BigTV English

Brahmamudi Serial Today September 27th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: అనామికను రెచ్చగొట్టిన రుద్రాణి – కావ్యను చూసి ఎమోషనల్‌ అయిన కృష్ణమూర్తి

Brahmamudi Serial Today September 27th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: అనామికను రెచ్చగొట్టిన రుద్రాణి – కావ్యను చూసి ఎమోషనల్‌ అయిన కృష్ణమూర్తి

Brahmamudi serial today Episode :  ఆఫీసుకు వెళ్తున్న కూతురు కావ్యను టిఫిన్‌ చేసి వెళ్లమంటుంది కనకం. తనకు టైం లేదని లంచ్‌ బాక్స్‌ ఒక్కటే తీసుకుని ఆఫీసుకు వెళ్తుంది కావ్య. అయితే ఇవాళ చేసిన టిఫిన్‌ అంతా నేనే తినాలా అంటూ ఆలోచిస్తుంది కనకం. బయట గుమ్మం దగ్గర కావ్యను ఆపిన కృష్ణమూర్తి. ఆఫీసుకు వెళ్లడానికి ఆటోకు డబ్బులు ఉన్నాయా కావ్య అని అడుగుతాడు.  ఉన్నాయి నాన్న అని కావ్య అబద్దం చెప్తుంది.


వెంటనే కృష్ణమూర్తి  ఇంకా ఎన్ని రోజులు మా కష్టాలు అర్థం చేసుకుని బతుకుతామమ్మా.. ఆఫీసుకు నడుచుకుంటూ వెళ్దామనుకున్నావా? అంటూ తన జేబులోంచి డబ్బులు తీసి కావ్యకు ఇస్తాడు. కావ్య  కన్నీరు పెట్టుకుంటుంది. జాగ్రత్తగా వెళ్లి రా అమ్మా అని కావ్యను పంపిస్తూ కృష్ణమూర్తి ఎమోషనల్‌ అవుతాడు. కావ్య వెళ్లిపోయాక లోపలి నుంచి కనకం వచ్చి.. దానికి బుద్ది చెప్పి కాపురానికి పంపించాల్సిన మీరే ఉద్యోగానికి పంపిస్తున్నారా? అంటూ ప్రశ్నిస్తుంది.

ఆఫీసుకు వెళ్లడానికి రెడీ అయి కిందకు వచ్చిన రాజ్‌ అపర్ణను ఆశీర్వదించమని అడుగుతాడు. దీంతో ఫస్ట్‌  మీ నాన్నమ్మ ఆశీర్వాదం తీసుకోరా అంటుంది. ఇద్దరి ఆశీస్సులు తీసుకుని వెళ్తున్న రాజ్‌తో అపర్ణ.. జరగవు అనుకున్నవన్నీ జరుగుతున్నాయి. అంటే ఏదీ ఎవరి చేతుల్లో ఉండదని గుర్తుపెట్టుకో.. అయితే కాలమైన సమస్యలు తీరుస్తుంది. లేదా భగవంతుడైనా తీరుస్తాడు.


కళ్యాణ్‌ ఇంటికి వచ్చేదాకా నువ్వు ఆఫీసుకు వెళ్లొద్దు అన్నవాళ్లే ఇప్పుడు నిన్ను ఆఫీసుకు వెళ్లమన్నారు. అలాగే నువ్వు మళ్లీ నీ చేతులతోనే కావ్యను ఇంటికి తీసుకురావాలి.  తీసుకొస్తావు అంటుంది. రేయ్‌ నువ్వు మళ్లీ కంపెనీ బాధ్యతలు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మన కంపెనీకి ఉన్న పేరును నిలబెట్టు రాజ్‌ అంటుంది ఇందిరాదేవి. ఇక  ఎలాగూ ఆఫీసుకు వెళ్తున్నావు కదా? దారిలో గుడి ఉంది వెళ్తూ వెళ్తూ ఆ దేవుడి ఆశీర్వాదం కూడా తీసుకో రాజ్‌ అని చెప్తుంది అపర్ణ. సరే మమ్మీ అనుకుంటూ రాజ్‌ వెళ్లిపోతాడు.

