Hyper Aadi:హైపర్ ఆది (Hyper Aadi) .. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. జబర్దస్త్ (Jabardast) లోకి వచ్చినప్పుడు కమెడియన్ గా తన కెరీర్ మొదలుపెట్టి, అతి తక్కువ సమయంలోనే టీం లీడర్ గా ఎదిగి సంచలనం సృష్టించారు. ముఖ్యంగా పంచ్ డైలాగ్ లతో అందరినీ ఆకట్టుకుంటూ, తన కామెడీతో తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న ఆది.. అటు సినిమాలలో కూడా స్టార్ హీరోలకు ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించి అలరిస్తున్నారు. ఇకపోతే ఇప్పుడు జబర్దస్త్ కి దూరమైన ఈయన ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ షోలో మాత్రం బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. అంతేకాదు ఇప్పటికే చాలా మంది నటీమణులను బుల్లితెరకు పరిచయం చేశాడు కూడా. ముఖ్యంగా సినిమాల్లో బాగా ఫేమ్ తెచ్చుకున్న ఆర్టిస్టులను తీసుకొచ్చి.. ఇలా శ్రీదేవి డ్రామా కంపెనీ ద్వారా బుల్లితెరకు పరిచయం చేస్తూ.. షోని రక్తి కట్టించడానికి వారితో పులిహోర కూడా కలుపుతూ ఉంటాడు. దీంతో ఆది పై సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు కూడా వస్తూ ఉంటాయి.
దీపు నాయుడుతో హైపర్ ఆది రిలేషన్..
ఇకపోతే ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లు అవుతున్నా.. ఇంకా పెళ్లి చేసుకోకపోవడం పై అభిమానులు కూడా కాస్త అసహనం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. తమ అభిమాన నటుడు ఎప్పుడు పెళ్లి పీటలు ఎక్కుతారు అని అభిమానులు కూడా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలోనే ఈయన పై పలు రకాల రూమర్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఫలానా నటితో ప్రేమలో ఉన్నాడని ,త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడని.. ఇలా నిత్యం ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఇక ఇప్పుడు ‘జనతా గ్యారేజ్’ ఫేమ్ దీపు నాయుడు(Deepu Naidu) తో ఆది ప్రేమలో ఉన్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇద్దరూ రిలేషన్ లో ఉన్నారని, త్వరలో పెళ్లికూడా చేసుకోబోతున్నారని వార్తలు వినిపిస్తుండగా.. తాజాగా దీనిపై నటి దీపు నాయుడు స్పందించింది.
రిలేషన్ పై క్లారిటీ ఇచ్చిన దీపునాయుడు..
దీపు నాయుడు స్పందిస్తూ..” హైపర్ ఆది నాకు మంచి స్నేహితుడు. సరదాగా నన్ను ఫ్లర్ట్ చేసి.. మాయ మాటలు చెప్పి మోసం చేస్తాడు కానీ మా మధ్య ఎలాంటి రిలేషన్ లేదు. హైపర్ ఆది ప్రొఫెషనల్ గానే నాకు పరిచయమయ్యాడు. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఆదితో కలిసి స్కిట్ చేశాను. అప్పటినుంచి మా ఇద్దరి మధ్య స్నేహబంధం మొదలైంది. ఎప్పుడూ కూడా నన్ను ఫ్లర్ట్ చేస్తూనే ఉంటాడు. నాతో రీల్స్ కూడా చేస్తుంటాడు. పైగా నాతో.. నేను ఏ అమ్మాయి కోసం వీడియోలు చేయను. నీకోసం మాత్రమే చేస్తున్నాను.. నువ్వు ఒక అందమైన అమ్మాయివి అంటూ నన్ను ఫ్లర్ట్ చేస్తూ ఉంటాడు. మొదట్లో ఇది నాకు నచ్చకపోయినా.. క్లోజ్ నెస్ పెరిగిన తర్వాత లైట్ తీసుకున్నాను. ఇప్పుడు నాకు ఆది మంచి ఫ్రెండ్ అయ్యాడు. అతడితో ఎటువంటి వ్యక్తిగత రిలేషన్ లేదు” అంటూ క్లారిటీ ఇచ్చింది దీపు నాయుడు. ‘కేరాఫ్ గోదావరి’ చిత్రంతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన ఈమె.. ‘జనతా గ్యారేజ్’ సినిమాతో మంచి పేరు సొంతం చేసుకుంది. ఇక ‘నక్షత్రం’తో పాటు పలు చిత్రాలలో కీలకపాత్రలు పోషించి ఇప్పుడు టీవీ షోలో ఆకట్టుకుంటోంది.