుంచి మనం ఒకరంటే ఒకరు ద్వేషంతో పెరిగాము.. ఇప్పుడు ఫ్రెండ్స్ అయ్యాము అంటే ఏదోలా ఉంది అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. మొత్తానికైతే ధీరజ్ నేను మళ్ళీ ఉడికించేలా చేస్తుంది ప్రేమ. నేను నీ మీద ప్రేమతో ఏమీ చేయలేదు నీ ప్లేస్ లో వేరే వాళ్ళు ఉన్నా కూడా ఇదే పని చేస్తాను అని ప్రేమ అనడంతో ధీరజ్ షాక్ అవుతాడు. ఆ తర్వాత సాగర్ నర్మదను పొగడ్తల వర్షం కురిపిస్తాడు. ఇక నర్మదా బెడ్ పై పడుకొని సాగర్ చేత సేవలు చేయించుకుంటుంది. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది.. సోమవారం ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..