హాల్లో జరిగిన తతంగం అంతా చూసిన రుద్రాణి కోపంగా లోపలికి వెళ్లి అనామికకు ఫోన్‌ చేస్తుంది. నువ్వేదో చేస్తానన్నావు. ఇవతల రాజ్‌ కంపెనీ బాధ్యతలు తీసుకోబోతున్నాడు. ఆఫీసుకు వెళ్లాడు. నువ్వు మాత్రం ఏం చేయలేకపోతున్నావు. అసలు నీ ప్లానేంటి అనామిక అని అడుగుతుంది రుద్రాణి. నేను చేసేది చేశాను ఆంటీ.. ఇక చూస్తూ ఉండు. ఇప్పటికే నా ప్లాన్‌ వర్కౌట్ అయింది.  స్వరాజ్‌ కంపెనీకి పోటీగా కావ్యను దించుతున్నాను అని అనామిక చెప్పగానే.. ఆ కావ్య మనలాగా డబ్బుకు కకృతి పడేది కాదు. ఎలా ఒప్పుకుంది అని అడుగుతుంది రుద్రాణి. వేరే కంపెనీ ద్వారా కావ్యను రంగంలోకి దించాను ఇక భార్యాభర్తల షో ప్రారంభం కానుంది అని చెప్తుంది.

అపర్ణ చెప్పినట్టు గుడికి వెళ్లిన రాజ్‌ ఆలయంలో గంట కొట్టబోతాడు. ఇంతలో అదే గంటను కొట్టడానికి ఎవరో పట్టుకుంటారు. రాజ్‌ తిరిగి చూస్తే అక్కడ కావ్య ఉంటుంది. దీంతో ఇరిటేటింగ్‌ గా రాజ్‌ గంట పట్టుకోగానే  గొగళి పురుగు పాకిందా? అనుకున్నాను నువ్వా.. అంటాడు. అవును నాకు  సేమ్‌ ఫీలింగ్‌ గంట లోపల  తేళ్లు జెర్రులు ఉన్నాయోమో అనిపించింది అంటుంది కావ్య.  చీచీ నేను ఎక్కడికి వెళ్లితే అక్కడకు ఫాలో అవుతున్నావా? అంటాడు రాజ్‌. ఎవరైనా రావణాసురుణ్ని, మహిశాసురుణ్ని ఫాలో అవుతారా? అంటూ కౌంటర్‌ ఇస్తుంది కావ్య.

అసలు ప్రశాంతంగా గుడికి వస్తే నువ్వు కనిపించావేంటి? అని అడుగుతాడు రాజ్‌. అవునా ఈ గుడి మీ తాత కట్టించిందేం కాదు కదా అంటుంది కావ్య. మరి మీ తాత కట్టించిందా? అంటాడు రీ కౌంటర్‌ ఇస్తాడు రాజ్‌. అవును కానీ కట్టించలేదు. మా తాత ఈ గుడికి రంగులేశాడంట అని చెప్తుంది. దీంతో రాజ్‌ కోపంగా కావ్యను తిడతాడు. కావ్య కూడా రాజ్‌ ను తిడుతుంది. పూజారి వచ్చి అర్చన చేయడానికి ఇద్దరిని గోత్రనామాలు భార్య, భర్త, పిల్లల పేర్లు చెప్పండి అంటాడు.

రాజ్ తనకు ఇంకా పెళ్లి కాలేదని అబద్దం చెప్తాడు. దీంతో పూజారి ఏదైనా లోపమా బాబు అంటూ మంచి డాక్టర్‌ కు చూపించుకోరాదా? ఇప్పటికే సగం పోయింది ఇంకా లేటయితే పెళ్లి గురించి మరిచిపోవాల్సిందే అంటాడు. కావ్య నవ్వుతుంది. తనకు మాత్రం పెళ్లి అయిందని తన భర్త బూత్‌ బంగ్లాలో క్లీనర్‌ గా పనిచేస్తాడని.. రోజూ తాగి వచ్చి తనను కొడుతుంటాడని చెప్తుంది. దీంతో రాజ్‌ కు చిర్రెత్తుకొచ్చి ఏయ్‌ ఇంక ఆపు అంటాడు. ఆమె తన భర్త గురించి చెప్తుంటే నువ్వు ఆపమంటావేంటి బాబు అంటాడు పంతులు.

