BigTV English

Brahmamudi Serial Today September 20th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: డాక్టర్‌ ను తిట్టిన రాజ్‌ – రాజ్‌ను ఓదార్చిన కళ్యాణ్‌    

Brahmamudi Serial Today September 20th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: డాక్టర్‌ ను తిట్టిన రాజ్‌ – రాజ్‌ను ఓదార్చిన కళ్యాణ్‌    

Brahmamudi serial today Episode: కళ్యాణ్‌, రాజ్‌ డాక్టర్‌ దగ్గరకు వెళ్తారు. తల్లిని బిడ్డను కాపాడటానికి ఏదైనా చిన్న కారణం ఉందా అని అడుగుతారు. దీంతో డాక్టర్‌ సీరియస్‌ అవుతుంది. మీరేంటండి మళ్లీ మొదటికి వచ్చారు. తల్లీ బిడ్డను కాపాడమంటున్నారు. ఆ ఆప్షన్‌ లేకే ఒక డాక్టర్‌ అయ్యుండి కూడా ఈ ఆప్షన్‌ చెప్పింది.. అంటుంది. కానీ బిడ్డను వదులుకోలేకే కదా డాక్టర్‌ మళ్లీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేసింది అంటాడు రాజ్‌. అయితే మీ భార్య ప్రాణాలతో ఆడుకుంటారా..? అని అడుగుతుంది. నేను కళావతి ప్రాణాలతో ఆడుకోవాలని ఇలా అడగడం లేదు డాక్టర్.. తన ఆనందాన్ని దూరం చేయకూడదనే ఇలా అడుగుతున్నాను. పాపం పిచ్చిది నన్ను పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి ఎన్నో ఇబ్బందులు పడింది. కాదు నేనే ఇబ్బంది పెట్టాను. ఇన్ని రోజులు తనకు కన్నీళ్లు తప్ప ఇంకేం మిగల్లేదు డాక్టర్‌. కానీ ప్రెగ్నెంట్‌ అయిన దగ్గర నుంచి తను చాలా సంతోషంగా ఉంది. ఈ సమయంలో తన దగ్గరకు వెళ్లి నీ కడుపులో బిడ్డను తీసేయాలి అని ఎలా చెప్పగలను.. అంటూ రాజ్‌ ఎమోషనల్‌ అవుతాడు.


దీంతో డాక్టర్‌.. చూడండి రాజ్‌ గారు మీ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను. కానీ  ఈ విషయంలో మనం ఏదైనా చేయగలిగింది ఉంది అంటే అది ఒక్క అబార్షనే.. కావ్య గర్బ సంచి చాలా వీక్‌ గా ఉంది. తను ఎక్కువ రోజులు బిడ్డను క్యారీ చేస్తే తన ప్రాణాలకే ప్రమాదం అంటూ డాక్టర్‌ చెప్పగానే.. అది కాదు డాక్టర్‌ ప్రతి ప్రాబ్లమ్‌ కు ఏదో ఒక సొల్యూషన్‌ ఉన్నట్టే ఈ సమస్యకు కూడా ఏదో ఒక పరిష్కారం ఉండొచ్చు కదా అని అడగ్గానే.. డాక్టర్ కోపంగా రాజ్‌ గారు పిచ్చి పిచ్చిగా మాట్లాడతారేంటి..? కళావతికి అబార్షన్‌ చేయడం తప్పా ఇంకే ఆప్షన్‌ లేదు.. అది కూడా ఇప్పుడు చేస్తేనే తను బతుకుతుంది. తల్లీ బిడ్డలు చనిపోతారంటే అర్థం కావడం లేదేంటి అంటుంది డాక్టర్‌. దీంతో రాజ్‌ కోపంగా మీకే అర్థం కావడం లేదు.. అంటూ డాక్టర్‌ను పిచ్చిపిచ్చిగా రాజ్‌ తిడతాడు. దీంతో డాక్టర్ కూడా  రాజ్‌ ను తిడతుంది. దీంతో రాజ్‌ పిచ్చి పట్టిన వాడిలా డాక్టర్‌ రూమ్‌లో వస్తువులు అన్ని పడేస్తాడు. తల్లీబిడ్డను ఎలాగైనా కాపాడుకుంటాను అని చెప్పి రాజ్ వెళ్లిపోతాడు.

