Nindu Noorella Saavasam Serial Today Episode: రోడ్డు మీద మనోహరి, చంభా నిలబడి ఉండటం వెనక నుంచి అబ్జర్వ్ చేస్తుంటారు రాథోడ్, అమర్. మనోహరి అటూ ఇటూ చూస్తుంటే.. ఏం వెతుకుతుంది మనోహరి అని అమర్ అడిగితే ఏమో సార్ అంటాడు రాథోడ్. ఇక మనోహరి పార్థు ఎటు నుంచి వచ్చాడని చంభాను అడుగుతుంది. అందుకు చంభా ఇటు నుంచి వచ్చాడు అని చెప్పగానే.. అటువైపు రోడ్డు పక్కన ఉన్న సీసీటీవీ కెమెరాలను గమనిస్తుంది మనోహరి. అయితే ఆ కెమెరాలు వీడియో రికార్డు అయి ఉంటుంది అని చెప్పగానే.. చంభా కోపంగా అంటే నేను అబద్దం చెప్తున్నాను అనుకుంటున్నావా..? మనోహరి ఇప్పుడు నీకు సీసీకెమెరా సాక్ష్యం కావాలా..? అంటూ చెప్పగానే.. నువ్వు అబద్దం చెప్పావు అనడం లేదు.. నువ్వు భ్రమపడి ఉండొచ్చు కదా అంటున్నాని అని మనోహరి చెప్పగానే..
చంభా మరింత కోపంగా నేను దెయ్యాలు, భూతాలను నా కళ్లతో చూసిన దాన్ని పార్థును చూడకుండా చూసినట్టు ఎందుకు భ్రమపడతాను అంటూ చెప్పగానే.. ఏమో పార్థు కూడా దెయ్యమై తిరుగుతుండొచ్చు కదా ఆ అరుంధతిలాగా అంటుంది. కారులో కూర్చున్న అమర్ యాదమ్మతో మనోహరి ఏం చర్చ పెట్టింది రాథోడ్ అంటూ అమర్ అడిగితే.. అదే అర్థం కావడం లేదు సార్ కానీ చూస్తుంటే.. ఏదో సీరియస్ ఇష్యూ లాగానే ఉంది అంటూ రాథోడ్ చెబితే.. ఒక పనిమనిషిని బయటకు తీసుకొచ్చి మనోహరి అంత సీరియస్ గా చర్చించాల్సిన అవసరం ఏముంది అంటూ అమర్ అడిగితే.. రాథోడ్ కోపంగా ఆ యాదమ్మ పనిమనిషి కాదు సార్ మనోహరి మనిషి అని మనసులో అనుకుంటాడు.
ఇక చంభా కోపంగా నువ్వు చంపిన వాళ్లందరూ దెయ్యాలు అవుతారా..? మనోహరి అంటూ అడగ్గానే.. చచ్చిన వాళ్లందరూ దెయ్యాలు అవుతారు కదా అని మనోహరి చెప్తుంది. పార్థు బతికే ఉన్నాడని చెప్పినా నీకు ఇంకా నమ్మకం కలగడం లేదు కదా..? అంటూ చంభా అడిగితే.. నేనేదో కళ్లతో చూస్తే కానీ నమ్మను.. ఆ కెమెరా ఫుటేజీ చూడాలి అని మనోహరి చెబితే.. అవి ప్రైవేటు సీసీటీవీ కెమెరాలు కావు ట్రాఫిక్ ఫోలీసుల కెమెరాలు.. ఫుటేజీ ఎలా చూస్తావు అని చంభా అడిగితే.. పోలీస్ కంట్రోల్ రూంకి వెళ్లి చూద్దాం అంటుంది మనోహరి.
మనం అడగ్గానే చూపిస్తారు మరి మనమేమైనా వీఐపీలమా..? అంటే డబ్బులు ఇద్దాం అప్పటికి వినకపోతే అమరేంద్ర పేరు వాడుకుందాం పదా అంటూ చంభాను తీసుకుని కంట్రోల్ రూంకు వెళ్తుంది. అంతా వెనక నుంచి గమనిస్తుంటారు రాథోడ్, అమర్. మనోహరి కారు స్టార్ట్ చేయడం చూసిన రాథోడ్ సార్ వాళ్లు వెళ్లిపోతున్నారు అని చెప్పగానే.. చూస్తుంటే ఇదేదో అనుమానంగానే ఉంది రాథోడ్ అంటాడు అమర్. మీకు డౌటు స్టార్ట్ అయిందంటే మనోహరికి డౌన్ ఫాల్ స్టార్ట్ అయినట్టే సార్ అని మనసులో అనుకుంటూ సార్ ఆ కారును ఫాలో చేద్దామా..? అంటూ అమర్ సరే అంటాడు. రాథోడ్, మనోహరి కారును ఫాలో చేస్తుంటాడు.
రామ్మూర్తి కూరగాయలు తీసుకుని ఇంటికి వస్తాడు. పార్థు గురించి అడుగుతాడు. పడుకున్నాడు ఇంకా లేవలేదు అని చెప్తుంది మంగళ. అప్పుడే మిస్సమ్మ కాఫీ తీసుకొచ్చి ఇస్తే ఎప్పుడొచ్చావమ్మా నువ్వు కాఫీ తీసుకొచ్చావేంటమ్మా..? ఓసేయ్ ఇంటికి వచ్చిన ఆడపిల్లతో పనులు చేయిస్తావా..? అంటూ మంగళను తిడతాడు రామ్మూర్తి. నేనేం చేయమనలేదు.. తనే చేస్తానంది అంటూ మంగళ చెప్పగానే.. తను చేస్తానంటే నీ బుద్ది ఏమైంది అంటూ తిడుతుంటాడు రామ్మూర్తి. మిస్సమ్మ కూడా ఊరికే పిన్నిని తిట్టకండి నాన్న మన ఇంట్లో పని చేస్తే తప్పేముంది అంటుంది. అలా చెప్పమ్మా ఎప్పుడు చూడు నా మీద ఒంటి కాలి మీద లేస్తాడు. అంటూ మంగళ చెప్తుంటే.. ఓసేయ్ భాగీ ఇక్కడ ఉన్నన్ని రోజులు పీల్చి పిప్పి చేశావు.. ఇప్పుడు కూడానా..? అంటూ తిడుతుంటే.. ఊరుకోండి నాన్న దీపావళి పండగకి మీరు పిన్ని అక్కడకు రమ్మని పిలవడానికి వచ్చాను. మీరోస్తే పిల్లలతో కలిసి పండుగ సంతోషంగా చేసుకుందామంటుంది మిస్సమ్మ. అందుకు రామ్మూర్తి నేను అక్కడికి వచ్చినప్పుడే చెప్పొచ్చు కదమ్మా అంటాడు. సరేలే నాన్నా ఇప్పుడు చెప్తున్నాను కదా అంటుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.