Brahmamudi serial today Episode: ఐశ్వర్యను రాజు తిడితే.. స్వతహాగా ఎవ్వరూ టాలెంట్ తో పుట్టరని.. నేర్చుకుంటారని ఇందు చెప్తుంది. అప్పుడే ప్రశాంత్ వచ్చి ఏదో అడిగితే రాజు ఇరిటేట్ అవుతాడు. నన్నే తిడతాడా..? అనుకుంటూ ప్రశాంత్ ఇందును పొగుడుతూ రాజును మరింత ఇరిటేట్ చేస్తాడు. అందరి స్టాల్ కంటే మన స్టాలే నీట్‌గా ఉంది కదా అంటాడు. ప్రశాంత్ ఓవర్ కాన్ఫిడెంట్ వద్దు కానీ బెటర్ బాగానే ఉంది అంటుంది ఇందు. ఇంతకు ముందు నువ్వు ఎలా చేశావో నాకు తెలియదు కానీ నేను వచ్చాక ఇదే ఫస్ట్ ఎగ్జిబిషన్ బిగ్గెస్ట్ డీల్స్ మనకే వస్తాయి చూస్తూ ఉండు అంటాడు. మేడం నాకు ఇదే ఫస్ట్ ఎక్స్‌ఫో కుమ్మేద్దాం మేడం అంటూ ప్రశాంత్ చెబితే.. రాజు కోపంగా నిన్ను ఎవడు అడిగాడురా..? అంటే.. రాజు అతనితో నీకేంటి..? మీ ఇద్దరితో నాకు ఇది ఫస్ట్ ఎక్స్‌ఫో అంటుంది ఇందు.
అప్పుడే నిర్వాహకులు వచ్చి ఎక్స్‌ఫో లో చాలా పెద్ద కంపెనీలు పాల్గొంటున్నాయి. అంటూ ఐశ్వర్య కంపెనీ గురించి ప్రస్తావించకపోతే ఐశ్వర్య షాక్ అవుతుంది. పారు వెటకారంగా మాట్లాడితే.. ఎక్స్ ఫోలో మొత్తం మనల్ని చూసేలా చేస్తానని ఐశ్వర్య చెప్తుంది. ఎక్స్ ఫో ద్వారా హైదరాబాద్‌లో ఉన్న జ్యూవెలరీ కంపెనీలకు ఇంటర్నేషన్ గుర్తింపు వచ్చేలా చేయడమే మన ఈ ఎక్స్‌ఫో ఉద్దేశం అని చెబితే.. మేడం మనకు ఆల్ రెడీ ఇంటర్నేషనల్ గుర్తింపు ఉంది కదా అంటూ ప్రశాంత్ అడిగితే.. ఎంత గుర్తింపు ఉన్నా దాన్ని నిలబెట్టుకోవాలి కదా ఇలాంటి ఎక్స్‌ఫోలో పెట్టినప్పుడు ఎవరి ఉనికి వారు కాపాడుకోవడానికి వస్తారు అంటూ ఇందు చెప్తుంది. ఎంత పెద్ద బిజినెస్ అయినా నెంబర్ వన్‌గా నిలబడటమే ఇంపార్టెంట్ రా ప్రశాంతు అంటూ రాజు చెప్తాడు.
అప్పుడు కస్టమర్లు వస్తుంటారు. ఐశ్వర్య దగ్గరకు ఎవ్వరూ వెళ్లరు.. దాంతో పార్వతీశం వెటకారంగా మాట్లాడుతుంటాడు. అప్పుడే ఒక కస్టమర్ వచ్చి డీటెయిల్స్ అడుగుతుంటే.. ఐశ్వర్య ఎక్స్‌ప్లైన్ చేస్తుంది. ఇందు ఆసక్తిగా చూస్తుంది. ఐశ్వర్యను ఆ కస్టమర్ ఇవన్నీ చాలా పాత డిజైన్స్ లాగా ఉన్నాయని అడిగితే.. నీ ముఖానికి ఇవి పాతవిలా కనిపిస్తున్నాయా..? సంతలో కూరగాయల బేరం చేసిన నీ ముఖం నువ్వు డిజైన్స్ గురించి పేర్లు పెడతావా…? అంటూ ఐశ్వర్య కోపంగా తిడుతుంది. పార్వతీశం వద్దు మేడం అతను మన కస్టమర్ మేడం అంటూ చెప్పినా ఐశ్వర్య వినదు… అతను ఐశ్వర్యను తిట్టి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అంతా గమనించిన రాజు చూశావా..? మీ అక్క ప్రవర్తన కస్టమర్‌తో ఎలా బిహేవ్ చేసిందో.. ఇది స్వరాజ్ కంపెనీకే బ్యాడ్ అంటాడు.
