Illu Illalu Pillalu Today Episode November 16th: ప్రేమ ట్రావెల్ ఓనర్ గా ఉంటుంది అయితే ఇద్దరు భార్యాభర్తలు కలిసి పూజ చేయాలని అనుకుంటారు. ఇక పూజ చాలా సంతోషంగా పూర్తి చేస్తారు ఈ క్రమంలో రామరాజు ఇది నా మొదటి బోని అనుకొని ప్రేమకి ఆ డబ్బులు ఇవ్వమని చెప్తాడు. భార్య తర్వాతే ఎవరైనా కానీ ముందు ఈ బోనీ డబ్బులు నువ్వు ప్రేమకి ఇవ్వు. ముందు నీ భార్యని నువ్వు నమ్మాలి నీ భార్య చేతిలోనే నువ్వు వచ్చిన సంపాదనని పెట్టాలి అప్పుడే నీ జీవితం ముందుకు సాగుతుంది అని రామరాజు భార్యాభర్తల బంధం గురించి గొప్పగా చెప్తాడు. ఇక ప్రేమకి రామరాజు ఇచ్చిన డబ్బులను ధీరజ్ ఇస్తాడు. ఇంట్లోని వాళ్ళందరూ కూడా తన భర్త భార్యకి ఎంత ఇంపార్టెంట్ ఇస్తున్నారో అని సంతోషంగా ఉంటారు. ఇప్పుడే రౌడీలు వచ్చి ఇక్కడ మాకు మామూలు ఇవ్వాలని రచ్చ రచ్చ చేస్తారు.
పూజ అంతా పూర్తి చేసిన తర్వాత అక్కడికి కొంతమంది రౌడీలు వస్తారు. అయితే ఆ రౌడీలు భాగ్యం పంపిన మనుషులు కాబట్టి అక్కడ ట్రాఫిక్ బిజినెస్ ఓపెన్ చేయగానే వీళ్లంతా రచ్చ రచ్చ చేస్తారు. ఈ ఏరియాలో మేమే పెద్ద రౌడీలు మా పర్మిషన్ లేకుండా ఇక్కడ ఎవరు బిజినెస్ స్టార్ట్ చేయడానికి వెళ్ళలేదు ముందు లక్ష యాభై వేలు మాకు కట్టాలి ఆ తర్వాత మీరు ఏ బిజినెస్ అయినా మొదలు పెట్టాలి అని అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ప్రేమ దగ్గర ఉన్న 5000 ఇస్తే ప్రేమ మొహానే కొట్టేస్తారు. నీ చిల్లర డబ్బులు కోసం వచ్చాను అనుకుంటున్నాను చిల్లర మొహం దాన అని అనగానే ప్రేమ చాలా ఫీల్ అవుతుంది ఇక ధీరజ్ ఒక్కసారిగా రెచ్చిపోతాడు. రౌడీలను తుక్కు తుక్కు కొట్టేస్తారు.అయితే ఈ రౌడీలు ఇక్కడికి వచ్చి ఎంత పెద్ద రచ్చ చేయడానికి కారణం వల్లి. ఇది ఒక దరిద్రం ఇది ఎక్కడ కాలు పెడితే అక్కడ ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది అని చందు అనగానే.. అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.
చందు ఆ మాట అనగానే శ్రీవల్లి చాలా బాధపడిపోతుంది. చందు బావ నన్ను ఇలా అంటాడని నేను అస్సలు ఊహించలేదు. నా మీద ఎందుకు బావకు అంత కోపం అని శ్రీవల్లి కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇక ధీరజ్ ఎంత చెప్తున్నా సరే చందు మాత్రం అస్సలు వినకుండా శ్రీవల్లిని ఏదో ఒకటి అంటూనే ఉంటాడు. ఇక్కడ పూజ అయిపోయింది కదా నువ్వు వెళ్ళిపో అక్క ఇక్కడ నేను మాటలు పడాల్సిన అవసరం లేదు అని నర్మదా అంటుంది. ఇక ధీరజ్ కూడా పూజ అయిపోయింది కదా వదినా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటాడు.. ఇక వల్లి పుట్టడితో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మొత్తానికి శ్రీవల్లి ఎంతో సంతోషంగా తన బావ కోసం వస్తే అక్కడ మాత్రం జరిగిన సీను మాత్రం తనకి చాలా నిరాశను కలిగిస్తుంది.
