Rohit Sharma : టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కి ఉన్నటువంటి క్రేజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ముఖ్యంగా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో కీలక ఇన్నింగ్స్ ఆడి ఇండియాకి తన కెప్టెన్సీలో ఓ ట్రోఫీ ని అందించి అందరి మనస్సులను గెలుచుకున్నాడు రోహిత్. 2023 వరకు ఐపీఎల్ లో రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ కి కెప్టెన్ గా కొనసాగాడు. 2024లో అకస్మాత్తుగా హార్దిక్ పాండ్యాను కెప్టెన్ గా నియమించింది ముంబై ఇండియన్స్ యాజమాన్యం. అయినప్పటికీ రోహిత్ శర్మ కీలక ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. మొన్న చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో 76 పరుగులు చేయగా.. నిన్న సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో 70 పరుగులు చేశాడు. దీంతో హైదరాబాద్ మెట్రో లో రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఇండియా కా రాజా రోహిత్ శర్మ అంటూ నినాదాలు చేసుకుంటూ వెళ్లారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది.
స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ టీ-20 క్రికెట్ లో అదిరిపోయే రికార్డును సాధించాడు. ఐపీఎస్ 18 సీజన్ లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ముంబై బ్యాటర్ రోహిత్ శర్మ 46 బంతుల్లో 70 పరుగులు చేశాడు. అయితే హిట్ మ్యాన్ టీ 20 క్రికెట్ లో 12వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. టీమిండియా క్రికెటర్లలో విరాట్ కోహ్లీ తరువాత ఈ ఘనత సాధించిన రెండో భారత ఆటగాడిగా రోహిత్ రికార్డు నెలకొల్పాడు. ఓవరాల్ గా టీ-20లలో 12వేల పరుగుల క్లబ్ లో ఎనిమిదో ఆటగాడిగా నిలిచాడు. ప్రస్తుతం హిట్ మ్యాన్ 12,058 పరుగులు సాధించాడు.
రోహిత్ శర్మ తన 17 ఏళ్ల టీ 20 కెరీర్ లో 8 సెంచరీలు 79 అర్థసెంచరీలు చేశాడు. ఈ ఫార్మాట్ లో పరుగుల పరంగా రోహిత్ కంటే క్రిస్ గేల్ 14,562 పరుగులు, అలెక్స్ హేల్స్ 13,610, షోయబ్ మాలిక్ 13,571, కీరన్ పోలార్డ్ 13,537, విరాట్ కోహ్లీ 13,208, డేవిడ్ వార్నర్ 13,019, జోస్ బట్లర్ 12,469 పరుగులు చేసి ముందున్నారు. రోహిత్ చేసిన టీ 20 పరుగుల్లో 6,700 కి పైగా ఐపీఎల్ లోనే వచ్చాయి. రోహిత్ శర్మ ఐపీఎల్ లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా ఉన్నాడు. రోహిత్ కంటే ముందు విరాట్ కోహ్లీ ఉన్నాడు. రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ జట్టుకు 5 ఐపీఎల్ టైటిల్స్ ను తన కెప్టెన్సీలో గెలిపించాడు. 2024 లో భారత్ కి ఐసీసీ టీ 20 ప్రపంచ కప్ అందించిన తరువాత టీ 20 క్రికెట్ నుంచి రిటైర్డ్ అయ్యాడు.
ఇక నిన్న జరిగిన మ్యాచ్ లో తొలుత సన్ రైజర్స్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 143 పరుగులకే పరిమితమైంది. క్లాసెన్ 47 బంతుల్లో 71 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మిగతా బ్యాటర్లు అంతా విఫలం చెందడంతో తక్కువ స్కోర్ కే హైదరాబాద్ ని కట్టడి చేసింది ముంబై. రోహిత్ శర్మ 70, సూర్యకుమార్ 40 పరుగులతో సత్తా చాటడంతో ముంబై ఘన విజయం సాధించింది. 15.4 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది ముంబై.
THE CRAZE FOR ROHIT SHARMA IN HYDERABAD…!!! 🙇
– Hitman, An Emotion. pic.twitter.com/RReC0SJ4oo
— Johns. (@CricCrazyJohns) April 24, 2025