అది కాదు పంతులు గారు ఈరోజుల్లో  ఏ మగాడు అలా ఉండట్లేదు అంటాడు. కానీ నాభర్త అలాగే ఉన్నాడని కావ్య చెప్తుంటే అక్కడి నుంచి వెళ్లిపోతూ రాజ్ అరటితొక్క మీద కాలు పెట్టి కింద పడతోతాడు. కావ్య వచ్చి పట్టుకుంటుంది. రాజ్‌ ను అలాగే చూస్తుండిపోతుంది. రాజ్‌ కూడా కావ్యను చూస్తూనే ఉంటాడు. ఇంతలో కావ్య చూశారా? మీరెప్పుడు పడిపోతున్నా నేనే మిమ్మల్ని పట్టుకుంటున్నాను అంటుంది.

రాజ్‌ ఆఫీసుకు  రాగానే ఎంప్లాయీస్‌ అందరూ గేమ్స్‌ ఆడుతూ.. రీల్స్‌ చేస్తూ.. లవర్స్ తో ఫోన్ మాట్లాడుతూ ఉంటారు. రాజ్‌ వచ్చినా ఎవ్వరూ చూడరు పట్టించుకోరు దీంతో రాజ్ ఒక ఎంప్లాయి దగ్గరకు వెళ్లి చెస్‌ లో హెల్ఫ్ చేస్తాడు. దీంతో రాజ్‌ను చూసిన ఎంప్లాయిస్‌ భయపడి ఎవరి టేబుళ్ల దగ్గరకు వాళ్లు వెళ్లిపోతారు. రాజ్‌ శృతిని పిలిచి వీళ్లందరూ పది నిమిషాల్లో మీటింగ్‌ హాల్లో ఉండాలని చెప్తాడు.

శృతి సరేనని చెప్తుంది. ఇవాళ మీ ఉద్యోగాలన్నీ పోయినట్టేనని చెప్తుంది. తర్వాత ఉద్యోగులతో మీటింగ్‌ పెట్టుకున్న రాజ్‌ అందరినీ తిడతాడు. పనులు గాలికి వదిలేస్తే కంపెనీ ఏమైపోతుందని.. నేను తలుచుకుంటే పది నిమిషాల్లో మిమ్మల్నందర్నీ జాబ్‌ నుంచి తీసేస్తానని వార్నింగ్‌ ఇస్తాడు. ఇంతటితో ఇవాళ్టీ బ్రహ్మముడి సీరియల్ ఏపిసోడ్‌ కు ఎండ్‌ కార్డు పడుతుంది.

 

Tags

Related News

Sravanthi Chokkarapu: తెల్లారితే పెళ్లి.. రాత్రికి రాత్రే ఆపని చేసిన  స్రవంతి..బయటపడ్డ నిజాలు!

Intinti Ramayanam Today Episode: భరత్, ప్రణతిలను విడగొట్టిన పల్లవి.. పోలీస్ స్టేషన్ పార్వతి.. నిజం బయటపడిందా?

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు గుడ్ న్యూస్.. బాలును ఇరికించేసిన కల్పన..

Illu Illalu Pillalu Today Episode: భర్తను కాపాడిన భాగ్యం.. నర్మదకు మొదలైన అనుమానం.. శ్రీవల్లి సేఫ్..

Today Movies in TV : ఆదివారం టీవీలల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Big Tv Kissik Talks: వాడి కోసం ప్రాణాలైనా ఇస్తా… థాంక్స్ చెప్పి రుణం తీర్చుకోలేను!

Big Stories

×