బయటకు వచ్చిన రాజ్‌ కోపంగా ఇది అసలు హాస్పిటలే కాదు.. వాళ్ల అసలు డాక్టర్లే కాదు.. లేకపోతే ఒక్కరే బతుకుతారని చెప్తాడా..? అంటూ ఆవేశపడుతుంటే.. కళ్యాన్‌ ఆగు అన్నయ్యా ఆగు అంటూ ఓదారుస్తుంటాడు. ఏంట్రా ఆగేది ఆగి ఏం చేయమంటావు.. వాళ్లు చెప్పిందంతా విని ఓకే డాక్టర్‌ ఓకే డాక్టర్‌ అంటూ తలూపాలా..? అంత కచ్చితంగా చెప్పడానికి వాళ్లైమైన కాలజ్ఞానం తెలిసిన బ్రహ్మం గారా.. అంటూ కోప్పడుతుంటాడు. దీతో కళ్యాణ్‌ అన్నయ్య నీ బాధ నాకు అర్థం అయింది కానీ కాస్త ప్రాక్టికల్‌ గా ఆలోచించు అంటాడు కళ్యాన్. ఏంట్రా ప్రాక్టికల్‌ గా ఆలోచించేది.. నేను వెల్లి కళావతికి ఈ విషయం చెప్పి తనకు అబార్షన్‌ చేయించాలా..? అసలు నేనే ముందు ఒప్పుకోనురా.. అంటాడు రాజ్‌. తప్పదు అన్నయ్య ఒప్పుకోవాలి. ఈ హాస్పిటల్ ఈ సిటీలోనే మంచి పేరున్న హాస్పిటల్‌ డాక్టర్‌ కూడా మనకు తెలిసిన వారే అన్నయ్య.. వాళ్లు ఏ ప్రాబ్లం లేకపోతే ఎందుకు అలా చెప్తారు. ఏ డాక్టర్‌ అయినా ఒక ప్రాణాన్ని నిలబెట్టాలనే చూస్తారు కానీ పొగొట్టాలని చూడరు కదా అన్నయ్య అంటాడు.


కళ్యాణ్‌ ఎవరు ఏం చెప్పినా సరే నాకు తల్లీబిడ్డ ఇద్దరూ కావాలి.. ఇంత ఆస్థి పెట్టుకుని తల్లీ బిడ్డను కాపాడుకోలేకపోతే ఇంకెందుకురా ఇదంతా ఇద్దరూ బతుకుతారు.. ఇద్దరినీ బతికించుకుంటాను.. అయినా ఆ డాక్టర్‌ కు ఏమైనా లూజా రా.. అసలు ప్రయత్నం చేయకుండానే రిజల్ట్‌ చెప్పేస్తుంది. కళ్యాణ్ నీకు తెలిసిన చాలా మంది డాక్టర్లు ఉన్నారు కదా వాళ్లందరికీ ఫోన్‌ చేయ్‌ అని చెప్తాడు రాజ్‌. అన్నయ్య తను నీకు భార్య అయితే నాకు వదిన అన్నయ్య.. నాకు అమ్మ అన్నయ్య.. నేను చాలా ప్రయత్నాలు చేశాను అన్నయ్య.. స్పెషలిస్టులతో కూడా మాట్లాడాను ఈ డాక్టర్లు చెప్పిందే వాళ్లు చెప్పారు అంటూ కళ్యాణ్‌ చెప్పగానే.. రాజ్‌ ఆలోచనలో పడిపోతాడు.