వల్లి ఒంటరిగా నడుస్తూ ఉండగా అంజని వల్లిని చూసి ఈవిడ చందు భార్య లాగా ఉంది మరి ఒంటరిగా వెళ్తుందే ఎక్కడికి వెళ్తుంది అని ఆలోచిస్తూ ఉంటుంది.. లిఫ్ట్ ఇస్తే వస్తుందా లేదా అని ఆలోచిస్తూ అంజలి మళ్లీ దగ్గర కారు ఆపుతుంది. నువ్వు చందు భారీ కదా అని అనగానే అవును మీకు ఎలా తెలుసు అని వల్లి అడుగుతుంది. అయితే రామరాజు గారు మా కుటుంబానికి దగ్గర మంచి కదా ఆయన తెలియని వాళ్ళు ఎవరుంటారు ఆయన భార్యని నిన్న నాకు బతుకమ్మ దగ్గర చెప్పారు అని అనగానే అవునా అని వల్లి నమ్మిస్తుంది. ఇక అంజలితో కారులో ఎక్కి అక్కడికి వెళుతుంది చందు గురించి అన్ని వివరాలను తెలుసుకుంటుంది అంజలి. మళ్లీ దూరంగా ఉందన్న విషయాన్ని మాత్రం తెలుసుకోలేక పోతుంది.
భాగ్యం భద్ర ఇద్దరు కలిసి ప్లాన్ చేసిన ఆ ప్లాను దారుణంగా ఫెయిల్ అవుతుంది. అయితే భాగ్యం భద్ర ఇద్దరు కూడా ఈ రౌడీలు వేస్ట్ గాళ్ళు వీళ్ళని పంపించి నేను చాలా తప్పు చేశాను అని భాగ్యం కూడా చాలా ఫీల్ అవుతుంది. అయితే ఇలాంటి రౌడీలను నమ్ముకుంటే మనము ఏమి చేయలేము అని భాగ్యం చాలా ఫీల్ అయిపోతుంది. కానీ భద్ర మాత్రం ఎంత సంతోషకన్నా ఇప్పుడే కదరా సంతోష్ పడేది పడనివ్వు ఎగిరెగిరి పడేవాడు ఏదో ఒక రోజు కింద పడక తప్పదు అంటూ భద్ర శ్లోకాలు చెప్తుంది అయితే ఆ మాటలు విన్న సేన ఏమైంది అక్క నువ్వు ఇలా మాట్లాడుతున్నావా అనేసి అంటాడు. అయితే భద్ర ఆ చందు ధీరజ్ వాళ్ళని అస్సలు వదిలిపెట్టకూడదు ఏదో ఒక విధంగా వాళ్ళకి నష్టాన్ని చేకూర్చాలి అని పక్క ప్లాన్ చేస్తారు.. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఎలాగైనా సరే చందు కి మరోసారి షాక్ ఇవ్వాలని అనుకుంటారు.
ప్రేమ ధీరజ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా రాలేదేంటి ఎవరూ ఏం చెప్పినా కూడా వీడు వినడ కట్టుకున్న భార్య పక్కన ఉండగానే ఫోన్లో మాట్లాడుతున్నాడు అని ప్రేమ ధీరజ్ని పిలుస్తుంది. ఇక ధీరజ్ తనమై ప్రేమ వచ్చిందని సరసాలు ఆడుతూ ఉంటాడు తినేసేయ్. ఇక ఎస్సై పోస్ట్లు పడబోతున్నాయి అని తెలిసి ఇద్దరు ఒక్కసారిగా సంతోష పడుతూ ఉంటారు మనకు ఇక మీదట అదృష్టం కలిసి వచ్చింది అని అనుకుంటారు. కానీ రామరాజు మాత్రం తన కొడుకు ఒక్కో మెట్టు ఎదుగుతున్నాడు అని ఆకాశం వైపు చూస్తూ తెగ ఖుషిగా మురిసిపోతూ సిగ్గుపడుతూ ఉండగా వేదవతి అక్కడికి వెళ్లి ఏంటి మీ బుగ్గలు సంతోషంతో ఎరుపెక్కాయి అని అనగానే నా చిన్న కొడుకు అనుకున్న మాట ప్రకారమే అన్ని చేస్తున్నాడు అందుకే నాకు చాలా సంతోషంగా ఉంది అని రామరాజు అనుకుంటాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..