BigTV English

Brahmamudi Serial Today September 25th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: సామంత్‌ కంపెనీలోకి కావ్య – స్వరాజ్‌ కంపెనీని పడగొట్టేందుకు అనామిక ప్లాన్‌

Brahmamudi Serial Today September 25th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: సామంత్‌ కంపెనీలోకి కావ్య – స్వరాజ్‌ కంపెనీని పడగొట్టేందుకు అనామిక ప్లాన్‌

Brahmamudi serial today Episode :  అపర్ణను పలకరించడానికి వచ్చిన కనకాన్ని రుద్రాణి ఘోరంగా అవమానిస్తుంది. మళ్లీ ఏ ముఖం పెట్టుకుని వచ్చావు అంటూ తిడుతుంది. ఏదో ఒక సాకు చూపించి నీ కూతురిని మళ్లీ ఈ ఇంట్లో వదిలి వెళ్లడానికి ప్లాన్‌ చేశావా అంటుంది. అసలు నీ కూతురుతో  మళ్లీ రాజ్‌ కాపురం చేస్తాడని ఎలా అనుకున్నావు అంటుంది. అందరూ షాక్‌ అయి చూస్తుంటారు. అపర్ణ మధ్యలో అడ్డుపడినా రుద్రాణి ఆగదు. నీకు తెల్వదు వదిన వీళ్ల గురించి అంటూ తిడుతూనే ఉంటుంది. అయినా కనకం ఏమీ మాట్లాడకుండా అపర్ణ దగ్గరకు వెల్లి ఆరోగ్యం ఎలా ఉందని పలకరిస్తుంది.


అపర్ణ బాగానే ఉందని చెప్పినా.. ఇంకా మీ ముఖంలో అలసట కనిపిస్తుందని చెప్తుంది. మీరు ఎవరి మాటలు పట్టించుకోకుండా ఎవ్వరి గురించి ఆలోచించకుండా ఉండండి అని చెప్తుంది కనకం. దీంతో ఇదేదో మంచి మాటలు చెప్పి వీళ్ల దృష్టిలో మంచిది అనిపించుకోవాలనుకుంటుంది. ఏదో ఒకటి చేసి ఈ కనకాన్ని ఇక్కడి నుంచి వెళ్లిపోయేలా చేయాలనుకుంటుంది. ఇక జన్మలో కావ్యను ఈ ఇంటికి పంపించను అనుకునేంతగా దీన్ని తిట్టాలి అని మనసులో అనుకుంటుంది రుద్రాణి. వెంటనే నీ కూతురేమో మా వదిన ఈ పరిస్థితికి కారణం అయింది. నవ్వేమో ఏమీ ఎరుగని నంగనాచిలా వచ్చి పలకరిస్తాన్నావా? కనకం అంటూ నువ్వెన్ని నాటకాలు ఆడినా నిన్ను నమ్మే వాళ్లు ఎవరూ లేరిక్కడ అంటుంది. నువ్వు ఎన్ని ఆశలు పెట్టుకున్నా నీ కూతురిని రాజ్‌ మళ్లీ తన జీవితంలోకి రానివ్వడు అంటుంది రుద్రాణి.

నాది ఆశ కాదు రుద్రాణి గారు  నమ్మకం. ఆ నమ్మకం ఇక్కడికి వచ్చాకా మరింత బలపడింది. నా కూతురుకు అల్లుడికి ఉన్న బంధం ఇంకా తెగిపోలేదు అనడానికి రాముడి పక్కన కాంచన సీత లాగా నా అల్లుడి పక్కన ఉన్న నా కూతురి చీరే సాక్ష్యం. ఇంకొక విషయం అది భగవంతుడి సంకల్పం తప్పా మానవ మాత్రులెవ్వరూ చేయలేనిది ఇక్కడ జరిగింది అంటుంది. కనకం. దీంతో వెటకారంగా అవునా.. ఏంటది అని అడుగుతుంది రుద్రాణి.  నా కూతురు తన చేతులతో చేసిన వినాయకుడి విగ్రహం మీ ఇంటికే వచ్చి చేరింది.  అది ఎవరు ప్లాన్‌ చేస్తే జరిగింది. నా కూతురు చేసిన దేవుడే ఈ ఇంటికి చేరాడు. అలాంటప్పుడు  నా కూతురు రాదా?


కావ్య ఎవరి కోసమో ఈ విగ్రహం చేసింది. కానీ ఎవరింటికి రావాలని ఎవరు నిర్ణయించారు. ఏ బంధం ఇక్కడికి చేర్చింది. బయట వేల కొద్ది వినాయక విగ్రహాలు అంగట్లో పెట్టి అమ్ముతున్నారు. కానీ నా కూతురు రాత్రంతా మేలుకొని కష్టపడి తయారు చేసిన ఆ స్వామి మీ ఇంటికి నడిచి వచ్చాడు ఇదే ఆ స్వామి లీల. ఇక ఆయన  వచ్చాడు కదా విఘ్నాలన్నీ తొలగించి నా కూతురు కాపురాన్ని కచ్చితంగా నిలబెడతాడు అంటుంది కనకం. దీంతో అపర్ణ, ఇందిరాదేవి, స్వప్న, సుభాష్‌, ప్రకాష్‌ హ్యాపీగా ఫీలవుతారు. రాహుల్‌, రుద్రాణి షాక్‌ అవుతారు. రాజ్‌ మాత్రం ఆశ్చర్యంగా చూస్తుండిపోతాడు. ఇక తాను వెళ్తానని చెప్పి కనకం వెళ్లిపోతుంది. ఇందిరాదేవి సంతోషంగా రాజ్‌ ను పిలిచి చూశావా రాజ్. అది కావ్య తయారు చేసిన విగ్రహమట. నీవు పదివేలు పెట్టి తీసుకొచ్చింది. అంటే నీది కావ్యది విడదీయరాని బంధం మీది కలకాలం ముడిపడే బ్రహ్మముడి అని చెప్తుంది.