ఇక మరోవైపు రాహుల్‌ బయట పని చేసి వచ్చినట్టు స్వప్నను నమ్మించాలనుకుంటాడు. అందుకోసం తన కూలీ డబ్బులు కూడా స్వప్నకు ఇస్తాడు. దీంతో స్వప్న ఫస్ట్‌ టైం నిన్ను చూస్తుంటే ఒక భర్తలా కనిపిస్తున్నావు అంటుంది స్వప్న దీంతో పడింది బుట్టలో అని రాహుల్ అనుకుంటాడు. నీ ఈ మార్పుకు కారణం ఏంటి అని అడుగుతుంది దీంతో రాహుల్ నా కూతురు అంటూ రాహుల్ ఎమోషనల్ డైలాగ్స్‌ చెప్తాడు. దీంతో స్వప్న నిజంగానే వీడిలో మార్పు వచ్చిందా..? అని మనసులో అనుకుంటుంది.

మరోవైపు రాజ్‌ కోపంగా లేదురా ఆ డాక్టర్స్‌ అందరూ అబద్దం చెప్పారు. ఇక నేనే కనుక్కుంటాను అంటూ తెలిసిన డాక్టర్‌ కు ఫోన్‌ చేస్తాడు. విషయం చెప్తాడు. రిపోర్ట్స్‌ పంపించమని డాక్టర్‌ చెప్పగానే.. రాజ్‌ రిపోర్ట్స్‌ పంపిస్తాడు. అవి చూసిన డాక్టర్‌ వెంటనే రాజ్‌కు ఫోన్‌ చేసి ఆ డాక్టర్‌ చెప్పింది కరెక్టేనని వదిన ఆ బిడ్డను క్యారీ చేస్తే ఇద్దరినీ కాపాడుకోలేము అని చెప్తాడు. దీంతో రాజ్‌ పిచ్చిపిచ్చిగా ఆ డాక్టర్‌ను కూడా తిడతాడు. దీంతో కళ్యాన్‌ రాజ్‌ను తీసుకుని ఇంటికి బయలుదేరుతారు. తర్వాత ఇంటికి వచ్చిన రాజ్‌ను సుభాష్‌ ఆఫీసుకు వెళ్లమని చెప్తాడు. దీంతో తనకు మూడ్ లేదని రాజ్‌ చెప్తాడు. దీంతో వెళ్తే మూడ్‌ అదే వస్తుంది కానీ అంటూ రాజ్‌ను వెళ్లమని చెప్పగానే.. నాకిప్పుడు మూడ్‌ లేదంటే ఎందుకు బలవంతం చేస్తున్నారు అంటూ అరుస్తాడు దీంతో అందరూ షాక్‌ అవుతారు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Nindu Noorella Saavasam Serial Today September 20th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌, మిస్సమ్మల మధ్య రొమాన్స్‌     

Illu Illalu Pillalu Today Episode: రామరాజుకు ప్రేమ గురించి తెలుస్తుందా..? కాలేజీలో ప్రేమకు షాక్.. శ్రీవల్లికి అనుమానం..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ ను ట్రాప్ చేసిన పల్లవి.. ఫంక్షన్ లో రచ్చ రచ్చ.. పల్లవికి దిమ్మతిరిగే షాక్..

GudiGantalu Today episode: రోహిణి షాకిచ్చిన శృతి.. ఊహించని ట్విస్ట్.. ప్రభావతికి క్లాస్ పీకిన సత్యం..

Today Movies in TV : శనివారం అస్సలు మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమాలు.. అవే స్పెషల్..

Illu Illalu Pillalu Today Episode: ప్రేమ రహస్యం శ్రీవల్లికి తెలిసిపోతుందా? నర్మద దెబ్బకు మైండ్ బ్లాక్.. కళ్యాణ్ కోసం ధీరజ్ వేట..

Intinti Ramayanam Today Episode: మారిపోయిన భరత్.. ప్రణతికి మొదలైన అనుమానం.. దొరికిపోయిన కమల్…

Big Stories

×