ఇక ఇందు దగ్గర ఎక్కువ కస్టమర్లు ఉండటం చూసిన ఐశ్వర్య పార్వతీశాన్ని చాటుగా వెళ్లి ఇందు స్టాల్ లోని ఐటమ్స్ ను డ్యామేజ్ చేయమని చెప్తుంది. పారు చాటుగా వెళ్లి ఐటమ్స్ డ్యామేజ్ చేస్తాడు. డ్యామేజ్ చేశావా..? అని ఐశ్వర్య అడిగితే చేసే వచ్చాను మేడం అంటూ పారు చెప్పగానే.. అయితే నీకు బోనస్ ఇస్తాను అంటుంది ఎంత మేడం అని పారు అడిగితే వెయ్యినూట పదహారు రూపాయలు అంటూ ఐశ్వర్య చెప్తుంది. ఇందు స్టాల్ దగ్గరకు వెళ్లిన ఒక కస్టమర్ పార్వతీశం డ్యామేజ్ చేసి ఐటమ్ చూసి మీరు కస్టమర్స్‌ను చీట్ చేస్తున్నారా… అంటూ తిడుతుంటాడు. ఐశ్యర్య హ్యాపీగా చూశావా..? పారు నా ప్లాన్ వర్కవుట్ అవుతుంది.
ఇప్పుడు ఈ న్యూస్ ఈ ఎక్స్ ఫో మొత్తం స్ప్రెడ్ అవుతుంది ఇందు వాళ్ల పర్మిషన్ రద్దు చేస్తారు.. అంటూ సంతోషంగా చెప్తుంటే.. పార్వతీశం బయటకు అయ్యో బలే ఇచ్చారు మేడం అంటాడు. అక్కడ ఇందు తన మాటలతో కస్టమర్‌ను కన్వీన్స్ చేస్తుంది. ఇది లేటేస్ట్ ట్రెండ్ అని చెప్తుంది. అందుకు కస్టమర్ కన్వీన్స్ అయి ఇలాంటి సెట్స్ మాకు టెన్ కావాలని నెక్స్ట్ లేటేస్ట్ ఫ్యాషన్ ఏం వచ్చినా ముందు తనకే చెప్పాలని అంటాడు. అంతా వింటున్న ఐశ్వర్య షాక్ అవుతుంది. ఏదో అవుతుంది అనుకుంటే ఇంకేదో అవుతుంది ఏంటి పారు.. అంటుంది ఇందు మేడం ఇండస్ట్రీని ఏలేస్తుంది మేడం.. లోపాన్ని కూడా అద్బుతం అని చెప్పడం ఒక ఆర్ట్ అది అందరికీ రాదు మేడం అంటూ వెటకారంగా మాట్లాడతాడు.
తర్వాత ఇందు ఆ కస్టమర్ దగ్గరకు వెళ్లి నిజం చెప్తుంది. ఆ జ్యెవెలరీలో స్టోన్ మిస్ అయ్యాయి మీకు నేను అబద్దం చెప్పాను.. మీరు మా వల్ల నష్టపోకూడదని ఈ నిజం చెప్తున్నాను నన్ను క్షమించండి అంటూ రిక్వెస్ట్ చేస్తుంది. ఆ కస్టమర్ ఇందును క్షమించి తన డీల్ కంటిన్యూ చేయండి అని చెప్పి వెళ్లిపోతాడు. తర్వాత ఇందు స్టాల్ దగ్గరకు వెళ్తుంది. పారు కింద పడేసిన స్టోన్ చూసి ఎలా పడిపోయాయని అడుగుతుంది. ప్రశాంత్, రాజు ఆశ్చర్యంగా వెతుకుతుంటారు. తర్వాత ఎక్స్‌ఫోలోనే పెద్ద బిజినెస్ జరిగిందని ప్రశాంత్ సంతోషంగా చెబితే.. ఇందు తిడుతుంది. ఇంతలో ఇవాళ్టీ బ్రహ్మముడి ఏపిసోడ్ అయిపోతుంది.