సామంత్‌ కంపెనీ పెట్టుబడితో నడుస్తున్న చిన్న కంపెనీలో కావ్యకు జాబ్‌ వచ్చేలా చేస్తుంది అనామిక. డైరెక్ట్‌ సామంత్‌ కంపెనీకే అంటే కావ్య ఒప్పుకోదని అలా నాటకం ఆడి కావ్యను సామంత్‌ కంపెనీ కోసం ఇన్‌డైరెక్టుగా వర్క్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తుంది. ఇంతలో ఆఫీస్‌ బాయ్‌ వచ్చి సార్‌ కావ్య అని ఎవరో మీకోసం వచ్చారు మీ క్యాబిన్‌ లో కూర్చోబెట్టాను అంటాడు. మేనేజర్‌ సరే అని క్యాబిన్‌ లోకి వెళ్లి కావ్యను ఇంటర్వూ చేసి జీతం తక్కువ ఇస్తామని చెప్తాడు. దీంతో కావ్య సరే అంటుంది. అయితే మీరు రేపే వచ్చి జాబ్‌ లో జాయిన్‌ కావొచ్చు అని చెప్పడంతో కావ్య హ్యాపీగా వెళ్లిపోతుంది.

ఇంటికి వెళ్లిన కావ్య సంతోషంగా కనకం, మూర్తిలకు తనకు జాబ్‌ వచ్చిందని చెప్పడంతో  మూర్తి సంతోషిస్తాడు. కనకం మాత్రం ఏమీ పలకదు. దీంతో ఎందుకమ్మా నువ్వేమీ మాట్లాడటం లేదు అని అడుగుతుంది. దీంతో కనకం నీకు చెప్పేంత దాన్ని కాదమ్మా నేను అంటుంది. ఆడదానికి జాబ్‌ వచ్చిందంటే ఇక అత్తింటితో అవసరం లేదని అర్థం. అత్తింటితో అవసరం లేనప్పుడు భర్త, కాపురం వేటినీ లెక్క చేయరు అంటూ కనకం చెప్తుంటే.. కావ్య బాధపడుతుంది. ఈ సవంత్సర కాలంలో తాను అక్కడ ఎదుర్కొన్న కష్టాల, బాధలు చెప్తూ ఎమోషనల్‌ అవుతుంది కావ్య.

సీతారామయ్య స్నేహితుడు దుగ్గిరాల ఇంటికి వచ్చి మీ కంపెనీతో మా కంపెనీ కలిసి చేసే బిజినెస్‌ ఇక నుంచి ఆపేయాలని అనుకుంటున్నట్టు చెప్తాడు. ఎందుకని సీతారామయ్య అడగగానే దానికి కారణం రాహుల్‌ అని నా మనవడు శ్రీకాంత్‌ మీ ఆఫీసుకు వెళ్లితే రాహుల్‌ రెస్పెక్ట్‌ లేకుండా మాట్లాడారని అందుకే డీల్‌ క్యా్న్సిల్‌ చేసుకున్నట్లు చెప్తాడు. ఇంతటితో ఇవాళ్టీ బ్రహ్మముడి సీరియల్ ఏపిసోడ్‌ కు ఎండ్‌ కార్డు పడుతుంది.

Tags

Related News

Illu Illalu Pillalu Today Episode: ప్రేమ, నర్మదను అడ్డంగా ఇరికించిన శ్రీవల్లి..పరువు తీసిన భాగ్యం..అమూల్యతో విశ్వం..

Intinti Ramayanam Today Episode: అడ్డంగా దొరికిపోయిన పల్లవి.. షాకిచ్చిన చక్రధర్..పల్లవిని గెంటేస్తారా..?

GudiGantalu Today episode: ప్రభావతి షాకిచ్చిన బాలు.. మీనాతోనే ఆ పని..రోహిణికి కడుపు మంట..

Brahmamudi Serial Today October 11th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కావ్య కోసం కనకం ఇంటికి వెళ్లిన రాజ్‌

Nindu Noorella Saavasam Serial Today october 11th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆరుకు షాక్‌ ఇచ్చిన మంగళ

Today Movies in TV : శనివారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. వీటిని మిస్ అవ్వకండి..

Gundeninda Gudigantalu Prabhavathi: ‘గుండెనిండా గుడిగంటలు ‘ ప్రభావతి రియల్ లైఫ్.. అస్సలు ఊహించలేదు..

Mogalirekulu Devi : ‘మొగలిరేకులు’ దేవి ఇండస్ట్రీకి దూరం అవ్వడానికి కారణం ఇదే..?

Big Stories

×